కొత్త Maruti Swift లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!.. ఇక్కడ చూడండి

అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది 'స్విఫ్ట్'. ఈ స్విఫ్ట్ ఇప్పుడు కొత్త హంగులతో దేశీయ విఫణిలో లాంచ్ అవ్వడానికి సిద్ధమైపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొత్త ''మారుతి స్విఫ్ట్''(Maruti Swift) వచ్చే నెల మొదటి వారంలో.. అంటే 2024 మే మొదటి వారంలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. త్వరలో విడుదలకానున్న కొత్త స్విఫ్ట్ ఈ ఏడాది చెప్పుకోదగ్గ లాంచ్‌లలో ఒకటని తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరి నాటికి కంపెనీ డిజైర్ సెడాన్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. కొత్త స్విఫ్ట్ ఆధునిక డిజైన్, కొత్త టెక్నాలజీ వంటి వాటిని పొందుతుందని సమాచారం.

New Maruti Suzuki Swift

గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త మారుతి స్విఫ్ట్.. ఇప్పటికే అనేకసార్లు భారతదేశంలో టెస్టింగ్ సమయంలో గుర్తించబడింది. ఇది విదేశీ మార్కెట్లో విక్రయించబడుతున్న స్విఫ్ట్ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే భారతదేశంలో ఉపయోగించడానికి కావాల్సిన ఫీచర్స్ ఇందులో తప్పకుండా లభిస్తాయి. ఈ కారు యొక్క ముందు మరియు వెనుక బంపర్‌లు స్టాండర్డ్ మోడల్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది.

స్టాండర్డ్ మోడల్ కంటే కొంత భిన్నంగా ఉన్నప్పటికీ.. పెద్దగా చెప్పుకోదగిన అప్డేట్స్ కొత్త మారుతి స్విఫ్ట్ పొందలేదని తెలుస్తోంది. నెంబర్ ప్లేట్ హోసింగ్ పెద్దదిగా ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లాక్ ఎలిమెంట్స్ కనిపించవు. మొత్తం మీద కొత్త స్విఫ్ట్ విదేశీ మార్కెట్లో విక్రయించబడుతున్న కారు మాదిరిగా ఉంటుందని.. అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా దాని మారిరిగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే మిడ్ వేరియంట్స్ మాత్రం ప్రత్యేకమైన వీల్ డిజైన్ పొందుతాయి.

New Maruti Suzuki Swift Front Profile

కొత్త మారుతి స్విఫ్ట్.. హ్యుందాయ్ ఐ20 మాదిరిగానే బ్లాక్ కలర్ సి పిల్లర్ పొందుతుంది. అయితే రివర్స్ కెమెరా రియర్ బంపర్ మీద కాకుండా.. బూట్ లిడ్ మీద ఉంటుంది. టాప్ స్పెక్ వేరియంట్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్‌ ఎల్ఈడీ యూనిట్లు. ఈ కారులో 360 డిగ్రీ కెమెరా లేదా ఏడీఏఎస్ వంటివి ఉండనున్నట్లు సమాచారం. అంతే కాకుండా త్రీ పాయింట్ సీట్ బెల్ట్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయని తెలుస్తోంది.

త్వరలో విడుదలకానున్న కొత్త మారుతి స్విఫ్ట్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. గత ఏడాది ఈ ఇంజిన్ జపాన్‌లో లాంచ్ అయిన స్విఫ్ట్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇంజిన్ కెపాసిటీ మరియు అవుట్‌పుట్‌ వంటివి భారతీయ వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో లభించే అవకాశం ఉంది.

New Maruti Suzuki Swift Rear View

మే మొదటి వారంలో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న కొత్త మారుతి స్విఫ్ట్.. మంచి డిజైన్ మరియు అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ ఈ కారు యొక్క ధరలను అధికారికంగా ప్రకటించలేదు. ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయని ఆశిస్తున్నాము. ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన స్విఫ్ట్.. తప్పకుండా మళ్ళీ మంచి అమ్మకాలను పొందుతుందని, దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, April 15, 2024, 12:00 [IST]
English summary
New maruti suzuki swift to be launched on 9th may 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+