ఆ 5 స్టార్‌ రేటింగ్‌ కారుకి తొలి ప్రమాదం.. సైడ్‌ నుంచి ఢీకొట్టిన ఆటో.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

మారుతి సుజుకి ఇండియా కార్లకు సేఫ్టీ చాలా తక్కువ అనే అపోహా ఉండేది. దీనిని పటాపంచలు చేస్తూ నవంబర్ 11 న మార్కెట్‌లో విడుదలైన 4th జనరేషన్ డిజైర్ సెడాన్‌ గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌తో దుమ్మురేపింది. దీంతో మారుతి కార్లకు స్వర్ణయుగం వచ్చిందని చాలామంది ఆటో నిపుణులు కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క మారుతి కారుకి 5 స్టార్ రేటింగ్‌ రాలేదు. తొలిసారి క్రాష్‌ టెస్ట్‌లో అదరగొట్టి వార్తల్లో నిలిచింది. వాస్తవానికి డిజైర్‌ మోడల్స్‌ మాస్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పుడు మంచి సేఫ్టీ ఫీచర్లతో సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

తాజాగా మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ సరికొత్త మారుతి సుజుకి డిజైర్‌కి యాక్సిడెంట్‌ జరిగింది. కారు సైడ్‌ డోర్‌ని ఆటో రిక్షా ఢీకొట్టింది. దీంతో కారులోని ఎక్స్‌టీరియర్‌ భాగాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. అందరు క్షేమంగా బయటపడ్డారు. ఈ యాక్సిడెంట్‌ ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తుంది. అయితే కారు యజమాని మాత్రం భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని వాపోయాడు.

New Maruti Suzuki Dzire First Accident

ఎన్నో సందేహాలు: గల్లీ లోంచి అతివేగంగా వచ్చిన ఆటో కారుని సైడ్‌ ఫ్రొఫైల్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తప్పిదం లేదు. అయితే చిన్నపాటి యాక్సిడెంట్‌కి కారు డెంటింగ్‌తో పాటు బాడీ పూర్తిగా దెబ్బతిన్నాయి. మహీంద్రా, టాటా కార్లతో పోల్చితే బిల్డ్‌ క్వాలిటీ అంతగా లేదని ప్రజెంటర్‌ వెల్లడించాడు. యాక్సిడెంట్‌ తీవ్రత ఎక్కువగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అతను అభిప్రాయపడ్డాడు.

అయితే కార్ల సేఫ్టీ కారు 'బాడీ' (ఎక్స్‌టీరియర్‌ బిల్డ్‌ క్వాలిటీ)పై ఆధారపడి ఉండదు. కేవలం కారులోని ఛాసిస్, కారు కలిగి ఉన్న ఎయిర్‌బ్యాగ్స్‌, ఇతర సేఫ్టీ ఫీచర్లు ద్వారా సేఫ్టీ రేటింగ్‌ నిర్ణయిస్తారు. ఫ్రంటల్‌, సైడ్‌, రియర్‌ ఇంపాక్ట్‌ క్రాష్‌ టెస్టుల్లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా రేటింగ్‌ ఇస్తారు. గ్లోబల్ NCAP ప్రమాణాలకు లోబడి సేఫ్టీ రేటింగ్‌ ఇస్తారు. ఆ తర్వాత క్రాష్‌ టెస్ట్‌ వీడియోను విడుదల చేస్తారు.

New Maruti Suzuki Dzire Accident Video

ఇవన్నీ టెస్టుల తర్వాతే మారుతి సుజుకి డిజైర్ సెడాన్‌ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించింది. పెద్దల సేఫ్టీలో ఈ కారు 34కు 31.24 స్కోర్‌ని, చైల్డ్ ప్రొటెక్షన్ కేటగిరీలో 42కు 39.20 స్కోర్‌ సాధించింది. ఓవరాల్‌గా 5 స్టార్ రేటింగ్‌తో అదరగొట్టింది. ఈ క్రాష్‌ టెస్ట్‌లో, డ్రైవర్‌, ముందు ప్రయాణికుడి తలకు, మెడ సేఫ్టీ ఎక్కువ ఉన్నట్లు తేలింది. వెనక ప్రయాణీకులకు కూడా మంచి సేఫ్టీ లభిస్తుంది.

డ్రైవర్ ఛాతీకి సేఫ్టీ కొంచెం తక్కువగా ఉంది. ఇక డ్రైవర్, ప్రయాణికుడి మోకాళ్లకు తగినంత సేఫ్టీ లభించనుంది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో ప్రయాణికుల తల, ఛాతీ, పొత్తికడుపు, నడుము భాగాలకు మంచి సేఫ్టీ లభిస్తుంది. ఇక ఇందులో సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, 3 పాయింట్ల సీట్ బెల్ట్స్ అమర్చారు.

ధర: ఈ కారు ధర రూ .6.79 లక్షల నుండి రూ .10.14 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్‌తో నడుస్తుంది. ఇది లీటరుకు 24.79 నుంచి 33.73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ కారులో 5 మంది హాయిగా వెళ్లవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం భారీ ఫీచర్లు సైతం ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 26, 2024, 13:42 [IST]
English summary
New maruti suzuki dzire first accident video gone viral check impact of the car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+