అందరికి రూ.6 లక్షలో లభించే ఈ కారే కావాలి.. నిస్సాన్ 5 లక్షలకు పైగా అమ్మకాల్లో మాగ్నైట్‌కే జై కొట్టిన జనాలు..

జపాన్‌కు చెందినటువంటి ప్రముఖ కార్ల తయారీ కంపెనీ నిస్సాన్ ఇండియాలో దిగ్గజ ఆటోమొబైల్ సంస్థగా ఉంది. దేశీయంగా ఉన్న తయారీదారులకు గట్టిపోటీని ఇస్తూ అమ్మకాల పరంగా దూసుకుపోతోంది. నిస్సాన్‌కు ఇక్కడే కాకుండా గల్ఫ్ దేశాలలో కూడా మంచి మార్కెట్ ఉంది. అక్కడి వారు ఈ కంపెనీకి చెందిన కార్లను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇండియాలో మంచి ఆదరణ కంపెనీ నిస్సాన్ ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షలకు పైగా వాహనాలను విక్రయించింది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, 2005లో దేశీయంగా ప్రవేశించగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 5,13,241 కార్లను విక్రయించింది. 19 ఏళ్లలో నిస్సాన్ అమ్మకాల పరంగా ఈ మైలురాయిని చేరుకుంది. ఈ గణాంకాలు నిస్సాన్ ఇండియా కంపెనీ పట్ల ఉన్న ఆదరణను తెలియజేస్తుంది.

ముఖ్యంగా నిస్సాన్ కంపెనీ ఈ రేంజ్‌లో విక్రయాలను నమోదు చేయడానికి కీలక పాత్ర పోషించింది మాత్రం మాగ్నైట్‌(magnite) మోడల్. ఇది సబ్-కాంపాక్ట్ SUV. నిస్సాన్ 2020లో ఈ కారును ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో భారత్‌లో చాలా మంది వినియోగదారులను ఆకర్షించి కంపెనీ అమ్మకాలను పెంచడానికి చాలా తోడ్పాటు అందించింది. నిస్సాన్ మొత్తం విక్రయాల్లో దీని వాటే ఎక్కువగా ఉంది.

Nissan 5 Lakh Sales Milestone In India

అమ్మకాల్లో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఎగుమతులు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో కంపెనీ మొత్తం 9,040 యూనిట్లను హోల్‌సేల్‌గా పంపిణి చేయగా, ఇది దాని ముందు నెల అక్టోబర్‌లో 5,570 యూనిట్లతో పోలిస్తే 62 శాతం పెరుగుదలను సాధించింది. నవంబర్ 2023లో, కంపెనీ 2081 కార్లను ఎగుమతి చేయగా, ఈ ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఎగుమతులు దాదాపు 222 శాతం పెరగడం గమనార్హం.

ఈ వృద్ధి దేశీయ మార్కెట్ పెరుగుదలకు కూడా సహాయపడింది. నవంబర్‌లో విక్రయించిన 9,040 యూనిట్లలో దేశీయంగా 2,342 కార్లు అమ్ముడుపోగా, మిగిలిన 6698 కార్లు అంతర్జాతీయంగా ఇతర దేశాల మార్కెట్లకు ఎగుమతి చేయబడ్డాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఎగుమతుల సంఖ్య 2,449 యూనిట్ల నుంచి నెలకు 173.5 శాతం పెరిగింది. భారత మార్కెట్‌పై అంతర్జాతీయంగా పెరుగుతున్న మద్దతు కారణంగా ఇండియా నిస్సాన్ కార్లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది.

Nissan India Magnite

మేడ్ ఇన్ ఇండియా వాహనాలపై పెరుగుతున్న నమ్మకాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుందని కంపెనీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌లో తయారవుతున్న కార్లు మంచి నాణ్యతతో ఉంటాయి. దీంతో ఇతర దేశాల్లో ఇండియా బ్రాండ్‌కు ఆదరణ లభిస్తుండటం వలన కంపెనీ నుంచి వచ్చే వాహనాలను అక్కడి ప్రజలు ఆదరిస్తున్నారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ ఇటీవల కాలంలో మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎగుమతిని మొదలుపెట్టింది. దీంతో మొత్తం అమ్మకాలు మరింత పెరిగింది.

ఇదిలా ఉంటే దేశీయంగా మొత్తం అమ్మకాల్లో మాగ్నైట్ అత్యంత కీలక పాత్ర పోషించగా, దీనికంటే ముందు భారత మార్కెట్లో నిస్సాన్ కిక్స్, మైక్రా, టెర్రానో, సన్నీ మోడల్స్ కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం నిస్సాన్ ఇండియా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ మోడ్‌లో దాదాపు 65 దేశాలకు తన కార్లను ఎగుమతి చేస్తోంది. ఇన్ని దేశాలకు భారత్ నుంచి ఎగుమతి జరగడం అనేది ఇక్కడి మార్కెట్ వృద్ధిని చూపిస్తుంది.

Nissan Sales In India

ఇక నిస్సాన్‌కు అత్యంత కీలకమైన మాగ్నైట్ గురించి మాట్లాడుకుంటే, ఇండియాలో దీని ప్రారంభ ధర రూ.6 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, December 4, 2024, 8:30 [IST]
English summary
Nissan crossed 5 lakh sales milestone in india magnite has key role
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+