Mini Cooper S కోసం ఎదురు చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్ - ఇప్పుడే తెలుసుకోండి

భారతదేశంలో సాధారణ కార్లకు మాత్రమే కాకుండా ఖరీదైన కార్లకు కూడా మంచి డిమాండ్ ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ తరుణంలో జర్మన్, జపాన్ మరియు అమెరికన్ బ్రాండ్ కార్లకు కూడా ఇండియన్ మార్కెట్లో ఆదరణ ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు ఆధునిక కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు 'మినీ ఇండియా' (Mini India) తన కొత్త కూపర్ ఎస్ (Cooper S) కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. రూ. 1 లక్ష టోకెన్ మొత్తంతో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

2024 మినీ కూపర్ ఎస్ బుక్ చేఉకోవాలనుకునే వారు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా అధీకృత డీలర్షిప్ వద్ద రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. గతేడాది సెప్టెంబర్‌లో ఆవిష్కరించబడిన ఈ కొత్త కారు ఈ సంవత్సరం చివరి నాటికి భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ అవుతుందని సమాచారం. కాబట్టి డెలివరీలు లాంచ్ అయిన తరువాత మొదలవుతాయి.

New Mini Cooper Bookings Start

కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త 2024 మినీ కూపర్ ఎస్ 3 డోర్ వెర్షన్ అని తెలుస్తోంది. ఇది చూడటానికి మంచి డిజైన్ కలిగి, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇది ఆక్టాగోనల్ గ్రిల్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు వెనుక వైపు జాక్ ఇన్స్ఫైర్డ్ టెయిల్ లాంప్ వంటివి పొందుతుంది. డోర్ హ్యాండిల్స్ కూడా డోర్‌లతో ఫ్లష్‌గా ఉంటాయి. మొత్తం మీద ఈ కారు డిజైన్ చూడగానే ఆకర్షించే విధంగా ఉంది.

ఇంటీరియర్ డిజైన్ మరియు విషయానికి వస్తే.. క్యాబిన్ మినిమలిస్ట్ డిజైన్ థీమ్‌తో పెద్ద రౌండ్ సెంట్రల్ డిస్‌ప్లేతో వస్తుంది. సెంట్రల్ యూనిట్ అన్ని ఇన్ఫోటైన్‌మెంట్ విధులను నిర్వహిస్తుంది. అంతే కాకుండా డ్రైవర్‌కు కావాల్సిన సమాచారాన్ని అందించే ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా కూడా ఇది పనిచేస్తుంది. టోగుల్ స్విచ్‌ల వరుస టచ్‌స్క్రీన్ దిగువన ఉండటం చూడవచ్చు. ఇందులో పార్కింగ్ బ్రేక్, గేర్ సెలెక్టర్ మరియు స్టార్ట్ స్టాప్ స్విచ్ వంటివి ఉన్నాయి.

New Mini Cooper Side Design

మినీ కూపర్ ఎస్ మోడల్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే.. 2.0-లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 204-హార్స్ పవర్ మరియు 300 Nm టార్క్ అందిస్తుంది. పవర్ మరియు టార్క్ అనేవి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా 26 హార్స్ పవర్ మరియు 20 Nm ఎక్కువ. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటో గేర్‌బాక్స్ ద్వారా పవర్ ఫ్రంట్ వీల్స్‌కు అందిస్తుంది.

2024 మినీ కూపర్ ఎస్ మోడల్ కేవలం 6.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల తప్పకుండా మంమ్చి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాము. కంపెనీ ఈ కారు ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. లాంచ్ సమయంలో వెల్లడయ్యే అవుతాయి.

New Mini Cooper Interior

త్వరలో లాంచ్ కానున్న కొత్త మినీ కూపర్ ఎస్ మోడల్ ధర రూ.42.70 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. ఇది బహుశా దాని ఇతర మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువ ధర వద్ద లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో ఈ కారుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. కానీ ధరల పరంగా మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ లిమోసిన్, ఆడి క్యూ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుందని సమాచారం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, June 12, 2024, 15:02 [IST]
English summary
New mini cooper bookings start in india
Read more on: #mini
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+