రూ. 7.50 లక్షలకే మహీంద్రా XUV 3X0 లాంచ్.. అదరగొట్టే మైలేజ్, ఫీచర్లు
భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XUV 3XO ను నేడు సంస్థ లాంచ్ చేసింది. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్, ఫీచర్ల పరంగా భారీ మార్పులు చేస్తూ XUV300 కారు మోడల్‌కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా తీసుకువచ్చింది. ధర, ఇంజిన్, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
కస్టమర్లకు అత్యుత్తమ రైడ్ అనుభూతిని అందించేందుకు మహీంద్రా XUV 3XO కారులో పలు మార్పులు చేసింది. ముందు, మరియు వెనుక భాగంలో చాలా మార్పులను చూడవచ్చు. భారతీయ రోడ్లకు అనుగుణంగా సంస్థ దీనిని రూపొందించింది. తొమ్మిది విభిన్న వేరియంట్లు.. MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5L, AX7 మరియు AX7L లలో సంస్థ తీసుకువచ్చింది.

వేరియంట్లను బట్టి మహీంద్రా XUV 3XO ధర రూ. 7.49 లక్షల నుంచి 15.49 లక్షల మధ్య సంస్థ లాంచ్ చేసింది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ఇక లుక్ పరంగా మహీంద్రా ఈ కారును అత్యుత్తమంగా డిజైన్ చేసింది. డ్రైవర్లకు బెస్ట్ విజిబిలిటీ అందించేలా డిజైన్ చేశారు.
ఈ కారు 350 మి.మీ లోతు వరకు నీళ్లలో సులభంగా ప్రయాణించగలదని మహీంద్రా పేర్కొంది. దీంతో పాటు మరెన్నో సామర్థ్యాలతో మహీంద్రా XUV 3XO ను ది బెస్ట్‌గా తీసుకువచ్చింది. ఇక భద్రత పరంగా కూడా మహీంద్రా ఈ కారును ఉత్తమంగా తీర్చిదిద్దింది. ముందు మరియు వెనుక వైపులా హై-స్పీడ్ తాకిడిని తట్టుకునేలా డిజైన్ చేశారు.

మహీంద్రా XUV 3XO లో 10.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే సిస్టమ్‌కు మద్దతిస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు లెదర్‌తో చుట్టబడిన సీట్లు కూడా అందించబడతాయి.
అదేవిధంగా అలెక్సా, 7-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ కిట్, సెవెన్-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఈ కారులో ముఖ్యమైన ఫీచర్లుగా ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల పరంగా మహీంద్రా XUV 3X0 లో ది బెస్ట్ అని చెప్పవచ్చు.

ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 4 డిస్క్ బ్రేక్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్‌తో కూడిన 3-పాయింట్ సీట్ బెల్ట్‌ను అన్ని సీట్లకు అమర్చారు. ఇంకా Iso-Fix చైల్డ్ సీట్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్లను అన్ని వేరియంట్లలో సంస్థ అందించడం విశేషం. ఇది కాకుండా, XUV 3XO లో వెహికల్ డైనమిక్స్ కంట్రోల్ ఉంది.
ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, రోల్ ఓవర్ మిటిగేషన్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ బ్రీఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, ఈ కారులో అందించబడిన లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలు) అత్యంత ముఖ్యమైన ఫీచర్.

అందువల్ల, XUV 300 మోడల్‌తో పోలిస్తే XUV 3XO ప్రయాణీకులకు ఫుల్ సేఫ్టీని అందిస్తుంది. కాగా మహీంద్రా XUV300 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కార్ మోడల్ కావడం గమనార్హం. కొత్త అటాస్ ఫీచర్ ద్వారా క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్ మరియు లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లను అందిస్తోంది.
మహీంద్రా XUV 3XO ఈ కారు మూడు ఇంజన్ ఆప్షన్లతో సంస్థ ప్రవేశపెట్టింది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ మోటార్‌ను తీసుకువచ్చింది. ఈ కారులో అందించబడిన మోటార్ 1.2 లీటర్ Mstalion DGTI, 1.2 లీటర్ DCMPFI మరియు 1.5 లీటర్ CRTE ఆప్షన్లకో పనిచేస్తాయి. దీంతో పాటు, XUV 3XO లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించబడుతుందని మహీంద్రా ప్రకటించింది.

మైలేజ్ పరంగా మహీంద్రా XUV 3X0 అత్యుత్తమమైనది. ఈ కారు లీటరుకు 18.89 కి.మీ నుండి 21.1 కి.మీ మైలేజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. కాబట్టి ఈ కారు అమ్మకాల పరంగా సంస్థ ఆశాజనకంగా ఉంది. మహీంద్రా XUV 3XO లాంచ్ టాటా నెక్సాన్‌కు భారీ పోటీని ఇవ్వనుంది. ఈ కొత్త SUV బుకింగ్‌లు మే 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు మే 26 నుండి ప్రారంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications








