కేవలం టీజర్ విడుదలతో ఓ రేంజ్‌లో అంచనాలు.. అసలు ఈ కారుకు అంత డిమాండ్ ఎందుకు..? దీనిలో ఏముంది?
ఇండియాలో ప్రస్తుతం చాలా మంది ఎస్‌యూవీ(SUV)లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా కొన్ని సెడాన్(SEDAN)లు వీటికి పోటిగా బలమైన అమ్మకాలను సాధిస్తున్నాయి. దీంతో సెడాన్ అభిమానుల కోసం రెండు టాప్ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో మొదటిది మారుతీ సుజుకీ నుంచి వస్తుండగా, రెండోది హోండా అమేజ్. దాదాపు ఆరు ఏళ్ల తరువాత కంపెనీ కొత్త తరం అమేజ్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ కొత్త సెడాన్‌కు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. దీంతో అమేజ్‌పై అంచనాలు పెరిగిపోయాయి. ఆటోమొబైల్ పరిశ్రమలో ఉన్న పోటీని తట్టుకోడానికి అమేజ్ సెడాన్ కంపెనీకి మరింత కీలకం కానుంది. ఈ కారు డిసెంబర్ 4, 2024 న మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.
అమేజ్ మొదటగా 2013లో విడుదల అయింది. దీని పొడవు 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. సెడాన్ మోడల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ కారు భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన లిస్ట్‌లో స్థానాన్ని సంపాదించుకుంది. ఇది విజయవంతమైన మోడల్‌గా నిలవడంతో కంపెనీ 2018లో రెండో తరం అమేజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా ఈ సెడాన్ అత్యాధునిక ఫీచర్లతో వచ్చింది.

మళ్లీ ఇప్పుడు కంపెనీ అమేజ్‌లో కొత్త తరం మోడల్‌ను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించింది. 3వ తరం అమేజ్ సైజ్ కూడా 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని టీజర్‌ను చూస్తే తెలుస్తుంది. దాని పాత మోడల్ కంటే డజన్ల కొద్ది క్యాబిన్ ఫీచర్లతో వస్తుంది. కారుపై అమేజ్ లోగోతో పాటు అకార్డ్ స్ఫూర్తితో రీడిజైన్ చేయబడిన గ్రిల్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
క్యాబిన్‌లో ఉన్న ఫీచర్లపై స్పష్టమైన సమాచారం లేదు. అయితే మార్కెట్ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఫంక్షనల్ డ్యాష్‌బోర్డ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. కారులో ఉన్న సీట్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇంటీరియర్ లగ్జరీ ఫీలింగ్‌ను కలిగిస్తుంది. కారులో ఉన్న టచ్ స్క్రీన్ ద్వారా అన్ని ఫంక్షన్లను ఆపరేట్ చేయవచ్చు. అలాగే ఈ కారు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను పొందుతుంది.
ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న హోండా అమేజ్ 1.2-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 90 bhp పవర్, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ముఖ్యంగా మాన్యువల్, CVT గేర్‌బాక్స్ ఎంపికలతో వచ్చింది. 3వ తరం కొత్త అమేజ్‌లో కూడా ఇదే ఇంజిన్‌ను లేదా మరింత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఇంజిన్ అందించే అవకాశం ఉంది.
భద్రత పరంగా కూడా ఈ కారులో మరిన్ని అదనపు హంగులు ఉన్నాయి. లోపల ఉన్న ఐదు సీట్లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు ఉన్నాయి. ముఖ్యంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోతే ప్రయాణికులకు గుర్తు చేయడానికి సీట్‌బెల్ట్ రిమైండర్‌లు వంటి భద్రతా ఫీచర్‌ను ప్రామాణికంగా ఇచ్చారు. పవర్ ట్రెయిన్‌లో పాత 2వ తరం మోడల్‌తో పోలిస్తే పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.
కొత్త హోండా అమేజ్ ప్రస్తుత మోడల్ ధర కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా, ఇది రూ. 7.3 లక్షల నుండి రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని తెలుస్తుంది. ఈ సెడాన్ హ్యుందాయ్ ఆరా, టాటా టిగోర్ సెడాన్‌లకు గట్టి పోటీని ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబర్‌లో అమేజ్‌ను తీసుకురావడానికి షెడ్యూల్ చేయగా, దాని కంటే ముందే బుకింగ్స్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








