మినీ కారుకి సేఫ్టీలో 5 స్టార్‌ రేటింగ్‌.. కారులో అందరికీ మంచి భద్రత, ధైర్యంగా కొనుగోలు చేయవచ్చు, కానీ..!

మినీ నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మిని కంట్రీమ్యాన్ కారు తాజాగా యూరో క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ని సాధించింది. ఈ కంట్రీమ్యాన్‌ కారు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీని కలిగి ఉంది. ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌ భారతీయ రోడ్లపై పరుగులు పెడుతోంది. ఇప్పటికే దీని సేల్స్‌ స్థిరంగా కొనసాగుతున్నాయి. దీని ధర రూ. 54.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. దీనిని కంప్లీట్‌ బిల్డ్‌ యూనిట్‌గా దిగుమతి చేసుకుంటున్నారు. యూరో ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో కంట్రీమ్యాన్ అత్యధిక సేఫ్టీ రేటింగ్‌ని పొందింది. ఈ మినీ కంట్రీమ్యాన్‌ కారు ప్రీమియం ఫీచర్లు, మంచి ఫర్పామెన్స్‌కి ప్రసిద్ధి చెందింది. తాజాగా ఇప్పుడు సేఫ్టీలోనూ అదరగొట్టింది. ఈ వివరాలు ఈ కథనంలో..

ఈ కారులో ప్రయాణించే ప్రయాణికులకు సేఫ్టీని అందించేలా మినీ కంట్రీమ్యాన్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీంతో యూరో NCAPలో ఈ కారు సత్తా చాటింది. ఈ క్రాష్‌ టెస్ట్‌లో సైడ్, ఫ్రంట్‌ కొలిషన్‌లో సత్తా చాటింది. కారు లోపల ఉంచిన డమ్మీ (బొమ్మలు)కు మంచి సేఫ్టీ లభించింది. దీని ఆధారంగా యూరో ఎన్‌సీఏపీలో కంట్రీమ్యాన్‌కి ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది.

New Mini Countryman EURO Crash Test Safety Rating

ఈ కారులోని ఫీచర్ల వల్ల పెద్ద ప్రమాదం జరిగినా కానీ ఈ కారులోని ప్రయాణీకులకు మంచి సేఫ్టీ లభించింది. ఈ వాహనం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లలకు కూడా అనుకూలంగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. అంతే కాకుండా పాదచారులు సైతం సురక్షితంగా ఉండనున్నారు. ప్రమాదాలను నివారించడానికి ఈ మినీ కారులో సైక్లిస్ట్‌ల సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో కారులోపల అలాగే పాదచారులు, బయటి వ్యక్తులకు సేఫ్టీ లభిస్తుంది.

ఈ కారులో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్, ఎమర్జెన్సీ అలారం, మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్‌ వంటి సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. ప్రస్తుతానికి ఈ మినీ కంట్రీమ్యాన్ భారతదేశంలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ (ఈవీ) వెర్షన్‌లో మాత్రమే కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ. 54.90 లక్షలుగా ఉంది. చూడ్డానికి ఇది చిన్నగా కనిపించినా ఈ కారులో ఐదుగురు కూర్చొని హాయిగా ప్రయాణించవచ్చు.

New Mini Countryman EURO Crash Test Safety Rating

దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 462 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. అంతే కాదు దీనిని ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఉపయోగించి బ్యాటరీ ప్యాక్‌ని కేవలం 29 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇందులో సర్క్యూలర్ డిజిటల్ స్క్రీన్, మల్టిపుల్ కంట్రోల్స్‌తో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్స్, మొబైల్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లకు కొదువలేదు.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: అయితే ఈ సేఫ్టీ రేటింగ్ యూరోపియన్ మార్కెట్ కోసం అందుబాటులో ఉన్న మినీ కంట్రీమ్యాన్‌కి వచ్చింది. ఈ మార్కెట్‌లో ఉండే కంట్రీమ్యాన్ భారత్‌లో ఉన్న మినీ కంటే భారీ ఫీచర్లతో వస్తుంది. అందువల్ల ఈ రేటింగ్ భారతదేశానికి కంట్రీమ్యాన్ ఈవీకి వర్తించదు. భారత్‌లో విక్రయించే కంట్రీమ్యాన్‌ కారులో సేఫ్టీ ఫీచర్లు ఎక్కువే ఉన్నాయి. కావున ఇది కూడా మంచి సేఫ్టీని అందించే అవకాశం ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 12, 2024, 14:05 [IST]
English summary
New mini countryman secured 5 star in euro ncap safety rating
Read more on: #mini #crash test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+