Discounts on Cars 25.75 కి.మీ మైలేజీ ఇచ్చే ఫేమస్ కారుపై డిస్కౌంట్స్ ప్రకటన!
భారత్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువగా మారుతి కార్లను కొనుగోలు చేస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామీలీలను టార్గెట్ చేస్తూ మార్కెట్‌లోకి కార్లను విడుదల చేయడంతో ఆటోమేటిక్‌గా ఈ కార్లు సేల్స్‌లో టాప్‌లో నిలుస్తున్నాయి. అయితే ఈ కారు మోడళ్లలో అన్నిటికంటే మారుతి స్విఫ్ట్‌కి (Maruti Swift) భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కంపెనీ విడుదల చేసిన స్విఫ్ట్ చాలా కాలంగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. ఈ ప్రముఖ కారుని మారుతి సుజుకి 2005లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఈ కారు వెనక్కి తిరిగి చూడలేదు. ఈ కారుని ఢీకొట్టేందుకు ఇతర కంపెనీలు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. మే 9న స్విఫ్ట్ న్యూ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ని ఆ కంపెనీ విడుదల చేసింది.
కొత్త స్విఫ్ట్ డిజైన్, ఇంటీరియర్ మరియు ఇతర టెక్నికల్ అంశాల పరంగా గణనీయమైన మార్పులను కలిగి ఉంది. ఈ కొత్త స్విఫ్ట్‌పై మారుతి సుజుకి డిస్కౌంట్‌లను ప్రకటించింది. మారుతి సుజుకి స్విఫ్ట్ కొన్ని వేరియంట్లపై రూ .10,000 నుంచి రూ .30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. మారుతి స్విఫ్ట్ LXi, VXi, VXI (O), ZXi మరియు ZXi+ అనే వేరియంట్లలో కొనుగోలు చేయడానికి మార్కెట్లో అందుబాటులో ఉంది.

స్విఫ్ట్‌పై మారుతి అందిస్తున్న ఈ డిస్కౌంట్లు రాష్ట్రాలు, సిటీలను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇది కార్ల ఉత్పత్తి, స్టాక్ సామార్థ్యానికి లోబడి ఉంటుందని పేర్కొంది. కాబట్టి మీకు కచ్చితమైన డిస్కౌంట్ సమాచారం కొరకు మీ సమీప డీలర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఈ కారుని కొనుగోలు చేయాలనుకుంటే ముుందుగా రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి ఈ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త స్విఫ్ట్ అనేక ఫీచర్లతో సరసమైన ధరలో అందుబాటులో ఉండటంతో.. ఇది ఫ్యామిలీలకు బెస్ట్ ఛాయిస్ కారుగా నిలిచింది. అందువల్లే ఈ విభాగంలో మారుతి స్విఫ్ట్ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ కారు 4th జనరేషన్‌కి వెర్షన్ లోనూ కారు సేల్స్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజా డిస్కౌంట్ ప్రకటనతో సేల్స్ పెంచుకోవాలని మారుతి సుజుకి యోచిస్తుంది.

కొత్త మారుతి స్విఫ్ట్ కొత్త జెడ్-సిరీస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 80.46bhp పవర్ మరియు 111.7nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది. స్విఫ్ట్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 24.80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక AGS (ఆటోమేటిక్) వేరియంట్ లీటరుకు 25.75 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
మారుతి స్విఫ్ట్ రెడ్, బ్లూ, ఆరెంజ్, మాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, పర్ల్ ఆర్కిటిక్ వైట్ అనే 6 మోనోటోన్ పెయింట్ స్కీమ్స్‌తో లభిస్తుంది. అంతే కాకుండా మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. మిడ్ నైట్ బ్లాక్ రూఫ్‌తో సిజ్లింగ్ రెడ్, మిడ్ నైట్ బ్లాక్ రూఫ్‌తో లాస్టర్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ రూఫ్ తో పర్ల్ ఆర్కిటిక్ వైట్ కలర్ ఆప్షన్స్‌తో వస్తుంది.
ఫీచర్ల విషయానికి వస్తే స్విఫ్ట్ కారులో 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో ఇందులో 6 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, వెనుక పార్కింగ్ కెమెరా మరియు ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు ఉన్నాయి.
ఈ కారులో 265 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంది. ఈ స్పేస్ వల్ల లాంగ్ జర్నీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లగేజీని తీసుకెళ్లవచ్చు. ఈ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్ కార్లకు పోటీగా ఉంటుంది. ఈ కారు ధర రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 9.60 లక్షల మధ్య ఉంది.


Click it and Unblock the Notifications








