నివురు గప్పిన నిప్పులా వచ్చిన కొత్త 'నిస్సాన్‌ X-Trail'.. ఫార్చ్యూనర్‌ కంటే ధర ఎక్కువండోయ్‌!

దశాబ్ద కాలం తర్వాత నిస్సాన్ ఎట్టకేలకు 4th జనరేషన్‌ ఎక్స్-ట్రైల్‌ని భారతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది పూర్తిగా దిగుమతి చేసుకున్న సీబీయూలో మోడ్‌లో భారత్‌లో అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఈ ఎస్‌యూవీకి సంబంధించిన బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. రూ. 1 లక్ష టోకెన్ అమౌంట్‌ చెల్లించి ఈ కారుని బుక్‌ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరంలో 4.50 లక్షల యూనిట్ల ఎక్స్‌-ట్రైల్‌లు అమ్ముడయ్యాయి. 2023 లో విక్రయించిన టాప్ 5 ఎస్‌యూవీలలో ఒకటిగా నిస్సాన్‌ ఎక్స్‌-ట్రైల్‌ నిలిచింది. ప్రస్తుతం ఇది భారత్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

విడుదలకు ముందే ఈ నిస్సాన్‌ ఎక్స్‌-ట్రైల్‌ని బుక్‌ చేసున్న వారికి డెలివరీలు చేయనున్నారు. ప్రస్తుతం మొదటి సెట్ కింద 150 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్, సాలిడ్ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఈ ఎక్స్-ట్రైల్‌ భారతీయ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఏడు సీటర్‌ వెర్షన్‌లో లభిస్తుంది.

NissanX-Trail-Launched-In-India

డిజైన్: ఇండియా-స్పెక్ ఎక్స్-ట్రైల్ దాని అంతర్జాతీయ మోడల్‌తో పోల్చితే ప్రత్యేక గ్రిల్‌ డిజైన్‌తో వస్తుంది. నిస్సాన్ 3rd జనరేషన్‌ కంటే సొగసైన డిజైన్‌ని మనం గమనించవచ్చు. ముందు భాగంలో స్ప్లిట్ ఎల్ఈడీ లైటింగ్, స్లీక్ ఇన్వర్టెడ్ L ఆకారంలో ఉన్న ఎల్ఈడీ DRLs, వెనుక భాగంలో L ఆకారంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. దీనిని భారీ ఆకృతిలో నిస్సాన్‌ ప్రవేశ పెట్టింది. ఇది ఆఫ్‌రోడ్‌ సామర్థ్యాలను కలిగి ఉంది.

ఈ SUV స్టాండర్డ్ 20-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. దాని సెగ్మెంట్‌లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. ఈ ఎస్‌యూవీ 4,680mm పొడవు, 1,840mm వెడల్పు, 1,725mm ఎత్తుని కలిగి ఉంటుంది. 2,705mm వీల్‌బేస్‌ని కలిగి ఉంది. డోర్ క్లాడింగ్స్, రియర్ వైపర్ మరియు వాషర్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ టాప్-మౌంటెడ్ స్టాప్‌ల్యాంప్ మరియు షార్క్-ఫిన్ యాంటెనా ఉన్నాయి. ఇవి ఎక్స్-ట్రైల్‌కి అదనపు లుక్‌ని అందిస్తాయి.

Nissan-X-Trail-Price-In-India

ఇంటీరియర్స్ & ఫీచర్లు: విశాలమైన ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్‌ క్లస్టర్‌తో సహా ప్రీమియం ఫీచర్లను ఎక్స్-ట్రైల్‌ కలిగి ఉంది. క్యాబిన్‌లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ వైపర్లు మరియు ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేకింగ్‌ని కలిగి ఉంది. మొత్తానికి ఇది మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

డ్రైవ్ మోడ్స్, సెంటర్ కన్సోల్ కప్ హోల్డర్స్, వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ వంటి అదనపు ఆప్షన్స్‌ ఉన్నాయి. 360 డిగ్రీల కెమెరా, ప్యాడిల్ షిఫ్టర్లు, అడ్జస్టబుల్ సీట్ స్లైడింగ్, రిక్లైనింగ్ ఫంక్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఎక్స్-ట్రైల్ 7 ఎయిర్ బ్యాగ్స్‌, ఎబిఎస్ విత్‌ ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంటుంది.

Nissan-X-Trail-Vs-Toyota-Fortuner

ఇంజిన్ స్పెసిఫికేషన్లు: ఇండియా-స్పెక్ నిస్సాన్ ఎక్స్-ట్రయల్ ఏకైక ఇంజిన్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. ఇది 1.5-లీటర్ మూడు సిలిండర్ల టర్బో-పెట్రోల్ యూనిట్, 12 వి మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్‌ ద్వారా 161bhp పవర్ మరియు 300nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ అంతరాయం లేని షిఫ్ట్-బై-వైర్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది స్మూత్ గేర్ షిఫ్టింగ్‌ అనుభూతిని అందిస్తుంది.

అయితే ఇది కేవలం 2WD (వీల్‌డ్రైవ్‌)తో మాత్రమే వస్తుంది. అయినప్పటికీ ఇది లైట్ ఆఫ్-రోడింగ్‌ల లోనూ మంచి డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌న అందిస్తుంది. పెద్ద ఫ్యామీలల కోసం మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తే ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుంది. అయితే దీనిని టయోటా ఫార్చ్యూనర్‌ కంటే ఎక్కువ ధరతో రూ. 49.92 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌)గా ఉండటం కాస్త ఎక్కువే అని చెప్పాలి.

More from DriveSpark

Article Published On: Thursday, August 1, 2024, 17:52 [IST]
English summary
Nissan x trail launched in india at rs 49 92 lakhs more expensive than toyota fortuner
Read more on: #nissan #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+