Kia Seltos 2024 మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ‘కియా సెల్టోస్ డీజిల్ వెర్షన్' లాంచ్.. ప్రత్యేకతలివే.!!
దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా కొత్త కియా సెల్టోస్(Kia Seltos Diesel Manual Variants) 2024 SUV ని డీజిల్ వెర్షన్‌ను సరికొత్తగా మార్కెట్లోకి నేడు విడుదల చేసింది. కియా సెల్టోస్ SUV యొక్క డీజిల్ వెర్షన్‌ను మాన్యువల్ గేర్‌బాక్స్‌తో సంస్థ ప్రవేశపెట్టింది. ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
2024 కొత్త కియా సెల్టోస్(Kia Seltos Diesel Version) డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.11,99,900 నుంచి రూ.18,27,900 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ కారును సంస్థ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందిస్తోంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 114 bhp మరియు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ iMT మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో జత చేయబడి ఉంటుంది.

కొత్త కియా సెల్టోస్ HTE, HTK, HTK+, HTX మరియు HTX+తో వేరియంట్లలో అందుబాటులో ఉండగా.. ఈ వేరియంట్లను ఇప్పుడు కస్టమర్లు 6-స్పీడ్ డీజిల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా కొత్త కియా సెల్టోస్‌లో 32 సేఫ్టీ ఫీచర్లను సంస్థ అందిస్తోంది. కాగా అన్ని వేరియంట్లలో 15 సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తాయి.
కాగా 17 లెవెల్-2 ADAS టెక్‌ని చేర్చడం వలన సెల్టోస్.. వాహన భద్రతలో మరింత ప్రాధాన్యతనిస్తోంది. ఇక సేఫ్టీ ఫీచర్ల పరంగానే కాకుండా.. ఇందులో లగ్జరీ ఫీచర్ల ప్యాక్ ఉంది. 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ క్లస్టర్‌తో పాటు అదే సైజ్‌లో HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో కూడిన డ్యూయల్-స్క్రీన్ పనోరమిక్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

అంతే కాకుండా కొత్త సెల్టోస్ క్యాబిన్‌లో డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్‌ను అందిస్తోంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారుకు అదనపు ఆకర్షణనిస్తోంది. డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌లు ఇందులో చెప్పుకోదగినవి. 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్లతో వస్తుంది.
కాగా కస్టమర్లకు విస్తృత శ్రేణి డ్రైవింగ్ ఆప్షన్లను అందించడంలో కంపెనీ అంకిత భావం ప్రదర్శిస్తోందని కియా ఇండియా చీఫ్ సేల్స్ మరియు బిజినెస్ స్ట్రాటజీ ఆఫీసర్ మ్యుంగ్-సిక్ సోహ్న్ అన్నారు. చాలా మంది కస్టమర్‌లు మాన్యువల్ గేర్‌బాక్స్‌ను డిమాండ్ చేయడంతో.. కంపెనీ కియా సెల్టోస్ డీజిల్ వేరియంట్‌లలో ఈ ఆప్షన్‌ను అందిస్తోందని తెలిపారు.
కాగా 2019లో మొదటిసారిగా కియా సెల్టోస్ మార్కెట్లోకి విడుదలైంది. ఆకర్షణీయమైన డిజైన్, సరికొత్త టెక్నాలజీ, అధునాతన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దేశీయ మార్కెట్లో తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తాజాగా డీజిల్ వెర్షన్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ లాంచ్‌తో సేల్స్ మరింతగా పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








