త్వరలో భారత్‌లో విడుదల కానున్న సరికొత్త మినీ కూపర్ కార్లు
ప్రీమియం కార్ల తయారీ సంస్థ మినీ (Mini) త్వరలో రెండు కొత్త కార్లను విడుదల చేయనుంది. కూపర్ S (Cooper S) పెట్రోల్ కారు, కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ (Countryman Electric) SUV కారు భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టనున్నాయి. వీటిని మరింత ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కారు మోడళ్లకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే భారత్‌లో ప్రారంభమయ్యాయి. అతి త్వరలోనే ఈ కార్లను మార్కెట్‌లోకి తెచ్చే అవకాశం ఉంది. అసలు ఈ కార్లలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
త్వరలో రాబోయే మినీ కూపర్ S 5th జనరేషన్ కొత్త అప్‌గ్రేడ్స్‌తో రానుంది. ముఖ్యంగా దీని ముందు భాగంలోని గ్రిల్ మరింత పలుచగా తయారు చేశారు. అయితే హెడ్ లైట్ ఎటువంటి మార్పులు చేయలేదు. హెడ్ లైట్ అదే వృత్తాకార ఆకారం మూడు కస్టమైజ్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు సిగ్నేచర్ స్టైల్‌లో ఉంటాయి. కారు వెనుక భాగంలో యూనియన్ జాక్ థీమ్‌తో ఉండే టెయిల్‌లైట్స్ ఆకర్షణీయంగా ఉండనున్నాయి.

ఈ ఇంజిన్ 2.0-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 201bhp పవర్ మరియు 300nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రస్తుతం అమ్మకానికి ఉన్న దానికంటే 26ps మరియు 20 nm టార్క్ ఎక్కువగా ఉంది. కొత్త కూపర్ S 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌షన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 6.6 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఇక మినీ కంట్రీమ్యాన్ కారు విషయానికి వస్తే ఇది BMW iX1 మోడల్ ఆధారంగా రూపొందించబడింది. ఇది రెండు వేరియంట్లలో (E మరియు SE All4) లభిస్తుంది. క్యాబిన్‌లో కొత్త సర్క్యూలర్ ఓఎల్ఈడీ డిస్ప్లే, కొత్త మెటీరియల్స్‌తో కొత్త ఇంటీరియర్‌ని పొందుతుంది. కంట్రీమ్యాన్ E 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 8.6 సెకన్లలో అందుకుంటుంది. మరింత శక్తివంతమైన కంట్రీమ్యాన్ SE ALL4 494nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఇక కంట్రీమ్యాన్ E ఫుల్ ఛార్జ్‌లో 462 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. SE ALL 4 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 433 కిలోమీటర్లు అందిస్తుంది. ఫీచర్ విషయానికి వస్తే, కొత్త మినీ కంట్రీమ్యాన్ E లెవల్ 2ADAS, మినీ కనెక్టెడ్ టెక్, డిజిటల్ కీ ప్లస్, ఫిష్ ఐ ఇన్-కార్ కెమెరా, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఇంకా మరెన్నో స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది.
ఈ రెండు మినీ కార్లు ఈ ఏడాది చివర్లో రానున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న మోడళ్ల కంటే వీటి ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ కార్లు BMW ఐఎక్స్ 1, వోల్వో XC 40 రీఛార్జ్, రాబోయే మెర్సిడెస్ బెంజ్ EQAలకు పోటీగా ఉండనుంది. ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ లగ్జరీ ఎస్‌యూవీలోని సెగ్మెంట్ కార్లకు కంట్రీమ్యాన్ E గట్టి పోటీని ఇవ్వనుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








