MG Astor 2024 సూపర్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఎంజీ ‘ఆస్టర్' లాంచ్.. ధర ఎంతో తెలుసా.??
ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG(మోరిస్ గ్యారేజ్) మోటార్ ఇండియా తన MG ఆస్టర్ అప్‌డేటెడ్ SUVని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ధరలో ఆకర్షణీమైన ఫీచర్లతో MG Astor ను సరికొత్తగా సంస్థ లాంచ్ చేసింది. ఈ కొత్త కారు డిజైన్, ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
కొత్త 2024 MG Aster SUV ని ధర రూ. 9.98 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో ఎంజీ మోటార్ ఇండియా లాంచ్ చేసింది. ఎంజీ ఆస్టర్‌ను కొత్త వెర్షన్‌లో ప్రవేశపెట్టింది. ఈ కొత్త MG Aster SUV స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో మరియు Savvy Pro వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది.

ఫీచర్ల పరంగా ఎంజీ ఆస్టర్ 2024 అనేక అప్‌డేట్లతో వస్తుంది. ఇందులో IRVM మరియు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. వీటిని సావీ ప్రో ట్రిమ్ వేరింయట్‌లో ప్రత్యేకంగా ప్రవేపెట్టారు. కొత్త MG Astor లో i-Smart 2.0 కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను అందిస్తోంది.
10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ అప్‌హోల్‌స్టరీ మరియు లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త MG Aster SUVలో లెవెల్ 2 ADAS టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఇందులో 14 అధునాతన సేఫ్టీ ఫీచర్లను సంస్థ అందిస్తోంది.

360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 6-స్పీకర్, ట్వీటర్‌లు, లేన్ చేంజ్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను కొత్త ఎంజీ ఆస్టర్‌లో అందిస్తున్నారు.
వీటితో పాటు యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది డిజిటల్ కీకి కనెక్ట్ చేయబడి ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా కారు సురక్షితంగా ఉంటుంది. ఇది అటాస్ టెక్నాలజీతో కూడిన కారు. MG Aster చాలా కాలంగా మార్కెట్లో ప్రజాదరణ కలిగి ఉండటంతో.. ఇప్పుడు అప్‌డేట్ వెర్షన్‌తో అంచనాల మధ్య ఈ కారు విడుదలైంది.

కొత్త ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీ ఇంజిన్ విషయానికొస్తే.. 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 110 PS పవర్ మరియు 144 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 8-స్పీడ్ CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో స్ప్రింట్, షైన్, సెలెక్ట్ మరియు షార్ప్ ప్రో ట్రిమ్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధరలు వేరియంట్ల ప్రకారం వరుసగా.. రూ. 9.98 లక్షలు, రూ. 11.68 లక్షలు, రూ. 12.98 లక్షలు మరియు రూ. 14.40 లక్షలుగా ఉంది.
కాగా నేచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్-CVT కాంబినేషన్ సెలెక్ట్, షార్ప్ ప్రో, సావీ ప్రో వేరియంట్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర వేరియంట్ల ప్రకారం రూ. 13.98 లక్షలు, రూ.15.68 లక్షలు, రూ.16.58 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. సాంగ్రియా కలర్ స్కీమ్‌లోని Savvy Pro CVT వేరియంట్ ధర రూ. 16.68 లక్షలుగా ఉంది.
అదనంగా, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రత్యేకంగా Savvy Pro ట్రిమ్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ మోడల్ ధర రూ.17.89 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ MG ఆస్టర్ మోడల్‌ను అన్ని వేరియంట్‌లలో ఐవరీ మరియు సాంగ్రియా కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








