CNG వెర్షన్‌లో 'మారుతి స్విఫ్ట్' విడుదల.. సీఎన్‌జీ కార్లల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదే!
మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ (Maruti Suzuki Swift CNG) వెర్షన్‌లో లాంచ్ అయ్యింది. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం ఆరు లక్షల సీఎన్‌జీ యూనిట్లను విక్రయించాలనే లక్ష్యంతో ఈ మారుతి స్విఫ్ట్‌ని కంపెనీ ప్రవేశపెట్టింది. మారుతికి అతిపెద్ద మార్కెట్‌కి ఉన్న ఈ కారుని ప్రస్తుతం సీఎన్‌జీ వెర్షన్‌లో విడుదల చేసింది. ఈ మారుతి సీఎన్‌జీ వేరియంట్ 1.2-లీటర్ మూడు సిలిండర్ల ఇంజిన్‌తో పనిచేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 70 ps పవర్‌ని 102 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
మారుతి సుజుకి నుంచి ఫేమస్ లైనప్‌గా పేరుగాంచిన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ ఇప్పుడు సీఎన్‌జీ వేరియంట్‌లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ .8.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త స్విఫ్ట్‌ని సీఎన్‌జీ VXi, VXi (0), ZXi వేరియంట్లలో మాత్రమే వస్తుంది. ఇక సీఎన్‌జీ మోడ్‌లో కిలోకు 32.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.

అదే విధంగా సిటీ డ్రైవింగ్ కోసం డ్యూయల్ వివిటి ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 2900 rpm వద్ద గరిష్టంగా 101.8 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా తక్కువ కార్బన్ డయాక్సైడ్‌ని విడుదల చేస్తుంది. ఇందులో సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి.
అదే విధంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, 7 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దీనిని సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. రూ .21,628 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ ఫీజుతో, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, మెయింటైనెన్స్ ఇంకా మరెన్నో సదుపాయాలు ఈ సబ్‌స్క్రిప్షన్‌లో కవర్ అవుతాయి. అయితే ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే.

అధిక మైలేజీతో కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు మారుతి స్విఫ్ట్‌ని కంపెనీ ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా మారుతి సుజుకి మార్కెట్‌లో తమ సేల్స్‌ని మరింత పెంచుకునేందుకు చాకచక్యంగా వ్యవహరిస్తుంది. మారుతి సుజుకి కంపెనీ తన సీఎన్‌జీ లైనప్స్‌ని విస్తరిస్తూనే ఉంది. మారుతి స్విఫ్ట్ విడుదలతో మొత్తం సీఎన్‌జీ మోడళ్ల సంఖ్య ఇప్పుడు 14కి చేరింది.
గత కొన్నేళ్లుగా డీజిల్ మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేస్తూ పూర్తిగా క్లీనర్, మరింత సరసమైన సీఎన్‌జీ కార్లపై ఎక్కువగా దృష్టి సారించింది. స్విఫ్ట్‌ని సీఎన్‌జీతో సేల్స్ భారీగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. ఈ స్విఫ్ట్ S-సీఎన్‌జీ, పెట్రోల్ మోడ్స్ మధ్య ఆటో-స్విచ్చింగ్, ఓడోమీటర్‌లో ఫ్యూయల్ ఇండికేటర్‌ని సూచిస్తుంది. స్విఫ్ట్ సీఎన్‌జీ అదే స్పోర్టీ లుక్‌తో ఆకట్టుకుటుంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ 4th జనరేషన్ వెర్షన్ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. మే నెలలో విడుదల చేసిన ఈ పెట్రోల్ వేరియంట్ 67,000 యూనిట్లకు పైగా విక్రయించింది. సీఎన్‌జీ వేరియంట్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త సీఎన్‌జీ వేరియంట్ యువతను ఎక్కువగా ఆకర్షిస్తుందని కంపెనీ తెలిపింది. మొదటి సారి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉండనుంది.
ఇప్పటి వరకు 2 మిలియన్లకు పైగా సీఎన్‌జీ వాహనాలను విక్రయించినట్లు మారుతి సుజుకి తెలిపింది. భవిష్యత్తులోనూ గ్రీన్ మొబిలిటీ పరిష్కారం కోసం ఈ లైనప్‌ని మరింత విస్తరించడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్యాసింజర్ వాహన విభాగంలో 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం సీఎన్‌జీ అమ్మకాలు (46.8%) వృద్ధిని సాధించాయని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications