స్కోడా స్లావియా స్టైల్‌ స్పెషల్‌ ఎడిషన్‌ లాంచ్‌.. అందుబాటులో 500 మాత్రమే, ధర, ఫీచర్లు ఇవే.!!

భారత మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా తన స్కోడా స్లావియా మిడ్-సైజ్ సెడాన్‌లో కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను లాంచ్‌ చేసింది. స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్(Skoda Slavia Style Edition) అని పిలువబడే ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ధర రూ. 19.13 లక్షలు, ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

ప్రస్తుతం కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ 500 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది. మల్టీ కాస్మెటిక్‌ అప్‌డేట్లతో ఈ కారును సంస్థ ప్రవేశపెట్టగా.. ఇందులో ఒకే పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ సెడాన్ యొక్క టాప్-ఆఫ్-ది-లైన్ స్టైల్ వేరియంట్‌ ఆధారంగా నిర్మించారు. దీని ధర సాధారణ వేరియంట్ కంటే దాదాపు రూ. 30,000 ఎక్కువగా ఉంటుంది.

New-Skoda-Slavia-Style-Edition-Launched

డిజైన్‌ పరంగా ఈ కొత్త స్లావియా(Skoda Slavia Style) స్టైల్ ఎడిషన్ మోడల్‌కు బ్లాక్ బి-పిల్లర్లు, బ్లాక్ మిర్రర్ కవర్లు మరియు బ్లాక్ రూఫ్‌పై 'ఎడిషన్' బ్యాడ్జ్‌తో వస్తుంది. క్యాబిన్ కొత్త 'స్లావియా' బ్రాండ్ స్కఫ్ ప్లేట్‌లతో వస్తుంది. ఈ కారు స్టీరింగ్ వీల్‌కు 'ఎడిషన్' బ్యాడ్జ్ కూడా వస్తుంది. ఇది స్కోడా లోగో ప్రొజెక్షన్‌తో డ్యూయల్ డాష్‌క్యామ్ మరియు పుడ్ల్ ల్యాంప్‌లను కలిగి ఉంది.

ఈ కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ మోడల్‌ 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 150 PS పవర్ మరియు 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ DSG మరియు డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఫ్రంట్‌ వీల్స్‌కు శక్తిని సరఫరా చేస్తుంది.

New-Skoda-Slavia-Style-Edition-Launched

స్టాండర్డ్‌ స్కోడా స్లావియా 4,541 mm పొడవు, 1,752 వెడల్పు మరియు 1,487 mm ఎత్తు 2,651 mm వీల్‌బేస్‌తో అందుబాటులో ఉంది. కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ ఆకర్షణీయమైన క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్ మరియు టోర్నాడో రెడ్ కలర్ ఆప్షన్‌లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే కొత్త స్కోడా స్లావియా స్టైల్ ఎడిషన్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఫీచర్లను కలిగి ఉంది. సెడాన్ డ్యూయల్ డాష్ కెమెరా, స్లావియా స్కఫ్ ప్లేట్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంకా ఇతర అనేక కొత్త ఫీచర్లతో తీసుకువచ్చింది.

భద్రతా పరంగా కొత్త స్కోడా స్లావియా స్టైల్‌ ఎడిషన్‌.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX ఛైల్డ్ ఎంకరేజ్‌లతో పాటు హై సేఫ్టీ భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ESC, EDS, టైర్ ప్రెజర్ మానిటర్, హిల్ హోల్డ్, రియర్ పార్కింగ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.

వాటితో పాటు మల్టీ కొలిజన్ బ్రేక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్‌లు, రెయిన్ సెన్సింగ్ వైప్స్ వంటి అనేక ప్రామాణిక ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా కొత్త స్కోడా స్లావియా 5-స్టార్‌ గ్లోబల్ NCAP రేటింగ్ పొందడంతో పాటు.. సురక్షితమైన బ్రాండ్‌గా మార్కెట్లో ప్రవేశపెట్టింది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 14, 2024, 18:07 [IST]
English summary
New skoda slavia style edition launched limited edition price features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+