ఎగుమతుల్లో అరుదైన రికార్డ్.. ఇండియా దాటిన లక్షల వాహనాలు

ఇండియన్ మార్కెట్లో ఒకప్పుడు అధిక ప్రజాదరణ పొంది.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చిన నిస్సాన్ ఇండియా.. క్రమంగా దాని ఉత్పత్తులను దూరం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క మాగ్నైట్ మాత్రమే అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే నిస్సాన్ ఎక్స్-ట్రైల్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దేశీయ అమ్మకాలు ఎలా ఉన్నా.. ఎగుమతులు మాత్రం అద్భుతంగా ఉన్నాయని కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీ ప్రారంభం నుంచి ఎన్ని కార్లను ఎగుమతి చేసింది, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నిస్సాన్ మోటార్ ఇండియా తన ఎగుమతి కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి ఏకంగా 1.1 మిలియన్ యూనిట్లను ఎగుమతి చేసినట్లు సమాచారం. అంటే ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇది ఎగుమతుల్లో అరుదైన మైలురాయి అనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే నిస్సాన్ కార్లకు విదేశీ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Nissan India Exports Crossed 1 1 Million Units

కంపెనీ యొక్క ఎగుమతులు 'మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్'ను ప్రతిబింబిస్తాయి. నిస్సాన్ మాగ్నైట్ 2024 జూన్ 29న తమిళనాడులోని ఎన్నూర్ కామరాజర్ పోర్ట్‌లో ఈ విజయాన్ని సాధించింది. జూన్ 2024లోనే.. నిస్సాన్ 10284 యూనిట్ల ఎగుమతులను పొందగలిగింది. దీన్నిబట్టి చూస్తే నిద్దం మాగ్నైట్ వార్షిక అమ్మకాలు 76.33 శాతం, నెలవారీ అమ్మకాల్లో 65.7 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది.

జూన్ 2024లో మొత్తం హోల్‌సేల్ ఎగుమతు 8177 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది వార్షిక వృద్ధిలో 149 శాతం, నెలవారీ అమ్మకాల్లో 104 శాతం ఎక్కువని తెలుస్తోంది. అదే సమయంలో దేశీయ అమ్మకాలు 2017 యూనిట్లుగా తెలుస్తోంది. అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న సందర్భగా నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ.. ఈ మైలురాయిని చేరుకోవడానికి సహకరించిన వారికి కృతఙ్ఞతలు తెలిపారు.

Nissan India Exports Crossed 1 1 Million Units

నిస్సాన్ ఇండియా యొక్క పాపులర్ మొద మాగ్నైట్ డిసెంబర్ 2020లో లాంచ్ అయినప్పటి నుంచి మంచి సంఖ్యలో అమ్ముడవుతూనే ఉంది. భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ మోడల్ 140000 యూనిట్లు విక్రయించబడినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే నిస్సాన్ మాగ్నైట్ మార్కెట్లో ఎంత ఆదరణ పొందుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కంపెనీ యొక్క విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

నిస్సాన్ ఇండియా దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్ పాదముద్రను విస్తరించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ శ్రీనగర్, సేలం, ఢిల్లీ మరియు దుర్గాపూర్‌ల మొదలైన ప్రాంతాల్లో ఇప్పుడు ఏకంగా 272 టచ్‌పాయింట్‌లను కలిగి ఉంది. ఇవన్నీ దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ కస్టమర్లకు కావాల్సిన సేవలను అందిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నిస్సాన్ తన నెట్‌వర్క్ మరింత పెంచడానికి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

భారతదేశంలో మాత్రమే కాకుండా.. నిస్సాన్ తన కార్లను బంగ్లాదేశ్, ఉగాండా మరియు బ్రూనైతో సహా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇటీవల నిస్సాన్ కంపెనీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ మరియు కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇక రాబోయే ఎక్స్-ట్రైల్ మోడల్ కూడా తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని సమాచారం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 4, 2024, 9:00 [IST]
English summary
Nissan india exports crossed 1 1 million units milestone
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+