కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్న కొత్త 'మారుతి సుజుకి స్విఫ్ట్' లాంచ్ ఎప్పుడో ఇప్పటికే తెలిసిపోయింది. కాగా ఇప్పుడు ఈ హ్యాచ్‌బ్యాక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) 2024 మే మొదటి వారంలో లాంచ్ అవుతుందని సమాచారం. అయితే ఈ కారు అధికారికంగా లాంచ్ అవ్వడానికి ముందే.. మారుతి డీలర్లు అనధికార బుకింగ్స్ ప్రారంభించారు. కాబట్టి మారుతి స్విఫ్ట్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలుస్తోంది. డెలివరీలు లాంచ్ అయిన తరువాత ప్రారంభమవుతాయి.

Maruti-Swift-Bookings

మారుతి స్విఫ్ట్ డెలివరీలు ప్రారంభమైన తరువాత పెట్రోల్ మోడల్స్ డెలివరీలు ముందుగా ప్రారంభమవుతాయని సమాచారం. ఆ తరువాత CNG మోడల్స్ డెలివరీలు జరుగుతాయని చెబుతున్నారు. మారుతి సుజుకి యొక్క కొత్త స్విఫ్ట్ అనేది దేశీయ విఫణిలో అమ్మకానికి రానున్న నాల్గవ తరం హ్యాచ్‌బ్యాక్‌. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం.

కొత్త మారుతి స్విఫ్ట్ యాంగ్యులర్ హెడ్‌లైట్‌లు, చిన్న గ్రిల్, కొత్త టెయిల్‌ల్యాంప్‌ వంటి వాటిని పొందనుంది. అంతే కాకుండా రీడిజైన్ చేయబడిన గ్లాస్‌హౌస్ మరియు ఫ్లాట్ షోల్డర్ లైన్ వంటి అప్డేటెడ్ డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఇందులో లభిస్తాయి. లోపలి భాగంలో కూడా కొంత అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Maruti-Swift-Bookings

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్ మరియు 9.0 ఇంచెస్ ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్‌ వంటి వాటితో దాని మునుపటి మోడల్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది. త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తాయి. కొత్త మారుతి స్విఫ్ట్ (Maruti Swift) ఏడీఏఎస్ ఫీచర్ కూడా పొందనున్నట్లు సమాచారం.

ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 1.2 లీటర్ త్రీ సిలిండర్ పొందుతుందని తెలుస్తోంది. ఈ ఇంజిన్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న కారులో వినియోగంలో ఉంది. ఇది 82 హార్స్ పవర్ మరియు 122 Nm టార్క్ అందిస్తుంది. అయితే భారతదేశంలో లాంచ్ కానున్న కొత్త స్విఫ్ట్ యొక్క పవర్ మరియు టార్క్ కొంత భిన్నంగా.. భారతీయ వినియోగదారుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

Maruti-Swift-Bookings

విడుదలకు సిద్దమవుతున్న కొత్త మారుతి స్విఫ్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ కంటే కొంత అప్డేట్ పొంది ఉంటాయని తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. అంతే కాకుండా ఈ కారు ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. డెలివరీలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఆ సమయంలోనే వెల్లడవుతాయి. అయితే ఈ కొత్త కారు తప్పకుండా చాలా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 20, 2024, 12:47 [IST]
English summary
New maruti swift unofficial bookings open at rs 11000 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+