రేపటి నుంచే నిస్సాన్ ఎక్స్-ట్రైల్ బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడో తెలుసా?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ త్వరలోనే లాంచ్ కావడానికి సిద్ధమైంది. అయితే కంపెనీ అంతకంటే ముందు ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించనుంది. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఒక్క కారును మాత్రమే విక్రయిస్తున్న నిస్సాన్ మరో కారును వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఎక్స్-ట్రైల్ లాంచ్ చేయనుంది. ఈ కారు ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్నట్లు సమాచారం. కంపెనీ యొక్క ఈ కారును బుక్ చేసుకోవడానికి ఎంత వెచ్చించాలి? డెలివరీలు ఎప్పుడు అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కోసం రూ. 1 లక్ష రూపాయల టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే బుకింగ్స్ రేపటి నుంచి (జులై 26) ప్రారంభమవుతాయి. కాగా కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించిన తరువాత డెలివరీలను ప్రారంభించే అవకాశం ఉంది. నిస్సాన్ తన ఎక్స్-ట్రైల్ ధరలను ఆగష్టు 1న ప్రకటించనుంది. ఈ కారు ధర రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్నారు.

నిస్సాన్ కంపెనీ యొక్క ఎక్స్ ట్రైల్ 1.5 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 12 వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. ఇది 163 హార్స్ పవర్, 300 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది షిఫ్ట్ బై వైర్ సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.
నిస్సాన్ యొక్క కొత్త ఎక్స్ ట్రైల్ కారు కేవలం మూడు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ మరియు పెర్ల్ వైట్ కలర్స్. ఎక్స్ ట్రైల్ యొక్క అన్ని వేరియంట్లు 20 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు దేశీయ విఫణిలో 7 సీటర్ రూపంలో మాత్రమే లభిస్తుందని సమాచారం. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.

ఎక్స్-ట్రైల్ డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటివి పొందుతుంది. ఈ లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
7 సీటర్ రూపంలో మాత్రమే విక్రయించబడనున్న కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ యొక్క రెండవ వరుసలో 40/20/40 స్ప్లిట్ ఫోల్డింగ్, స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్స్ పొందుతుంది. అదే విధంగా మూడో వరుసలో 50/50 స్ప్లిట్ ఫోల్డింగ్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్‌లు ఉంటాయి. కాబట్టి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది. అయితే ఈ కారు దీని విభాగంలో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

చివరగా సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఆటోమెటిక్ వైపర్లు, ట్రాక్షన్కంట్రోల్ , హిల్ స్టార్ట్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు ఉంటాయి. కంపెనీ యొక్క ఎక్స్-ట్రైల్ భారతీయ మార్కెట్లో స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








