మళ్లీ వచ్చేస్తున్న టాటా సుమో.. నామ్ చోటా హై.. లేకిన్ సౌండ్ బడా హై!
టాటా మోటార్స్ నుంచి వచ్చిన సుమో (Tata Sumo) ఒకానొక కాలంలో మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ ఈ సుమో లక్షల మందికి ఫేవరెట్ వెహికిల్‌గా ఉంది. తక్కువ కాలంలో మంచి డిజైన్, మైలేజీ, కంఫర్ట్‌తో ఈ కారు పాపులారిటీని సంపాదించింది. ఇప్పటికీ మార్కెట్‌లో టాటా సుమో ఎంపీవీలు ఎక్కువగా రోడ్లపై కనిపిస్తాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఈ ఎంపీవీ అమ్మకాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఈ టాటా సుమో 1994 నుంచి 2019 వరకు దాదాపు 25 సంవత్సరాల వరకు ఈ సెగ్మెంట్‌లోనే కింగ్‌మేకర్‌గా ఉంది.
ఈ సుమోకి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. పొలిటీషియన్స్, ముఖ్యంగా ట్యాక్సీ డ్రైవర్లు దీనిని కొనేందుకు ఎగబడేవారు. ఇప్పటికీ టాటా సుమోలు పోలీసు, ఇతర ప్రభుత్వ సంస్థలకు రావాణా వాహనాలుగా ఉన్నాయి. అటువంటి టాటా సుమో త్వరలోనే మళ్లీ మార్కెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని రాకపై సోషల్ మీడియాతో పాటు, ఆటో రంగ మార్కెట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే దీని విడుదలకు సంబంధించి కచ్చితమైన వివరాలు అందుబాటులోకి రాలేదు. ఒకవేళ ఇది విడుదలైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సఫారీ కారును పోలి ఉంటుందని భావిస్తున్నారు. దీని డిజైన్‌ని పూర్తిగా అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా పాత సుమోతో పోలిస్తే ఇందులో భారీ ఇంటీరియర్ స్పేస్, ప్రస్తుత టెక్నాలజీకి తగినట్లు ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.
ఈ కొత్త టాటా సుమో శక్తివంతమైన 1.2-లీటర్ పెట్రోల్, అలాగే 1.5-లీటర్ డీజల్ ఇంజిన్‌తో రానుంది. దీనిని మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు ఆటో ట్రాన్స్‌మిషన్ లోనూ తీసుకురానున్నారు. ఈ సుమో ఇంజిన్ లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీ వరకు ఇస్తుందని అంచనా. ఇందులో రెండు కుటుంబాలు ఒకేసారి చాలా తక్కువ రవాణా ఖర్చుతో ప్రయాణించవచ్చు. ఇది మీ డబ్బుని ఆదా చేస్తుంది.

కొత్త టాటా సుమో ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) రూ. 8 లక్షల నుంచి రూ .10 లక్షల ధరలో వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న ఎంపీవీ వెహికిల్స్‌తో పోల్చితే తక్కువ ధరలో సుమోను ఇంటికి తెచ్చుకోవచ్చు. బూట్ స్పేస్ కోసం దీనిని 7 లేదా 9 సీటర్ ఆప్షన్‌లో అందించవచ్చు. కావున వ్యక్తిగత అవసరాలతో పాటు ఈ కార్లను ట్యాక్సీగా వాడుకోవచ్చు.
టాటా కార్లలో ఉండే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలతో కూడిన ఫీచర్లను ఇందులోని అందించనున్నారు. ఇప్పటి వరకు వస్తున్న ఊహాగానాల ప్రకారం 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్ స్టీరింగ్ వీల్, పవర్ విండోస్ వంటి ఫీచర్లను అందించే అవకాశం ఉంది. వీటితో పాటు స్మార్ట్ ఫీచర్లను జోడించి మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. వేరియంట్లను బట్టి ఫీచర్లలో మార్పులు ఉండనున్నాయి.

2019 వరకు 'టాటా సుమో గోల్డ్' పేరుతో ఇది అందుబాటులో ఉండేది. దీని ధర ఆ సంవత్సరం రూ .5.81 లక్షల నుంచి రూ .8.85 లక్షల మధ్య ఉంది. టాటా సుమో 3 డీజిల్ ఇంజిన్ (2956 cc, 1978 cc, 1948 cc) ఆప్షన్స్‌తో ఉండేంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 14.07 నుంచి 15.3 కి.మీ మైలేజీని ఇస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








