ఆర్మీ, పోలీసుల కోసం 'ఫ్రీడమ్‌ ఆఫర్‌'.. ఆ కారుని కొంటే ఏకంగా రూ.1.64 లక్షల డిస్కౌంట్‌!

డిఫెన్స్, సెంట్రల్ పారామిలిటరీ, స్టేట్ పోలీసుల కోసం నిస్సాన్ ఇండియా అదిరిపోయే న్యూస్‌ చెప్పింది. ఈ కంపెనీ లైనప్‌లోని నిస్సాన్‌ మాగ్నైట్‌ కారుపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక 'ఫ్రీడమ్ ఆఫర్' కింద ఆగస్టు 2024 వరకు రూ .1.64 లక్షల వరకు తగ్గింపుని అందిస్తుంది. ఈ 5-సీటర్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ .5.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కావడం గమనార్హం. అయితే పైన తెలిపిన వారికి మాత్రమే ప్రత్యేకంగా డిస్కౌంట్ అందించనుంది.

ముందుగా రక్షణ శాఖలో పనిచేసే సిబ్బంది నిస్సాన్ మాగ్నైట్‌ని సిబ్బంది కోసం ప్రత్యేక ఆఫర్లను అందించే CSD AFD పోర్టల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందులోని బేస్ మోడల్ XE ధర రూ .5,99,900 (ఎక్స్-షోరూమ్)గా ఉండగా వీరికి రూ .1,00,900 ఆదాతో కేవలంరూ .4,99,000 కు లభిస్తుంది.

Nissan-Magnite-Freedom-Offer

డిఫెన్స్, సెంట్రల్ పారామిలిటరీ, స్టేట్ పోలీస్ ఫోర్సెస్ కోసం డిసెంబర్ 2020లోనే ఈ కారు లాంచ్‌ సమయంలో అందుబాటు ఉన్న ధరతోనే ఫ్రీడమ్ ఆఫర్‌లోనూ అందిస్తున్నారు. భారతదేశం అంతటా బుకింగ్ లు మరియు డెలివరీలను సులభతరం వేగంగా చేయడానికి నిస్సాన్ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ని కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన వివరాలకు దగ్గర్లోని నిస్సాన్‌ షోరూమ్‌లను సంప్రదించి కూడా తెలుసుకోవచ్చు.

ఇక మాగ్నైట్ XL వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ .7,04,000గా ఉంది. అయితే దీనిని రూ .1,64,010 తగ్గింపుతో CSD పోర్టల్ ద్వారా రూ .5,39,990 కు తగ్గుతుంది. టాప్-స్పెక్ మాగ్నైట్ XV ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ .7,82,000 నుంచి రూ .6,29,000 వరకు తగ్గుతుంది.

కేంద్ర పారామిలిటరీ, రాష్ట్ర పోలీసు బలగాలకు ఆఫర్: కేంద్ర పారామిలటరీ, రాష్ట్ర పోలీసు బలగాలు కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ ద్వారా ప్రత్యేక రేట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. బేస్ మాగ్నైట్ XE వేరియంట్‌ని రూ .34,900 తగ్గింపుతో రూ .5,65,000తో ఇంటికి తీసుకువెళ్లవచ్చు. రూ .7,04,000 ఎక్స్‌-షోరూమ్ ధరతో ఉన్న మాగ్నైట్ XLని కేవలం రూ .6,04,000 కొనుగోలు చేయవచ్చు.

మాగ్నైట్ XE AMT, మాగ్నైట్ GEZA సీవీటీ ట్రాన్స్‌మిషన్‌ ధరలు వరుసగా రూ.5,94,900, రూ.9,09,000 ధరల వద్ద లభిస్తున్నాయి. ఈ స్కీమ్ కింద వీటి ధరలు వరుసగా రూ.65,000, రూ.75,000 తగ్గాయి. ఈ ఆఫర్లు అన్నీ తక్షణమే అందుబాటులో ఉన్నాయి. డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ప్రతీ ఒక్కరూ ఈ ఆఫర్లను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి షరతలు లేవు.

ఇక నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. 72 bhpని ఉత్పత్తి చేసే 1.0-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5-స్పీడ్ MT లేదా AMT జతచేయబడింది. అలాగే 100 hpని ఉత్పత్తి చేసే టర్బోఛార్జ్డ్‌ వెర్షన్ సీవీటీ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లతో అందుబాటులో ఉంది. ఇంధన సామర్థ్యం వేరియంట్‌ని బట్టి ఈ కార్లు లీటరుకు 17.7 కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి.

నిస్సాన్ మాగ్నైట్ వరుసగా మూడు సంవత్సరాలుగా 30,000 యూనిట్లకు పైగా అమ్మకాలను సాధించింది. అయితే ఈ ఏడాది జూన్‌లో చెన్నై ప్లాంట్‌లో లక్ష యూనిట్లను మైలురాయిని జనవరిలో తాకింది. అంతే కాకుండా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఎగుమతులు 30 వేల మార్కును అందుకుంది. ఆర్మీ, పోలీసు బలగాల అంకితభావానికి, సేవలకు కృతజ్ఞతగా ఈ ప్రత్యేక ఆఫర్‌ని అందించడం మా అదృష్టమని నిస్సాన్ మోటార్ ఇండియా తెలిపింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, August 13, 2024, 7:20 [IST]
English summary
Nissan magnite freedom offer for defence and police forces check discount prices in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+