క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్.. సేఫ్టీలో సూపర్ స్టార్: ఈ కారు గురించి తెలుసా?

ఆధునిక కాలంలో కార్లను కొనుగోలు చేసేవారు తప్పకుండా ధర, మైలేజ్ లేదా రేంజ్ వంటి వాటిని మాత్రమే కాకుండా.. సేఫ్టీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను లేదా ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా తమ వాహనాల్లో అధిక భద్రతను కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల యూరోపియన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ లేదా యూరో ఎన్‌సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో రెండవ తరం స్కోడా కొడియాక్ ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా యొక్క కొడియాక్ ఎంక్యూబీ ఈవీఓ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన మోడల్. ఇది ఇటీవల నిర్వహించబడిన యూరో ఎన్‌సీఏపీ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 89 శాతం, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 83 శాతం మరియు పాదచారుల రక్షణలో 82 శాతం స్కోర్ సాధించింది.

Skoda Kodiaq Scores 5 Star Rating In Euro NCAP

కోడియాక్ యొక్క బాడీ షెల్ ఫ్రంటల్ ఆఫ్‌సెట్ పరీక్షలో స్థిరమైన రేటింగ్‌ను పొందింది. డమ్మీలు డ్రైవర్ మరియు ప్రయాణీకుల మోకాళ్లకు, తొడలకు మంచి రక్షణను అందిస్తుందని నిర్దారించబడింది. అంతే కాకుండా ప్రయాణికులకు కూడా ఇది మంచి భద్రత అందిస్తుందని తెలుస్తోంది. ముందు సీట్లు చాలా అనుకూలంగా ఉన్నాయని, తల భాగానికి కూడా కావలసిన రక్షణ లభిస్తుంది టెస్ట్‌లో తెలిసింది. కాబట్టి ఇది వయోజనులకు గట్టి భద్రత ఇస్తుందని ధృవీకరించబడింది.

పిల్లల సేఫ్టీ విషయానికి వస్తే.. కొడియాక్ యొక్క ఫ్రంటల్ ఆఫ్‌సెట్, సైడ్ బారియర్ టెస్ట్‌లు రెండింటిలోనూ 6 సంవత్సరాలు, 10 సంవత్సరాల డమ్మీలను ఉపయోగించారు. ఈ పరీక్షలో పిల్లల శరీర భాగాలకు మంచి రక్షణ లభిస్తుందని తెలిసింది. 10 ఏళ్ల డమ్మీ యొక్క మెడకు కూడా కావాల్సిన రక్షణ లభిస్తుంది. ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ని ఆ సీటింగ్ పొజిషన్‌లో వెనుకవైపు ఉండే చైల్డ్ రెస్ట్రెయింట్‌ని ఉపయోగించడం కోసం డిజేబుల్ చేయవచ్చు.

Skoda Kodiaq Scores 5 Star Rating In Euro NCAP

స్కోడా కొడియాక్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పది ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ సీట్ బెల్ట్ రిమైండర్, లేన్ అసిస్ట్ సిస్టం, డ్రైవర్ ఫెటీగ్ డిటెక్షన్‌ వంటి వాటితో పాటు ఐసోఫిక్స్ మౌంట్, ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రతను అందిస్తాయి.

అడల్ట్ సేఫ్టీ, పిల్లల సేఫ్టీ వంటి టెస్ట్‌లలో స్కోడా కొడియాక్ 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ యొక్క ఈ కారు పటిష్టమైన భద్రతలు కలిగి ఉన్నట్లు నిర్దారించబడింది. కాబట్టి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కోరుకునే కస్టమర్లకు ఇది ఓ మంచి ఎంపిక అవుతుంది. ఇది డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

కొత్త తరం స్కోడా కొడియాక్ గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. 2025 మధ్యలో భారతదేశంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే ఇది సీకేడీ (కంప్లీట్ నాక్డ్ డౌన్) యూనిట్‌గా దేశీయ విఫణికి రానుంది. కాబట్టి ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఇండియన్ మార్కెట్లో 2025లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానికి సంబంధించిన వెలువడాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 16, 2024, 10:34 [IST]
English summary
New gen skoda kodiaq scores 5 star rating in euro ncap crash test
Read more on: #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+