అదిరిపోయే ఫీచర్లతో మెర్సిడెస్ బెంజ్ GLA, GLE 53 Coupe లాంచ్.. మైలేజ్ పరంగా ది బెస్ట్.!!
మెర్సిడెస్ అంటే లగ్జరీ కార్లకు పెట్టింది పేరు. తాజాగా ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ నేడు భారత మార్కెట్లో రెండు సరికొత్త కార్లను విడుదల చేసింది. Mercedes Benz అప్‌డేటెడ్ GLA, GLE 53 కూపే లగ్జరీ కార్లను ప్రవేశపెట్టింది. ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఎక్స్‌టీరియర్, ఫీచర్ల పరంగా కొత్త Mercedes-Benz GLA SUVలో సంస్థ కొన్ని మార్పులను చేసింది. కొత్త 'స్పెక్ట్రల్ బ్లూ' కలర్ ఆప్షన్‌లో ఈ కారు అందుబాటులో ఉంది. కాగా 2010లో, Mercedes-Benz GLA తొలిసారిగా దేశీయ మార్కెట్లోకి విడుదల కాగా.. ఇప్పటివరకు సంస్థ 14,000 యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది. అప్‌డేటెడ్ వెర్షన్ 2 వేరియంట్‌లు ప్రోగ్రెసివ్ లైన్, మరియు AMG లైన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

అప్‌డేటెడ్ Mercedes-Benz GLA SUV డిజైన్ పరంగా ప్రోగ్రెసివ్ లైన్ వేరియంట్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. ఆప్రాన్ డిజైన్‌తో వస్తుంది. AMG లైన్ వేరియంట్ కూడా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. వినూత్న బంపర్ మరియు డైమండ్ గ్రిల్ ఈ కారుకు బ్యూటిఫుల్ లుక్‌ను జోడిస్తాయి. అంతే కాకుండా, రెండు మోడళ్లు ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, టెయిల్ ల్యాంప్స్‌తో వస్తాయి.
Mercedes Benz GLA SUV లో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ గో, హ్యాండ్స్-ఫ్రీ టెయిల్‌గేట్, యాక్టివ్ పార్క్ అసిస్ట్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ మరియు 360-డిగ్రీ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ ఫీచర్ల పరంగా ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) సహా వివిధ ఫీచర్లతో వస్తుంది.

ఇంజిన్ విషయానికొస్తే కొత్త Mercedes Benz GLA SUV ప్రోగ్రెసివ్ లైన్ వేరియంట్ పెట్రోల్- డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉండగా.. AMG లైన్ వేరియంట్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. పవర్‌ట్రెయిన్ వారీగా ఆయా వేరియంట్లు అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తాయని సంస్థ తెలిపింది.
మెర్సిడెస్ బెంజ్ GLA పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ విషయానికొస్తే.. ఇది 1.3-లీటర్ యూనిట్‌ను కలిగి ఉంది. గరిష్ఠంగా 160 bhp శక్తిని, 270 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షనల్‌గా వస్తుంది. ఇది కేవలం 8.9 సెకన్లలో 0-100 kmph నుండి వేగాన్ని అందుకోగా.. 17.4 kmph మైలేజీని ఇస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ GLA కారు డీజిల్ ఇంజిన్ 2.0-లీటర్ యూనిట్‌తో పనిచేస్తుంది. ఇది 187 bhp శక్తిని, 400 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్‌తో ఈ కారు 7.5 సెకన్లలో 0-100 kmph స్పీడ్‌ను అందుకుంటుంది. లీటర్‌కు ఇది 18.9 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ కారును రూ. 50.50 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో సంస్థ విడుదల చేసింది.
ఇక నవీకరించబడిన Mercedes AMG GLE 53 Coupe (Mercedes AMG GLE 53 కూపే ఫేస్‌లిఫ్ట్) రూ.1.85 కోట్ల ధర(ఎక్స్-షోరూమ్)తో సంస్థ లాంచ్ చేసింది. ఇందులోని 3.0-లీటర్ 6-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 435 hp మరియు 560 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది.
ఇంకా AMG GLE 53 కూపే కొత్త 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో వస్తుంది. దీని ద్వారా అదనంగా 20 hp శక్తిని, 200 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ గరిష్ఠంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంటీరియర్ విశాలంగా, డజన్ల కొద్దీ అధునాతన ఫీచర్లతో పాటు భద్రత పరంగా, ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా ఫీచర్లతో వస్తుంది.


Click it and Unblock the Notifications








