రోజుకు 1000 మంది కొంటున్న కారు ఇదే.. ఎక్కువగా 2 వేరియంట్లే కావాలంటున్నారు.. అంత డిమాండ్ ఉన్న మోడల్ ఏదంటే!
భారత్‌లో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ దారుగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ ఇండియా ఇతర కంపెనీల కంటే వేగంగా వరుసగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. 2024 ఏడాదిలో కార్ల విక్రయాల పరంగా మెరుగైన ఫలితాలను సాధించింది. ముఖ్యంగా ఇటీవల ముగిసిన దసరా, దీపావళి పండుగ సమయంలో మారుతీ వినియోగదారులను మరింత ఆకట్టుకోడానికి తన కార్లపై భారీ ఎత్తున తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు, డిస్కౌంట్లను అందించింది. కొత్త కారును కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తగ్గింపు ధరలో కారను ఇంటికి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే ఇటీవల విడుదల అయిన కొత్త తరం మారుతీ సుజుకీ డిజైర్ బుకింగ్స్ పరంగా దూసుకుపోతోంది. పాత మోడల్ ఏ విధంగా అయితే ప్రజల నుంచి మంచి ఆదరణ సంపాదించిందో, ఇదే తరహాలో ఈ నాల్గవ తరం కూడా బాగా క్లిక్ అవుతుంది.
తాజాగా విడుదలైన డేటా ప్రకారం, 4వ తరం మారుతీ సుజుకీ డిజైర్ రోజుకు 1,000 బుకింగ్‌లను సాధిస్తుంది. ఈ రేంజ్‌లో బుకింగ్స్ అంటే కారుకు ప్రజల్లో డిమాండ్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. అయితే పాత మోడల్ 3వ తరం డిజైర్ రోజుకు దాదాపు 500 బుకింగ్‌లను సాధించిందని తయారీదారు వెల్లడించింది. ఇది ప్రస్తుతం 4 వ తరం బుకింగ్స్‌లలో సగం సాధించినట్లు డేటాను చూస్తే తెలిసిపోతుంది.

మరో కీలక విషయం ఏమిటంటే కొత్త తరం డిజైర్ బుకింగ్స్‌లో ఎక్కువ మంది వినియోగదారులు మొదటి రెండు వేరియంట్లను ఎంచుకున్నారు. మిగతా వేరియంట్లను మాత్రం చాలా తక్కువగా బుకింగ్స్ చేసుకున్నారని మారుతీ సుజుకీ వెల్లడించింది. ఈ కారు ప్రారంభ ధర రూ.6.79 లక్షల నుంచి మొదలుకుని రూ.10.14 లక్షల వరకు ఉంటుంది. మొదటి రెండు వేరియంట్ల ధరలు రూ. 8 లక్షల లోపు ఉంటాయి.
2024 కొత్త తరం మారుతీ డిజైర్ LXi, VXi, ZXi, ZXi+ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి మాన్యువల్, ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి ధరలు ఒకసారి చూసినట్లయితే, LXi మాన్యువల్ గేర్‌బాక్స్(ఎంటీ) ధర రూ.6.79 లక్షలు, VXi ఎంటీ ధర రూ.7.79 లక్షలు, VXi ఏఎంటీ ధర రూ.8.24 లక్షలుగా ఉంది.

VXi ఏఎంటీ సీఎన్‌జీ ధర రూ. 8.74 లక్షలు, ZXi ఎంటీ రూ.8.89 లక్షలు, ZXi ఏఎంటీ రూ. 9.34 లక్షలు, ZXi ఎంటీ సీఎన్‌జీ ధర రూ.9.84 లక్షలు, ZXi+ ఎంటీ ధర రూ. 9.69 లక్షలు, ZXi+ ఏఎంటీ రూ. 10.14 లక్షలుగా ఉంది. ఇవన్నీ మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటు ధరలోనే లభిస్తున్నాయి. మొదటి రెండు వేరియంట్ల ధరలు తక్కువగా ఉండటంతో వీటికి మంచి డిమాండ్ వచ్చింది.
మారుతీ సుజుకీ డేటా ప్రకారం, ZXi ,ZXi+ వేరియంట్లు మొత్తం బుకింగ్స్‌లో దాదాపు 50 శాతానికి పైగా వాటా సంపాదించాయి. కంపెనీ నవంబర్ 4 వ తేదీన కొత్త తరం డిజైర్ కోసం బుకింగ్స్‌ను ఓపెన్ చేసింది. ఆ తర్వాత నవంబర్ 11న మార్కెట్లోకి అధికారికంగా ప్రారంభించింది. తక్కువ కాలంలో ఈ కొత్త కారు ప్రజల నుంచి మంచి ఆదరణ సంపాదిస్తుండటంతో కంపెనీ సంతోషం వ్యక్తం చేస్తుంది.

మారుతీ సుజుకీ డిజైర్ మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్ లీటర్‌కు 24.79 కిమీ వరకు, అదే ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 25.71 కి.మీలు, సీఎన్‌జీ వేరియంట్ కేజీ ఇంధనానికి 33.73 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. ఈ కారు ఇటీవల గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది.


Click it and Unblock the Notifications








