భారత్‌లో లాంచ్‌కు సిద్దమవుతున్న స్కోడా కొత్త కారు ఇదే!.. మరిన్ని వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా దేశీయ విఫణిలో కొత్త కొడియాక్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కారును ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. టెస్టింగ్ సమయంలో కంపించిన చిత్రాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 2023లో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించబడిన కొత్త స్కోడా కొడియాక్ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉపడ్తెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటాయని ఇప్పటికి వెల్లడైన ఫోటోల ప్రకారం తెలుస్తోంది. ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

టెస్టింగ్ సమయంలో కనిపించిన కొత్త తరం స్కోడా కొడియాక్ తెలుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారు ముందు భాగంలో స్కోడా 2డీ లోగోను చూడవచ్చు. ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్‌లతో కూడిన క్వాడ్ హెడ్‌లైట్ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే కొంచెం పెద్దగా ఉండటం గమనించవచ్చు. అంతే కాకుండా ఇందులో రీడిజైన్ చేయబడి కొత్త 20 ఇంచెస్ చక్రాలతో పాటు స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లను చూడవచ్చు.

Next Generation Skoda Kodiaq Spy

ఫ్రంట్ అండ్ సైడ్ ప్రొఫైల్ చూడ చక్కగా నిర్మయించబడి ఉంది. రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ స్కోడా అనే ఇంగ్లీష్ అక్షరాలను చూడవచ్చు. సీ ఆకారంలో ఉండే ర్యాప్‌రౌండ్ టెయిల్‌ల్యాంప్‌లను ఇక్కడ గుర్తించవచ్చు. మొత్తం మీద కంపెనీ ఈ కారును త్వరలోనే మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయం వెల్లడి కావాల్సి ఉంది.

కొత్త స్కోడా కొడియాక్ అంతర్జాతీయ మార్కెట్లో 5సీటర్ మరియు 7సీటర్ వెర్షన్లలో విక్రయిస్తోంది. కాగా భారతీయ మార్కెట్లో కంపెనీ 7సీటర్ మోడల్ మాత్రమే లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం, దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త స్కోడా కొడియాక్ మంచి డిజైన్ కలిగి, వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

Next Generation Skoda Kodiaq Spy

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందిలో 13 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే మరియు హెడ్స్ అప్ డిస్‌ప్లే వంటివి ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తున్న మోడల్‌లో మసాజ్ సీట్లు, నాలుగు USB C పోర్ట్‌లు, 14 స్పీకర్ కాంటన్ సౌండ్ సిస్టమ్ మరియు రెండు స్మార్ట్‌ఫోన్‌ల కోసం 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

అంతర్జాతీయ మోడల్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్స్ భారతీయ విఫణిలో లాంచ్ చేయనున్న కారులో కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. సేఫ్టీ కోసం ఇందులో ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) కూడా పొందనున్నట్లు సమాచారం. ఇది ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క ఎంక్యూబీ ఈవీఓ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న రెండవ తరం కొడియాక్. కాబట్టి ఇందులో అధునాతన ఫీచర్స్ ఉంటాయి.

Next Generation Skoda Kodiaq Spy

ఇంజిన్ విషయానికి వస్తే.. కొత్త స్కోడా కొడియాక్ కొత్త మోడల్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనుంది. ఇది 188 Bhp పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని తెలుస్తోంది. ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

Source: Zigwheels

More from DriveSpark

Article Published On: Thursday, June 20, 2024, 14:00 [IST]
English summary
Next generation skoda kodiaq spy shots reveal in india
Read more on: #skoda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+