నిస్సాన్ కొత్త కారు లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. ఇదిగో ఇక్కడ చూడండి
ఒకప్పుడు భారతీయ మార్కెట్లో గొప్ప వైభవంతో వెలిగిపోయిన నిస్సాన్ ఇండియా.. ప్రస్తుతం కేవలం ఒక కారును మాత్రమే విక్రయిస్తూ ముందుకు సాగుతోంది. అయితే ప్రత్యర్థులతో పోటీ పడటానికి, మార్కెట్లో తన ఉనికిని విస్తరించుకోవడానికి కంపెనీ ఇప్పుడు సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముడవుతున్న ఎక్స్-ట్రైల్ (X-Trail) కారును దేశీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ కారును ఆవిష్కరించింది. ఇప్పుడు లాంచ్ డేట్ కూడా వెల్లడించింది. కంపెనీ ఈ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుంది? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇటీవలే సరికొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఆవిష్కరించిన కంపెనీ.. ఈ కారును ఆగష్టు 1వ తేదీన అధికారికంగా భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఈ కారును సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా ఇండియాలో విక్రయించనుంది. కాబట్టి ఈ కారు ధర కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇది స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది.

భారతీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 1.5 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా పొందనున్నట్లు సమాచారం. ఇంజిన్ 163 హార్స్ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది షిఫ్ట్ బై వైర్ సీవీటీ ఆటో గేర్‌బాక్స్‌కు జత చేయబడుతుందని తెలుస్తోంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందించే అవకాశం ఉంది.
మంచి డిజైన్ కలిగిన ఈ కారు.. డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఆటో హోల్డ్ ఫంక్షన్, క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, కీలెస్ ఎంట్రీ అండ్ గో, మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

ఇవి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో వైపర్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటివి కూడా నిస్సాన్ ఎక్స్-ట్రైల్ పొందుతుంది. 7 సీట్స్ కాన్ఫిగరేషన్‌లో లభించనున్న ఈ కారు రెండో వరుసలో 40/20/40 స్పిల్ట్ ఫోల్డింగ్, స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్ పొందుతుంది. మూడో వరుసలో 50/50 స్ప్లిట్-ఫోల్డింగ్ మరియు రిక్లైనింగ్ ఫంక్షన్ ఉన్నాయి.
త్వరలో లాంచ్ కానున్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కేవలం మూడు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ మరియు పెర్ల్ వైట్ కలర్స్. ఇవి మూడూ చూడ చక్కగా ఉంటాయి. ఇది 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటివన్నీ కూడా భారతీయ వినియోగదారులకు సరిపోయే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక చివరగా నిస్సాన్ లాంచ్ చేయనున్న కొత్త ఎక్స్-ట్రైల్ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే ఇది సీబీయూ మార్గం ద్వారా దేశానికీ వస్తుంది, కాబట్టి ధర కొంత ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు ధర రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన ధరలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడికానున్నాయి. బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








