మాహిశ్మతి ఊపిరి పీల్చుకో.. 10 ఏళ్లు దేశాన్ని ఏలిన 'బాహుబలి కారు' తిరిగి వచ్చేస్తుంది!

రెనాల్ట్ డస్టర్ (Renault Duster) భారతదేశంలోని కారు ప్రియులకు పరిచయం అవసరం లేని మోడల్‌గా ఉంది. భారత్‌లో మాస్‌ మార్కెట్‌ని ఒడిసి పట్టుకునేందుకు 2012లో మొదటిసారిగా భారతదేశంలోకి అడుగుపెట్టింది. ఇది మెరుగైన ఫర్ఫామెన్స్‌, ఫీచర్లతో పాటు కస్టమర్లలలో మంచి నమ్మకాన్ని పెంపొందించుకుంది. అతి కొద్ది రోజుల్లోనే దేశంలో అత్యంత పేరొందిన ఎస్‌యూవీగా మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని తిరుగులేని శక్తిగా అవతరించింది. ఓ దశాబ్ద కాలం వెలుగు వెలిగిన ఈ ఎస్‌యూవీ ఆ తర్వాత సరైన అప్‌గ్రేడ్స్‌ లేకపోవడం, మెల్లమెల్లగా అమ్మకాలు పడిపోవడంతో ఈ మోడల్‌ని 2022 లో కంపెనీ నిలిపివేసింది.

అయితే త్వరలోనే పారిస్‌ మోటార్‌ షోలో ఆవిష్కరించబోతున్న రెనాల్ట్‌ డస్టర్ 2nd జనరేషన్‌కి సంబంధించిన టీజర్‌ని తాజాగా విడుదల చేసింది. రెనాల్ట్ సబ్ బ్రాండ్ డాసియా (DACIA) నుంచి ఈ కొత్త మోడల్ త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైంది. ఇప్పటి వరకు రెనాల్ట్ కేవలం 5-సీటర్ ఆప్షన్‌లోనే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇది 3 వరుసల ఎస్‌యూవీగా (7 సీటర్‌) విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

New Renault Duster 7-Seater SUV

వచ్చే వారం పారిస్ మోటార్ షోలో ఆవిష్కరించబోతున్న ఈ కారు టీజర్‌ తాజాగా విడుదలైంది. 'బిగ్ స్టర్' పేరుతో టీజర్‌ని రివీల్ చేశారు. అదే పేరుతో మార్కెట్‌లో ఈ ఎస్‌యూవీ అడుగు పెట్టనుంది. అక్టోబర్ 14-20 వరకు జరగనున్న 2024 పారిస్ మోటార్ షోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఈ 3 వరుస సీట్ల ఎస్‌యూవీ పొడవైన వీల్‌బేస్‌తో రానుంది. ఈ బిగ్‌స్టర్ ఎస్‌యూవీ పొడవు 4.6 మీటర్లుగా ఉంది. ఇది 5 సీట్ల డస్టర్ కంటే 300 మిమీ పొడవుగా ఉంటుంది. ఈ కారు భారత మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది.

Renault Bigster 7-Seater SUV

CMF-B ప్లాట్‌ఫామ్‌, కొన్ని బాడీ ప్యానెల్స్, సీట్లు, డ్యాష్‌బోర్డ్‌, స్టీరింగ్ వీల్, మెకానికల్ బిట్స్‌తో సహా డస్టర్‌తో అనేక భాగాలను ఈ బిగ్‌స్టర్‌ ఇందులో అందించనున్నారు. అయితే ఇది వరకు డస్టర్‌లో లేని భిన్నమైన ప్రత్యేక స్టైలింగ్‌ని కలిగి ఉండనుంది. కొత్త డిజైన్‌తో అల్లాయ్ వీల్స్‌తో పాటు విభిన్న ఫ్రంట్, రియర్ ప్రొఫైల్స్ కూడా ఇందులో ఉండనున్నాయి. డస్టర్‌తో పోలిస్తే బిగ్‌స్టర్ క్యాబిన్ కూడా ఢిఫరెంట్‌ లేఅవుట్‌ని కలిగి ఉంటుంది.

ఇది డస్టర్‌తో అనేక ఫీచర్లు, ఇంటీరియర్ లేఅవుట్‌ని పంచుకుంటుందని భావిస్తున్నారు. అయితే ఇందులో కొన్ని అదనపు ఫీచర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎస్‌యూవీ 6, 7 సీట్ల లేఅవుట్లలో లభ్యం కానుంది. ఇక దీని పవర్‌ట్రైన్ విషయానికి వస్తే ఈ ఎస్‌యూవీ రెనాల్ట్ డస్టర్ మాదిరిగానే ఇంజిన్ ఆప్షన్స్‌ని పంచుకుంటుందని భావిస్తున్నారు.

Renault Bigster 7-Seater SUV Teaser Luanch

ఇది 1.2-లీటర్ టర్బో లేదా 1.6-లీటర్ టర్బో-పెట్రోల్‌తో మార్కెట్‌లో అడుగు పెట్టనుంది. ఇండియా-స్పెక్ మోడల్‌లో ఎలాంటి ఇంజిన్ ఆప్షన్ అందించనున్నారో స్పష్టంగా తెలియదు. భారతీయ మార్కెట్‌కి అనుగుణంగా ఇది 4×2, 4×4 ఆప్షన్లలో లభించనుంది. కొత్త డస్టర్ ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో వివిధ డ్రైవింగ్‌ మోడ్స్‌ని కలిగి ఉండనుంది. ఈ రెనాల్ట్ డస్టర్‌ భారత్‌లో ఎస్‌యూవీ విభాగంలోని ఇతర కార్ల సేల్స్‌ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 8, 2024, 10:47 [IST]
English summary
New renault bigster 7 seater suv teaser released launching india in 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+