వారేవా.. కొత్త టాటా నానో మైలేజ్ ఓ రేంజ్‌లో ఉందిగా.. ధర, ఫీచర్స్ అన్ని సూపర్.. ఇక సామాన్యుల కల నిజం కానుంది

దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన ఒక వ్యాపారవేత్తే కాకుండా పేదవారి కోసం ఎన్నో మంచి పనులు చేసిన మహనీయుడు. రతన్ టాటా ఏ వ్యాపారం మొదలు పెట్టిన కూడా దానిలో లాభాలను కాకుండా పేదవారికి ఉపయోగపడేలా ఉంటే చాలనుకుంటారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన టాటా కలల కారు నానో అంతగా క్లిక్ కాలేదన్న విషయం అందరికి తెలిసిందే. ధనవంతులకే మాత్రమే సొంతం అనుకున్న కార్లను మధ్యతరగతి వారికి సైతం అందించాలనే గొప్ప ఆశయంతో కేవలం రూ.ఒక లక్ష ధరలోనే నానో కారును తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రారంభంలో ఈ మోడల్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చినప్పటికి ఆ తరువాత అది క్రమంగా ఆదరణ కోల్పోయింది.

అమ్మకాలను తక్కువగా నమోదు చేయడం మొదలైంది. దీంతో తన కలల కారుకు ఆదరణ తగ్గడంతో టాటా మోటార్స్ ఈ కారు ఉత్పత్తిని క్రమంగా నిలిపివేసింది. ఆ తరువాత చాలా సమావేశాల్లో మాట్లాడిన రతన్ టాటా నానో కారును సరికొత్త టెక్నాలజీతో తీసుకొస్తామని వెల్లడించారు. ప్రధానంగా ఈ కొత్త నానో ఎలక్ట్రిక్ వేరియంట్‌లో వస్తుందని పేర్కొన్నప్పటికి దీనిని మార్కెట్లోకి విడుదల చేయకుండానే ఆయన కన్నుమూశారు.

New Tata Nano Expected Launch

అయితే ఆ గొప్ప వ్యక్తి ప్రస్తుతం లేకపోయినా కూడా టాటా మోటార్స్ నానో కారును తిరిగి త్వరలో మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించిన ఇంజిన్, పనితీరుపై ప్రయోగాలు నిర్వహిస్తుందని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే నానో కారు రాబోయే నెలల్లో తిరిగి మార్కెట్లోకి ఘనంగా లాంచ్ అవుతుందని తెలుస్తుంది.

మీడియా కథనాల ప్రకారం, కొత్త నానో ఈవీ వేరియంట్‌లో కాకుండా శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో లభిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారుల కోసం వస్తున్న ఈ కారు ధర రూ.3 లక్షల(ఎక్స్ షోరూమ్)కు అందుబాటులో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే మైలేజ్ కూడా చాలా ఎక్కువగా అందిస్తుందని తెలుస్తుంది.

New Tata Nano Expected Mileage

కొత్త టాటా నానో శక్తివంతమైన ఇంజిన్‌తో లీటర్ పెట్రోల్‌పై దాదాపు 30 కి.మీ వరకు ప్రయాణించేలా ఉంది. ధర విషయంలోనే కాకుండా మైలేజ్ పరంగా మధ్యతరగతి వినియోగదారులను ఈ కారు బాగా ఆకర్షించేలా ఉంది. పైగా ఇది గరిష్టంగా 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని సమాచారం. ఇన్ని మెరుగైన ఫీచర్లు ఉండటం కారణంగా భారత మార్కెట్లో కొత్త నానో మరో సంచలనానికి తెరలేపుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ కారుతో ట్రాఫిక్‌లో కూడా రయ్ మంటూ దూసుకుపోవచ్చు. కొత్త నానో డిజైన్ అచ్చం పాత మోడల్‌ లాగా ఉంటుందని ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది. ఇది మరింత మెరుగైన ఫీచర్లు, అందమైన క్యాబిన్, కొత్త హెడ్‌లైట్ సెటప్, వినియోగదారులను ఆకట్టుకునేలా వివిధ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని సమాచారం. సీటింగ్ పాత మోడల్‌ లాగా 4 సీటింగ్ ఆప్షన్‌తో వస్తుంది.

New Tata Nano Expected Features

కారు లోపల హై క్వాలిటీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ కండిషన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోస్, స్మార్ట్ టచ్ కనెక్టివిటీ, ఇంకా మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. కారు కలిగి ఉండాలనే కోరిక కలిగిన వారు తక్కువ ధరలో ఈ కొత్త నానోను ఎంచుకోవచ్చు. ఈ కారు లాంచ్‌తో చాలా మంది మధ్యతరగతి ప్రజల కోరిక తీరుతుంది.

ఇక పాత నానో విషయానికి వస్తే, ఇది మొదటగా 2009లో విడుదల అయింది. ఆ తర్వాత అమ్మకాలు ఆశించినంతగా లేకపోవడంతో 2018 లో ఉత్పత్తి నిలిపివేశారు. ఇది 21.9 నుండి 23.9 kmpl మైలేజీని అందించేది. రతన్ టాటా కలల కారు నానో కొత్త రూపాన్ని సంతరించుకుని త్వరలో మార్కెట్లోకి వచ్చిన తరువాత ప్రజలను ఆకట్టుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఓపిక పట్టాల్సిందే.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2024, 15:41 [IST]
English summary
New tata nano expected launch mileage features price full details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+