షాకింగ్‌ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి.. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ కొనేవారు ఇప్పుడే ప్లాన్‌ చేసుకోండి.. లేదంటే!

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇకపై భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు సబ్సిడీ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రకటన ఎలక్ట్రిక్ వాహన సంస్థలకు షాకింగ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సాహిస్తూ కేంద్రం భారీ సబ్సిడీ అందిస్తుంది. ఈ తరుణంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు ఆయన ఈ ప్రకటన చేయడం వెనకు ఏమైన ఉద్దేశ్యం ఉందా? దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనల ఉత్పత్తిపై ఏమైనా ప్రభావం చూపెట్టనుందా? ఈ ప్రకటనతో నష్టపోయే అంశాలు ఏంటనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రోజు రోజు పెరుగుతూ వస్తున్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి, కేంద్ర ప్రభుత్వం వివిధ వివిధ రకాల సబ్సిడీలను అందిస్తున్నాయి. ఇది కంపెనీలకు, వినియోగాదరులకు అతిపెద్ద ఊరట అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు రెండు ఫేజ్‌లో FAME (Faster Adoption and Manufacturing of Electric Vehicles) గ్రాంట్స్‌ని విజయవంతంగా అందించారు.

Nitin Gadkari on Electric vehicles Subsidy

అయితే 2024-25 బడ్జెట్‌లో మూడో విడత ఫేమ్ సబ్సిడీని ప్రకటిస్తారనే ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. రెండో విడత ఫేమ్ గ్రాంట్ మార్చి నెలాఖరుతో ముగిసింది. ఆ తర్వాత EMPS (Electric Mobility Promotion Scheme) పేరుతో మధ్యంతర గ్రాంట్ ఇస్తున్నారు. ఫేమ్ గ్రాంట్ మంజూరు అయ్యే వరకు మాత్రమే ఈ గ్రాంట్ ఉంటుంది. ప్రస్తుతం ఇదొక గ్రాంట్‌ మాత్రమే లభిస్తుంది.

ఈ నేపథ్యంలో ఫేమ్ మూడో దశ సబ్సిడీని ప్రకటన త్వరలోనే వస్తుందని అంతా భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మరింత ప్రోత్సహించేందుకు ఈ సబ్సిడీని ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు సైతం అంచనా వేశారు. ఈలోపే కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సబ్సిడీపై బాంబ్‌ పేల్చారు. ఇకపై భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు అవసరం లేదని ఆయన అన్నారు.

Electric vehicles Subsidy Charging Port

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. 2030 నాటికి మొత్తం వాహన అమ్మకాలలో ఇది 30 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు అధిక డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. దీంతో కంపెనీల ఖర్చులు సైతం తగ్గినట్లు ఆయన చెప్పారు. ఒక కిలోవాట్ బ్యాటరీకి 150 డాలర్లు ఖర్చయ్యేదని, ఇప్పుడు 108 డాలర్లుగా ఉందన్నారు.

అంతే కాకుండా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ కూడా చాలా తక్కువగా ఉందని అన్నారు. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, సీఎన్‌జీ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తక్కువ అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల డీలర్లపై 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉందని వివరించారు. అదే సమయంలో ఇతర వాహనాలపై 28 శాతం వరకు జీఎస్టీ ఉందని వెల్లడించారు.

Electric vehicles Subsidy

ఫేమ్ సబ్సిడీతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్‌ని పెంచేందుకు సబ్సిడీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఒకవేళ ఫేమ్‌3 వస్తే ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ధరలు తగ్గేవి. అయితే కేంద్ర మంత్రి ప్రకటనతో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ధరలు కాస్త పెరిగే అవకాశం ఉంటుంది. సేల్స్‌ని ఆకర్షించాలంటే ఆయా కంపెనీలు సొంతంగా ఆఫర్లను ప్రకటించాల్సి ఉంటుంది. కేంద్ర మంత్రి ఒక్క ప్రకటనతో ఇప్పుడు ఎలక్ట్రిక్‌ మార్కెట్‌ అంచనాలన్నీ తారుమారు కానున్నాయి.

డ్రైవ్స్‌పార్క్‌ వ్యాఖ్య: ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న జనాలకు, ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ కార్లను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇదొక చేదు వార్త అని చెప్పవచ్చు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను నిలిపివేసిన లేదా తగ్గించినా అది నేరుగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సబ్సిడీ మరికొంత కాలం సబ్సిడీలు అవసరం. అప్పుడే ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన, విశ్వాసం ఏర్పడుతుంది.

More from DriveSpark

Article Published On: Friday, September 6, 2024, 17:13 [IST]
English summary
Nitin gadkari on electric vehicles subsidy check socking remarks by central minister
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+