Kia Sonet Facelift 2024 కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌.. ధర రూ. 7.99 లక్షలు

భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీసంస్థ కియా మోటార్స్‌ ఇండియా.. నేడు(జనవరి 12) కియా సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ను ఆవిష్కరించింది. కాగా గత డిసెంబర్‌లో అప్‌డేటెడ్‌ కియా సోనెట్‌ను సంస్థ ఆవిష్కరించింది. బుకింగ్‌లు కూడా ప్రారంభం కాగా ఈ రోజు Kia Sonet Facelift 2024ను అధికారికంగా లాంచ్‌ చేసింది. ధర, పూర్తి సమాచారం ఈ కథనంలో..

2020 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారిగా కియా సోనెట్‌(Kia Sonet Facelift Launch) భారత మార్కెట్లో లాంచ్‌ అయింది. ఆ సమయంలో ఆకర్షణీయమైన ఫీచర్లు, టెక్నాలజీతో ప్రవేశపెట్టబడిన కియా సోనెట్.. ఇప్పుడు మరిన్ని సేఫ్టీ ఫీచర్లు, మరింత అధునాతనంగా విడుదలైంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో దీనిని రూపొందించారు. ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

Kia -Sonet-Facelift-2024

ఈ కారు HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+, X లైన్‌ వేరియంట్లతో సహా 11 ఆకర్షణీయమైన రంగుల్లో సంస్థ దీనిని ప్రవేశపెట్టింది. కాగా కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ SUV ప్రారంభ ధర రూ.7.99 లక్షలుగా ఉంది. టాప్‌ ఎండ్‌ ధర రూ 15.69 లక్షలుగా ఉంది. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. కాగా ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

Kia -Sonet-Facelift-2024

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు వైపున టైగర్ నోస్ ఆకారపు గ్రిల్, వినూత్న క్రౌన్ జ్యువెల్ LED హెడ్‌ల్యాంప్‌లతో పాటు ఆకర్షణీయమైన LED DRLలతో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. సైడ్ లుక్‌ మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నా.. ఇందులో 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Kia -Sonet-Facelift-2024

కాగా కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లలో సంస్థ ప్రవేశపెట్టింది. ఇందులోని 1.2-లీటర్ నేచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్ 82 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరో 998 సీసీ టర్బో ఛార్జ్డ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 182 బిహెచ్‌పి పవర్, 172 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

పెట్రోల్ కార్లలో వేరియంట్‌లను బట్టి 5-స్పీడ్ మ్యాన్యువల్ 6-స్పీడ్ IMT, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటాయి. 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌.. 114 bhp శక్తిని, 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ IMT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (గేర్‌బాక్స్)ని కలిగి ఉంటుంది.

Kia -Sonet-Facelift-2024

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ SUV మైలేజీ విషయానికొస్తే.. ఈ కారు యొక్క పెట్రోల్ వేరియంట్‌లు 18.70 kmpl - 19.20 kmpl ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. డీజిల్ వేరియంట్‌లు 18.60 kmpl - 22.30 kmpl మైలేజ్‌ను ఇస్తున్నట్లు సమాచారం.

కొత్త Kia Sonet Facelift లో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, కియా కనెక్ట్ సూట్, OTA అప్‌డేట్, సెంట్రల్ ఎయిర్ వెంట్స్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్, 4-వే పవర్ డ్రైవర్ సీట్, 7-స్పీకర్ ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది.

Kia -Sonet-Facelift-2024

కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో భద్రతా పరంగా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), హిల్ అసిస్ట్, ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్ ఫీచర్లతో పాటు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ను కలిగి ఉండటం ద్వారా మరింత సేఫ్టీ ఉండనుంది.

Kia -Sonet-Facelift-2024

కాగా కియా సోనెట్(Kia Sonet 2024) కారు బుకింగ్‌లు కూడా ముందుగానే ప్రారంభమయ్యాయి. కస్టమర్లు రూ. 25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. ప్రారంభ ధర తక్కువగా ఉండటంతో పాటు అత్యాధునిక ఫీచర్లు, మరింత సేఫ్టీగా వస్తుండటంతో రానున్న రోజుల్లో సోనెట్ ఎస్‌యూవీకి స్పందన ఎలా ఉందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, January 12, 2024, 14:02 [IST]
English summary
New kia sonet facelift 2024 launched in india price at rs 7 99 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+