2024 మారుతి స్విఫ్ట్ బుక్ చేసుకున్న వారికి శుభవార్త!.. అదేంటో తెలుసా?
ఎంతోమంది వాహన ప్రియుల మనసు దోచిన 2024 మారుతి స్విఫ్ట్ ఇటీవలే దేశీయ మార్కెట్లో విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. అయితే కంపెనీ ఎట్టకేలకు ఈ కారు డెలివరీలను కూడా స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త మారుతి స్విఫ్ట్ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి LXi, VXi, VXi(O), ZXi మరియు ZXi+ వేరియంట్లు. మారుతి స్విఫ్ట్ ధరలు రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.65 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ ఎంపికల ఆధారంగా ఈ కొత్త స్విఫ్ట్ మొత్తం 11 ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇవన్నీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి.

చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు ఇప్పుడు బ్లాక్ ఫ్రంట్ గ్రిల్‌తో సహా చాలా బ్లాక్ ఎలిమెంట్స్‌తో స్పోర్టియర్ లుక్ పొందుతుంది. ఇందుకు స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు ఎల్ఈడీ ప్రొజెక్టర్ లైట్లు, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ టెయిల్‌లైట్ వంటి వాటిని పొందుతాయి. ఈస్విఫ్ట్ టాప్ స్పెక్ మోడల్ 15 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు సరౌండ్ సౌండ్ సిస్టం, ఫాస్ట్ ఛార్జింగ్ కోడం ఏ, సీ టైప్ USB పోర్ట్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 60:40 రియర్ స్ప్లిట్ మరియు కీలెస్ ఎంట్రీ మొదలైన ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

కొత్త 2024 మారుతి స్విఫ్ట్ 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5700 rpm వద్ద 80.4 Bhp పవర్ మరియు 4300 rpm వద్ద 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పనితీరు పరంగా ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి. తద్వారా ప్రయాణికులు మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.
సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. 2024 మారుతి స్విఫ్ట్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, 3 పాయింట్ సీట్ బెల్ట్ రిమైండర్ మరియు రివర్స్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. తద్వారా ప్రమాదంలో కూడా ప్రయాణిలు రక్షణ పొందవచ్చు.
కొత్త మారుతి స్విఫ్ట్ చూడటానికి కొంత దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఆధునిక డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా వాహన వినియోగదారులకు కావలసిన అన్ని ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ కారణంగానే ఈ కారును కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆతృతగా ఎగబడుతున్నారు. ఈ కొత్త కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా గొప్ప అమ్మకాలను పొందగలుగుతుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








