వచ్చే నెలలో (జులై 2024) లాంచ్ అయ్యే వాహనాలు ఇవే! ఓ లుక్కేసుకోండి
2024 జూన్ నెల దాదాపు ముగుస్తోంది.. ఈ నెలలో కొన్ని కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి. వచ్చే నెలలో (జూలై 2024) కూడా భారతీయ విఫణిలో అడుగుపెట్టడానికి కొన్ని వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్డబ్ల్యుబీ, మినీ కూపర్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మరియు బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ మొదలైనవి ఉన్నాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ మూడు కార్లు, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్డబ్ల్యుబీ (BMW 5 Series LWB)
భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వచ్చే నెలలో తన '5 సిరీస్ ఎల్డబ్ల్యుబీ' లాంచ్ చేయనుంది. ఇది లాంగ్ వీల్ బేస్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త తరం కారు పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ కంటే కొంత పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు పొడవు 5175మిమీ, వెడల్పు 1900మిమీ, ఎత్తు 1520మిమీ, 3105మిమీ వీల్‌బేస్ పొందుతుంది.

బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్డబ్ల్యుబీ కారు చూడటానికి దాని 5 సిరీస్ 530ఎల్ఐ ఎమ్ స్పోర్ట్స్ రూపంలో కనిపిస్తుంది. కాబట్టి మంచి డిజైన్ కలిగి వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుందని భావిస్తున్నాము. కంపెనీ ఈ కారులోని ఇంజిన్ మరియు టెక్నికల్ వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. దీని ధర రూ. 73.5 లక్షల నుంచి రూ. 78.9 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.
మినీ కూపర్ ఎస్
జులై 2024లో లాంచ్ అయ్యే మరో కారు కొత్త తరం మినీ కూపర్ ఎస్. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు మొదట్లో పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌తో రానుంది. ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రౌండ్ హెడ్‌లైట్స్, టెయిల్ లాంప్ పొందుతుంది. ఇందులో 9.4 ఇంచెస్ ఓఎల్ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది.

కొత్త మినీ కూపర్ ఎస్ మోడల్ అదే 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 204 హార్స్ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్ మరియు టార్క్ అనేది దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉంటుంది. దీని ధర రూ.42.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). ధర దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.
మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్
జూలైలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్న కార్లలో మరొకటి మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్. ఇది అవుట్‌గోయింగ్ పెట్రోల్ కంట్రీమ్యాన్‌తో పోలిస్తే.. పరిమాణం పరంగా కొంత పెద్దదిగానే ఉంటుందని తెలుస్తోంది. డిజైన్ అప్‌డేట్‌లు మాత్రం కొత్త కూపర్ ఎస్ మాదిరిగా అనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు విదేశీ మార్కెట్లో అమ్మకానికి ఉంది. కాబట్టి భారతదేశంలో కూడా మంచి అమమకాలు పొందుతుందని భావిస్తున్నాము.

విదేశీ మార్కెట్లో అమ్మకానికి ఉన్న మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ కారు సింగిల్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ (204 హార్స్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్), డ్యూయెల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (313 హార్స్ పవర్ మరియు 494 న్యూటన్ మీటర్ టార్క్) అనే రెండు వెర్షన్లలో లభిస్తుంది. ఈ రెండూ 66.45 కిలోవాట్ బ్యాటరీ పొందుతాయి. దీని ధర రూ. 48.10 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని భావిస్తున్నారు.
బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్
కార్లు మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లాంచ్ చేయడానికి సిద్ధమైంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ స్కూటర్ 8.9 కిలోవాట్ బ్యాటరీతో సీఈ 04. ఇది 130 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.6సెకన్లలో గంటకు 0-50 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 120కిమీ/గం అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటరుకు సంబంధించిన ధర వంటి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








