నిస్సాన్ ఎక్స్-ట్రైల్ డెలివరీలు ప్రారంభం.. టయోటా ఫార్చ్యూనర్‌కి చెక్ పెట్టనున్న 7 సీటర్ ఎస్‌యూవీ ఇదే!
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail SUV) ఆగస్టు ఆరంభంలో భారతీయ మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ ఫుల్ సైజ్ ఎస్‌యూవీ భారత్‌లోని టయోటా ఫార్చ్యూనర్ గట్టిపోటిని ఇవ్వనుంది. అయితే దీని ధరను నిర్ణయించడంలో కంపెనీ విఫలమైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఎస్‌యూవీ రూ. 49.92 లక్షల (ఎక్స్-షోరూమ్) భారీ ధరను కలిగి ఉండటమే కారణం. అయితే ఈ ఎస్‌యూవీని పూర్తిగా కంప్లీట్ బిల్ట్ యూనిట్ ద్వారా దీనిని ఇండియాలోకి దిగుమతి చేసుకోవడంతో ఇంత భారీ మొత్తంలో వసూలు చేయాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది.
తాజాగా ఈ నిస్సాన్ ఎక్స్-ట్రైల్ డెలివరీలు ప్రారంభ అయ్యాయి. బెంగళూరులో తొలి యూనిట్‌ని డెలివరీ చేసిన ఫోటోలను కంపెనీ విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీ 7-సీటర్ వెర్షన్‌లో భారీ డిజైన్‌తో లభిస్తుంది. భారత మార్కెట్‌లో ఇది కేవలం టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. 1.5-లీటర్ 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్, 12 వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ ఉన్నాయి.

ఈ ఇంజిన్‌లో వేరియబుల్ కంప్రెషన్ టెక్నాలజీ మరియు టర్బో ఛార్జర్ ఉన్నాయి. ఇది మెరుగైన పవర్ డెలివరీతో పాటు మంచి మైలేజీకి హామీ ఇస్తుంది. సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ ఇంజిన్ గరిష్టంగా 160 bhp పవర్ వద్ద 300 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
ఈ ఎక్స్-ట్రైల్ ఆటోమేటిక్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ వంటి ఫ్యూయల్ ఎఫిసియెన్సీతో వస్తుంది. ఈ సెగ్మెంట్‌లోని ఇతర ప్రత్యర్థుల మాదిరిగా కాకుండా, ఈ ఫుల్-సైజ్ ఎస్‌యూవీ ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో మాత్రమే వస్తుంది. అంటే ఈ మోడల్ పక్కా ఫ్యామిలీ కారుగా ఇండియన్ రోడ్లపైకి రానుంది. ఎక్స్-ట్రైల్ ఆఫ్ రోడ్ సామార్థ్యాలను కూడా కలిగి ఉంది. ఇది లుక్స్ పరంగా కూడా ఎవరినైనా ఆకర్షించగలదు.

ఈ కారు ముందు భాగంలోని నిస్సాన్ డిజైన్ వి-మోషన్ గ్రిల్ మరియు హెడ్‌లైట్స్ పైన DRLs అన్నీ చూడటానికి అద్భుతమైనవిగా ఉంటాయి. ఇందులో 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ సైడ్ వ్యూలో మీ దృష్టిని ఆకర్షిస్తాయి. బ్యాక్‌సైడ్ డిజైన్‌లో రూఫ్-ఫిట్ చేసిన స్పాయిలర్ మరియు స్లిమ్ టెయిల్‌ల్యాంప్స్ నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌కి మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. ఈ జపనీస్ ఆటోమొబైల్ కారులో మంచి డిజైన్‌ని కలిగి ఉందనే చెప్పాలి.
సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో డార్క్ థీమ్ ఇంటీరియర్‌ని నిర్మించారు. ఇందులోని 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లోటింగ్ 8.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డింగ్స్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో సేఫ్టీ ఫీచర్లు కూడా ఎక్కువే అని చెప్పాలి. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), 360 డిగ్రీల వ్యూ కెమెరా, 7 ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు దేశంలో టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ మరియు ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








