క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్‌కి 3 స్టార్ రేటింగ్.. పూర్తి క్రాష్ టెస్ట్ వీడియో చూసేయండి!
మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లకు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కారు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా ఉంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్విఫ్ట్ అందుబాటులో ఉంది. దీని వల్ల ఎక్కువగా మిడిల్‌క్లాస్ వాళ్లు ఈ కారుని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారత్‌లో వందల సంఖ్యలో కార్లు ఉన్నా కానీ మారుతి స్విఫ్ట్ వైపే చాలామంది చూస్తూ ఉంటారు. ఈ ప్రముఖ మారుతి సుజుకి స్విఫ్ట్ 2005లో భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం 4వ తరం స్విఫ్ట్ (maruti Swift 4th Generation) ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ అయింది. గ్లోబల్ మార్కెట్-స్పెక్ మోడల్లో లభించే కొన్ని ఫీచర్లు ఈ మోడల్‌లో లేవు. తాజాగా ఈ కారు యూరో ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌ని ఎదుర్కొంది. ఆ వివరాలు ఈ కథనంలో..
ఈ కారు యూరో ఎన్‌సీఏపీ (Euro NCAP Crash Test) క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్‌ని సాధించింది. పెద్దల సేఫ్టీలో మొత్తం 26.9 పాయింట్లు లేదా 67%, పిల్లల సేఫ్టీ విభాగంలో 32.1 పాయింట్లతో 65% స్కోరు సాధించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కొత్త తరం స్విఫ్ట్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది మునుపటి తరం మోడల్ తో పోలిస్తే పూర్తి అప్‌గ్రేడ్స్‌తో వస్తుంది. వస్తుంది.

భారత మార్కెట్-స్పెక్ స్విఫ్ట్ అంతర్జాతీయ మార్కెట్-స్పెక్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. తాజాగా యూరోపియన్ మార్కెట్-స్పెక్ మోడల్‌ని క్రాష్ టెస్ట్‌లో పరీక్షించారు. యూరోపియన్ మార్కెట్-స్పెక్ సుజుకి స్విఫ్ట్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ప్రయాణికులందరికీ సైడ్ హెడ్ ఎయిర్ బ్యాగులు, సైడ్-చెస్ట్ ఎయిర్ బ్యాగులు మరియు ఫ్రంట్ ప్రయాణీకుల కోసం సైడ్ పెల్విస్ ఎయిర్ బ్యాగ్స్ వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.
సీట్ బెల్ట్ ప్రీ-టెన్షన్ మరియు సీట్ బెల్ట్ లోడ్ లిమిటర్‌ని కూడా కలిగి ఉంది. ఇది సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్ ఐసోఫిక్స్‌తో వస్తుంది. యూరోపియన్ స్విఫ్ట్ ADAS (Advanced Driver Assistance System) సూట్‌ని కలిగి ఉంటుంది. ఇందులో స్పీడ్ అసిస్టెన్స్, లేన్ అసిస్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్విఫ్ట్ ADAS సిస్టమ్ 62 శాతం స్కోర్ సాధించిందని క్రాష్ టెస్ట్ నివేదిక వెల్లడించింది.

అంతర్జాతీయ స్విఫ్ట్‌లోని ADAS ఫీచర్లలో స్పీడ్ అసిస్టెన్స్ మరియు లేన్ అసిస్ట్ సిస్టమ్ ఉన్నాయి. ఇవి 2.1 పాయింట్లు సాధించాయి. వీటితో పాటు యూరో క్రాష్ టెస్ట్‌లో ఆక్యుపేషన్ స్టేటస్ మానిటరింగ్, లేన్ సపోర్ట్ సిస్టమ్, ఏఈబీ కార్-టు-కార్ సిస్టమ్ వరుసగా 0.3 పాయింట్లు, 2.5 పాయింట్లు, 6.5 పాయింట్లు సాధించాయి.
భారత మార్కెట్-స్పెక్ స్విఫ్ట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఎబిఎస్ విత్ ఇబిడి, రివర్స్ కెమెరా పార్కింగ్, ఐసోఫిక్స్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో లభించే మారుతి సుజుకి స్విఫ్ట్‌లో ఎడిఎఎస్ టెక్నాలజీ లేదు. ఇండియా-స్పెక్ మోడల్ ధర వరుసగా రూ .6.49 లక్షలు నుంచి రూ .9.44 లక్షలుగా ఉంది. ఈ ధరలన్నీ (ఎక్స్-షోరూమ్)కి చెందినవి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








