పండుగ సీజన్‌లో కొనాల్సిన రెండు తోపు కార్లు.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. వీటిలో ఏదీ కొంటే బెటర్?
కొద్ది రోజుల క్రితమే నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ని ఆ సంస్థ విడుదల చేసింది. ఈ నిస్సాన్ మాగ్నైట్ భారత్‌లో మంచి మార్కెట్‌ని కలిగి ఉంది. ఈ కారు భారీ అప్‌డేట్స్‌తో మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నేరుగా హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజా, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి ఇతర సబ్-4 మీటర్ల ఎస్‌యూవీలకు గట్టి పోటిని ఇస్తుంది.
దీని ధర, ఇతర ఫీచర్లు గమనిస్తే ఇది నేరుగా మారుతి స్విఫ్ట్‌కి గట్టి పోటీని ఇస్తుంది. మే నెలలో మారుతి స్విఫ్ట్ 4th జనరేషన్ వెర్షన్‌ని ఆ సంస్థ విడుదల చేసింది. ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో అత్యంత పేరొందిన కారుగా ఉంది. కొత్తగా లాంచ్ చేసిన మ్యాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్, మారుతి స్విఫ్ట్ మధ్య తేడాలు ఈ రెండిట్లో ఏదీ బెస్ట్ అనే అంశాలపై ఓ లుక్కేయండి.

నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకి స్విఫ్ట్ అనే రెండు వాహనాలను పోల్చి చూస్తే డిజైన్, యుటిలిటీ పరంగా భారీ తేడాలు ఉన్నాయి. మాగ్నైట్ ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ కాబట్టి, ఇది సహజంగా స్విఫ్ట్ కంటే ఎక్కువ స్పేస్‌ని కలిగి ఉంటుంది. మాగ్నైట్ 3994 మిమీ పొడవు, 1758 మిమీ వెడల్పు, 1572 మిమీ ఎత్తుని కలిగి ఉంటుంది. ఈ కారు 2500 మిమీ వీల్‌బేస్‌ని కలిగి ఉంది.
ఈ కారు విశాలమైన ఇంటీరియర్, 336 లీటర్ల బూట్ కెపాసిటీని కలిగి ఉంది. అలాగే, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 205 మి.మీగా ఉంది. ఇక స్విఫ్ట్ 3860 మిమీ పొడవు, 1735 మిమీ వెడల్పు, 1520 మిమీ ఎత్తు, 265 లీటర్ల బూట్ స్పేస్, 163 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంది. ఇందులో నిస్సాన్ మాగ్నైట్ ఎక్కువ స్పేసింగ్‌ని కలిగి ఉండనుంది.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్, నిస్సాన్ మాగ్నైట్ క్యాబిన్ లోపల ఆధునిక, సాంకేతిక టెక్నాలజీతో కూడిన ఫీచర్లను కలిగి ఉన్నాయి. మాగ్నైట్‌లో లెథరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో అలంకరించిన డ్యాష్ బోర్డ్‌తో ఇంటీరియర్‌ని కలిగి ఉంటుంది. ఇందులో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఈ కార్లలో ఉన్నాయి.
ఇక స్విఫ్ట్‌లో 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మ్యాగ్నైట్‌లో 8 అంగుళాల టచ్ స్క్రీన్స్ ఉన్నాయి. స్విఫ్ట్‌లో డ్రైవర్ డిస్‌ప్లే కోసం MIDతో కూడిన అనలాగ్ డయల్స్‌ని కలిగి ఉంది. మాగ్నైట్ అడ్వాన్స్‌డ్ 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లేను అందిస్తుంది. ఇప్పుడు గ్రాఫిక్స్‌ని రీడిజైన్ చేసి వస్తుంది. ఈ రెండు వాహనాలు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో పాటు కనెక్టెడ్ కార్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి.

రెండు మోడళ్లలో యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. ఇక ఈ రెండిట్లో సేఫ్టీ కూడా ఎక్కువే అని చెప్పవచ్చు. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ కెమెరాలు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ప్రయాణికులకు సేఫ్టీని అందిస్తాయి. కావున ఈ రెండు కార్లు సేఫ్టీలో ఒకే రకమైన సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ఈ కార్ల ఇంజిన్లు కస్టమర్ ప్రాధాన్యతలకు అనుగుణంగా వేర్వేరు పవర్‌ట్రైన్ ఆప్షన్లతో వస్తాయి. స్విఫ్ట్ 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 82 ps శక్తిని, 112 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌ని మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. స్విఫ్ట్ సీఎన్‌జీ వెర్షన్ ఆఫర్‌లోనూ అందుబాటులో ఉంటుంది. ఇందులో శక్తిని కొద్దిగా తగ్గించినప్పటికీ అద్భుతమైన మైలేజీని అందిస్తుంది.
ఇక మాగ్నైట్ రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఇందులో 72 ps పవర్ 96 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 100 ps శక్తిని 160 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంది. టర్బో వేరియంట్ కోసం 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ AMT, సివిటి ఆప్షన్లలో వస్తుంది.
ఈ రెండు కార్ల ధరలను పరిశీలిస్తే 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ ధర రూ .6.49 లక్షల నుంచి రూ .9.64 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు, నిస్సాన్ మాగ్నైట్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ .5.99 లక్షలుగా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.11.50 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే.


Click it and Unblock the Notifications








