భారత్ కోసం నిస్సాన్ కొత్త కారు 'ఎక్స్-ట్రైల్'.. ఆసక్తికర విషయాలు

ఎన్నో రోజుల నిరీక్షణ తరువాత నిస్సాన్ ఇండియా తన కొత్త నాల్గవ జనరేషన్ 'ఎక్స్-ట్రైల్' (X-Trail) SUVని అధికారికంగా ఆవిష్కరించింది. భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా ఆవిష్కరించిన ఈ కారు సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) ద్వారా మన దేశానికి రానుంది. ఎక్స్-ట్రైల్ ఆవిష్కరణ నిస్సాన్ ఇండియా యొక్క లైనప్ రెట్టింపు చేస్తోంది. కంపెనీ ఆవిష్కరించిన ఈ కొత్త SUV డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, కలర్ ఆప్షన్స్ మరియు ప్రత్యర్థుల ఏవి? అనే మరిన్ని వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం మాగ్నైట్ కాంపాక్ట్ SUVను మాత్రమే విక్రయిస్తున్న నిస్సాన్ ఇండియా.. ఇప్పుడు ఎక్స్-ట్రైల్ ఆవిష్కరించడంతో తప్పకుండా మరింత మంది వాహన ప్రియులను ఆకర్షిస్తుందని తెలుస్తోంది. కంపెనీ ఈ కారును త్వరలో లాంచ్ చేస్తుందని సమాచారం. సీఎంఎఫ్-సీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడిన ఈ కారు 2021 నుంచి గ్లోబల్ మార్కెట్లో 5 సీటర్ మరియు 7 సీటర్ రూపంలో విక్రయిస్తోంది.

Nissan X-Trail

చాలా రోజుల తరువాత కంపెనీ ఈ SUVను భారతీయ మార్కెట్ కోసం తీసుకువచ్చింది. దేశీయ మార్కెట్లో విక్రయించనున్న ఈ కారు మూడు వరుసల సీటింగ్ ఆప్షన్ పొందుతుందని తెలుస్తోంది. ఈ కొత్త కారు వర్టికల్ స్క్వేర్డ్ అవుట్ లుక్‌ పొందుతుంది. ఇది స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, డార్క్ క్రోమ్‌లో కలిపించే గ్రిల్, రౌండ్ వీల్ ఆర్చ్‌లు, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ మరియు ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టైల్ లైట్స్ పొందుతుంది.

నిస్సాన్ ఇండియా లాంచ్ చేయనున్న కొత్త ఎక్స్-ట్రైల్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి డైమండ్ బ్లాక్, షాంపైన్ సిల్వర్ మరియు సాలిడ్ వైట్ కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కారు మంచి డిజైన్ కలిగి ఈ కారు పరిమాణం పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పొడవు 4680 మిమీ, వెడల్పు 1840 మిమీ, ఎత్తు 1725 మిమీ వరకు ఉంటుంది.

Nissan X-Trail Front Design

నిస్సాన్ యొక్క కొత్త ఎక్స్-ట్రైల్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్‌ మొదలైనవి ఉంటాయి. వీటితో పాటు కీలెస్ ఎంట్రీ.. ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉంటాయి.

పైన చెప్పిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. దేశీయ మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త కారు 360 డిగ్రీ కెమెరా, ఫ్యాడిల్ షిఫ్టర్, వంటివి పొందుతుంది. 40/20/40 స్ప్లిట్ ఫోల్డింగ్, స్లైడింగ్ మరియు రిక్లైనింగ్ ఫంక్షన్‌లు మాత్రమే కాకుండా 50/50 స్ప్లిట్ ఫోల్డింగ్ మరియు రిక్లైనింగ్ ఫంక్షన్‌ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

Nissan X-Trail Rear View

దేశీయ విఫణిలో లాంచ్ కానున్న కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, ఆటో వైపర్స్, లిమిటెడ్ స్లిప్ డిఫ్, హోల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. మొత్తం మీద ఈ కారు మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది.

ఇక నిస్సాన్ ఎక్స్-ట్రైల్ యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇది 1.5లీటర్ త్రీ సిలినాద్ర టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుందని తెలుస్తోంది. ఇది 163 హార్స్ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 12వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా పొందనున్నట్లు సమాచారం. ఇది షిఫ్ట్ బై వైర్ సీవీటీ ఆటో గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ యొక్క ధరలను అధికారికంగా ప్రకటించంలేదు. అయితే ఇది రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ధరలు ఈ SUVని లాంచ్ చేసే సమయంలో వెల్లడవుతాయి. ఇది దేశీయ విఫణిలో టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, July 18, 2024, 10:21 [IST]
English summary
Nissan x trail unveiled in india design features and colours options
Read more on: #nissan #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+