Hyundai Creta Facelift: ఫీచర్డ్ ప్యాక్‌గా కొత్త హ్యుందాయ్ క్రెటా.. ఇన్ని సేఫ్టీ ఫీచర్లు ఎక్కడా చూసి ఉండరు.!!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. ఇటీవలే కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఆవిష్కరించింది. క్రెటా ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లో ఈ నెల 16న విడుదల కానుంది. ఈ క్రమంలో Hyundai Creta Facelift ఫొటోలను సంస్థ విడుదల చేసింది.
భారత మార్కెట్లో హ్యుందాయ్ కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆకర్షణీయమైన డిజైన్, లుక్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లు, మెరుగైన పర్ఫామెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటీనటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె.. బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న హ్యుందాయ్ క్రెటాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తన సెగ్మెంట్లో హ్యుందాయ్ క్రెటా అత్యుత్తమ SUVగా స్థానం సంపాదించుకుంది. అందుకే క్రెటాను సంస్థ ఎప్పుడూ టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్ చేస్తూ వస్తోంది. తద్వారా కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు లగ్జరీ సౌకర్యాలతో డిజైన్, ఆధునిక సాంకేతికత, అధునాతన ఫీచర్లు, బిల్ట్ క్వాలిటీతో లాంచ్‌కు సిద్ధంగా ఉంది.
కొత్త 2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను చాలా ఫీచర్లతో అప్‌డేట్ చేశారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్, రివర్స్ పార్కింగ్ కెమెరా, సీట్‌బెల్ట్, స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటు మొత్తంగా 70 సేఫ్టీ ఫీచర్లను సంస్థ అందిస్తోంది. అంతేకాకుండా, హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో Level-2 ADASని కూడా చేర్చింది. తద్వారా ఈ కారు మరింత సురక్షితమైన కారుగా మారింది.

కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 7-వేరియంట్‌లతో సహా పలు రకాల కలర్ ఆప్షన్‌లతో అందుబాటులోకి వస్తోంది. E, EX, S, S(O), SX, SX Tech, SX(O) వేరియంట్‌లతో సంస్థ తీసుకువస్తోంది. ఇక కలర్స్ విషయానికొస్తే.. ఎమరాల్డ్ పెరల్, పైరీ రెడ్, రేంజర్, ఖాకీ, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే రంగులతో పాటు, బ్లాక్ రూఫ్‌తో అట్లాస్ వైట్ డ్యూయల్ టోన్ షేడ్‌లో క్రెటాను ప్రవేశపెట్టింది.
కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటల్ క్లస్టర్ స్క్రీన్‌లతో కూడిన పెద్ద డ్యాష్‌బోర్డ్, లేటెస్ట్ గ్రాఫిక్స్‌తో కూడిన ప్రీమియం లెథెరెట్ సీట్లు, లెథెరెట్ డోర్ ఆర్మ్‌రెస్ట్ కవరింగ్, లెథెరెట్ డి-కట్ స్టీరింగ్ వీల్, లెథెరెట్ షిఫ్టర్ మరియు రేడియంట్ ఇంటీరియర్‌తో ఆకర్షణీయంగా ఉంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ విషయానికొస్తే విశాలంగా రూపొందించారు. బ్యాక్ సీట్ 2 - స్టెప్ రిక్లైన్ ఫంక్షన్, లగ్జరీ ప్యాకేజీతో సౌకర్యంగా ఉంటుంది. కాగా కొత్త హ్యుందాయ్ క్రెటా కేవలం ఎస్‌యూవీ మాత్రమే కాదని, ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కొత్త యుగానికి నాంది పలికేందుకు సిద్ధంగా ఉందని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా స్పష్టం చేసింది.
కొత్త Creta 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు, 1.5 లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో సంస్థ ప్రవేశపెడుతోంది. ఈ ఇంజన్ 160 BHP శక్తిని ఉత్పత్తి చేస్తుందని హ్యుందాయ్ తెలిపింది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్, IVT, 7 స్పీడ్ DCT, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో రానున్నట్లు సమాచారం.

కాగా కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్ లేదా సమీప డీలర్‌షిప్‌లో రూ. 25,000 చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. క్రెటా లాంచ్ రోజు ధరకు సంబంధించిన పూర్తి సమాచారం, ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications








