నిస్సాన్ లాంచ్ చేయనున్న కొత్త కారు ఇదే - వివరాలు ఇక్కడ చూడండి
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'నిస్సాన్' ఎట్టకేలకు 'కిక్స్' కాంపాక్ట్ క్రాస్ ఓవర్ మోడల్ ఫోటోలను లాంచ్ చేయడానికి ముందే విడుదల చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త SUV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నిస్సాన్ కంపెనీ న్యూయార్క్ మోటార్ షో 2024 ప్రారంభించడానికి ముందే తన కిక్స్ SUVని వెల్లడించింది. ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ కంటే కూడా పెద్దగా ఉంటుంది. ఇది చూడటానికి ఇండోనేషియా మార్కెట్‌లలో విక్రయించబడే మిత్సుబిషి ఎక్స్‌ఫోర్స్ SUV మాదిరిగా ఉంటుంది. ఈ SUV ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మితమవుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

నిస్సాన్ కిక్స్ చూడగానే ఆకర్శించబడే డిజైన్ పొందుతుంది. అంతే కాకుండా బాక్సర్ డిజైన్ అందించే ఫెండర్‌లను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఫాసియా ప్రత్యేకంగా కనిపిస్తుంది. రూప్, డోర్స్ వంటి వన్నీ XForce మాదిరిగానే ఉంటాయి. ముందు భాగంలో క్షితిజ సమాంతరంగా ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. చుట్టూ మాట్టే బ్లాక్ బాడీ క్లాడింగ్‌తో చంకీగా కనిపించే వీల్ ఆర్చ్‌లను పొందుతుంది. ఇందులో 19-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం గమనించవచ్చు.
వెనుక వైపు ప్రత్యేకంగా కనిపించే టెయిల్ లైట్ ఉంటుంది. టైల్‌గేట్ వెడల్పు అంతటా బ్లాక్ కలర్ ఉండటం గమనించవచ్చు. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రూప్ మరియు మిర్రర్స్ కూడా ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ పొందుతుంది. నిస్సాన్ కిక్స్ ఎడమ మరియు కుడి చేతి డ్రైవ్ ఆప్షన్స్ పొందుతుంది. ఉత్తర అమెరికా వంటి మార్కెట్‌లలో నిస్సాన్ యొక్క ఎంట్రీ లెవెల్ SUVగా విక్రయానికి అందుబాటులో ఉండనుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త నిస్సాన్ కిక్స్ లోపల మొత్తం ప్రీమియర్ మెటీరియల్స్ పొందుతుంది. లోపల 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ XForce డబుల్ లేయర్డ్ డిజైన్ పొందుతుంది. అయితే క్వాలిటీ పరంగా మిత్సుబిషి కంటే కూడా ఉత్తమంగా ఉంటుంది. HVAC కోసం టచ్ సెన్సిటివ్ కంట్రోల్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఇందులో ఉంటాయి.
ఇవి మాత్రమే కాకుండా.. ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, రెడ్ అసెట్, నిస్సాన్ జీరో గ్రావిటీ సీట్ డిజైన్ హెడ్‌రెస్ట్ మౌంటెడ్ మరియు బోస్ ఆడియో స్పీకర్లు వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు మంచి రక్షణ అందించే విధంగా ఉంటాయి. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ వార్ణింగ్, ఆటోమైక్ ఎమర్జెన్సీ, ADAS ఫీచర్స్ ఉంటాయి.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ క్రాస్ఓవర్ 2.0 లీటర్ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 141 Bhp పవర్ మరియు 190 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. అంతే కాకుండా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం (AWD) అందుబాటులో ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు తప్పకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నాము.
నిస్సాన్ కంపెనీ ఈ SUVని భారతీయ మార్కెట్లో లాంచ్ చేస్తుందా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇది కుడివైపు డ్రైవింగ్ ఆప్షన్ కలిగి ఉండటం వల్ల మొదటి విదేశీ మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ తరువాత ఇది భారతీయ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








