Hyundai Creta : అదిరిపోయే ఫీచర్లతో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. ఓ లుక్కేయండి!!
భారత మార్కెట్లో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయించే ప్రముఖ కంపెనీల్లో హ్యుందాయ్ మోటార్స్ ఒకటి. వాటిలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. ప్రతి యేటా హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta Facelift) కార్ల సేల్స్ సంతృప్తికర స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో హ్యుందాయ్ క్రెటా ఫీస్‌లిఫ్ట్ విడుదల కానుంది. దీనికి సంబంధించి ఆసక్తికర సమాచారం వెల్లడైంది.
ఈ నేపథ్యంలో ఇటీవల హ్యుందాయ్ మోటార్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణెను సంస్థ నియమించిన సంగతి తెలిసిందే. త్వరలో మార్కెట్‌లోకి రానున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌కు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్(Shahrukh Khan), దీపికా పదుకొణె(Deepika Padukone) అంబాసిడర్‌లుగా నటించిన వీడియోకు సంబంధించి టీజర్ విడుదలైంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్(Hyundai Creta Facelift Teaser) టీజర్ ద్వారా ఈ కొత్త కారుపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఫీచర్లు, డిజైన్, ఇతర స్పెసిఫికేషన్లు ఎలా ఉండబోతున్నాయే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి పలు చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
హ్యుందాయ్ మోటార్స్ విడుదల చేసిన ఫొటోలను పరిశీలిస్తే.. క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీ ఫీచర్‌లో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగుల(Airbags)ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కస్టమర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పవచ్చు. ఇప్పటికే హ్యుందాయ్‌కు చెందిన ప్రముఖ మోడల్ కార్లలో సంస్థ ఆరు ఎయిర్‌బ్యాగులను ప్రవేశపెట్టింది.
ఇంకా కొత్త హ్యుందాయ్ క్రెటాలో ఎంపిక చేసిన వేరియంట్లలో SmartSense Level 2 ADAS ఫీచర్‌ను అందుబాటులోకి రానుంది. అంతే కాకుండా ఇందులో 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్- వీల్ డిస్క్ బ్రేక్‌లు, ఇంకా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(EBC) వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఇక నాణ్యతా పరంగా హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ బాడీని అత్యంత పటిష్ఠంగా నిర్మించారు. కఠిన పరిస్థితుల్లో కూడా ప్రయాణికులకు హ్యుందాయ్ క్రెటా బిల్డ్ క్వాలిటీ రక్షణనిస్తుందని ఫొటోల ద్వారా తెలుస్తోంది. దీని ద్వారా ప్రయాణికులు ఎలాంటి ఆందోళన లేకుండా హ్యాపీగా జర్నీ చేయవచ్చు.

కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ భద్రతా ఫీచర్ల పరంగానే కాకుండా ఇంటీరయర్ పరంగా సరికొత్త ఫీచర్లను కలిగి ఉంది. 10.25 అంగుళా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 8- స్పీకర్ బాస్ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఇక అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్లతో వస్తుంది.
కాగా కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ టీజర్ రిలీజ్ అయిన రోజే ఈ కారు బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ క్రెటాను కొనుగోలు చేయాలనుకునేవారు సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా.. సమీప డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు. లాంచ్, కారు ధర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. మార్కెట్లో టాప్ కంపెనీల కార్లతో పోటీ పడనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కియా సెల్టోస్(Kia Seltos), మారుతి గ్రాండ్ విటారా(Maruti Grand Vitara), హోండా ఎలివేట్(Honda Elevate), వోక్స్‌వ్యాగన్ టిగన్ వంటి ప్రీమియం కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications








