తలకిందులా తపస్సు చేసినా ఈ కార్లపై ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్‌ ఇవ్వరు.. వీటికి డిమాండ్‌ చాలా ఎక్కువ మరీ!

ప్రస్తుతం పండుగ సీజన్‌ ఆటోమొబైల్ కంపెనీలు తమ సేల్స్‌ని పెంచుకునేందుకు ఇప్పటికే ఆఫర్ల మీద ఆఫర్లను ప్రకటించేశాయి. ఇంకా కొన్ని కంపెనీలు ప్రత్యేక ఆఫర్లను కొద్ది రోజుల పాటుల లేదా గంటల పాటు అందిస్తున్నాయి. దీంతో కార్లు లేదా మోటార్‌సైకిల్స్‌ కొనాలనుకునే వారు మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ప్రతీ ఏడాది దీపావళికి కార్లు ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతాయి. ఈ మార్కెట్‌ని ఒడిసి పట్టుకునేందుకు కంపెనీలు డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. ఫలితంగా సేల్స్‌ పెరిగి మంచి లాభాలు వస్తాయని కంపెనీలు ఆశలు పెట్టుకుంటాయి. వినియోగదారులు కూడా ఈ సమయంలో చాలా తక్కువ ధరకే కారును లేదా టూవీలర్‌ని కొనుగోలు చేయవచ్చు.

అయితే ఆటోమొబైల్ కంపెనీలు కార్ల డిమాండ్‌ ఆధారంగా ఆఫర్లను ప్రకటిస్తాయి. కొన్నింటిపై ఏకంగా 30 నుంచి 40 శాతం వరకు డిస్కౌంట్‌ని ప్రకటిస్తాయి. ఇంకా మార్కెట్‌లో ఏమాత్రం ప్రభావం చూపని కార్ల కోసం ఎక్స్‌ఛేంజ్‌, క్యాష్‌బ్యాక్‌, కాంప్లిమెంటరీ యాక్ససరీస్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఎక్కువ డిమాండ్‌ అలాగే భారీ వెయిటింగ్‌ పీరియడ్‌ ఉన్న కొన్ని కార్లపై మాత్రం ఎటువంటి డిస్కౌంట్లు అందిచవు.

No Discount on Cars

ఎప్పటి లాగానే ఈ ఏడాది కూడా కొన్ని కార్లపై పండుగ సీజన్‌లో ఎటువంటి ఆఫర్లను ప్రకటించలేదు. దీనికి కారణం ఈ కార్లు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందడమే. ఈ కార్ల అమ్మకాలను ప్రత్యేకంగా పెంచడానికి అవకాశం ఉండదు. అందువల్ల కంపెనీలు వీటిపై ఎటువంటి డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపవు. మార్కెట్‌ స్ట్రాటజీని బట్టి అవసరమైతే వీటి ధరలను కొన్ని కంపెనీలు రెట్టింపు కూడా చేస్తాయి.

తాజాగా జాటో డైనమిక్స్ (Jato Dynamics) అనే సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. దీనిలో భాగంగా ఒక నిర్ధిష్ట వాహనం కొరకు వెయిటింగ్ పీరియడ్ ఎంత? కంపెనీ నెలకు ఎన్ని వాహనాలను ఉత్పత్తి చేస్తుంది? దీనిని బట్టి ఆ కంపెనీ డిస్కౌంట్లను ప్రకటిస్తుందని జాటో డైనమిక్స్ స్పష్టం చేసింది. అయితే కొన్ని వెహికిల్స్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం వాటి ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటమే.

No Discount on Hyundai Creata

వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రీసెర్చ్‌ చేయగా కొన్ని మోడల్స్‌పై ఆ కంపెనీ కనీసం ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్లు ప్రకటించలేదు. ఎక్కువగా డిమాండ్‌ ఉన్న కార్లు ఇలా తయారై అలా నేరుగా మార్కెట్లోకి వెళ్తాయి. దీంతో ఈ వాహనాలన్నీ ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ధరకే కంపెనీలు సేల్‌ చేస్తుంటాయి. అంతే కాదు వీటి అమ్మకాలు కూడా క్రమంగా మార్కెట్‌లో పెరుగుతున్నాయి. మోడళ్ల వారిగా వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఈ జాబితాలో ముందుగా హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ (Hyundai Creta) ఉంది. జనవరి-ఆగస్టులో 1,25,460 యూనిట్ల అమ్మకాలతో ఈ కారు అగ్రస్థానంలో నిలిచింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ కారుపై ఒక్క రూపాయి డిస్కౌంట్ కూడా ప్రకటించలేదు. ఈ కారు కొనాలంటే 3 నుంచి 14 వారాల వెయిటింగ్‌ పీరియడ్ ఉంది. దీంతో ఈ కారు ధరను కంపెనీ తగ్గించలేదు.

Mahindra Thar Roxx

ఆ తర్వాత మహీంద్రా థార్‌ రాక్స్‌ (Mahindra Thar Roxx 5-Door) తర్వాతి స్థానంలో ఉంది. ఈ కారును ఇటీవలే కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ విడుదలైన ఆగస్టు 2024లో 830 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీని డిమాండ్‌ కారణంగా కంపెనీ ఒక్క రూపాయి డిస్కౌంట్ కూడా ప్రకటించలేదు. ఈ కారు కొనాలంటే ఆరు నుంచి పది వారాలు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.

మహీంద్రా ఎస్‌యూవీ 3ఎక్స్‌వో (Mahindra XUV 3XO) ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఈ కారు 2024 ఆగస్టు వరకు మొత్తం 42,381 కార్లు సేల్‌ అయ్యాయి. అయితే ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే మీరు 8 వారాల నుంచి సంవత్సరం వరకు వేచి ఉండాలి. ఈ కారుపై ఒక్క రూపాయి డిస్కౌంట్ కూడా ప్రకటించలేదు. పైపెచ్చు కొన్ని వేరియంట్ల ధరలను కంపెనీ పెంచింది.

Mahindra XUV 3XO Demand

మారుతి ఎర్టిగా తర్వాతి స్థానంలో ఉంది. ఈ కారు చాలా కాలంగా అమ్మకానికి అందుబాటులో ఉంది. జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 1,22,659 కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఈ కార్లపై కూడా ఒక్క రూపాయి డిస్కౌంట్ ప్రకటించలేదు. ఈ కారు కొనాలంటే 2 నుంచి 32 వారాలు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇక టయోటాకు చెందిన ఇన్నోవా హైక్రాస్ ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉంది. జనవరి-ఆగస్టులో మొత్తం 42,191 యూనిట్లను మారుతి విక్రయించింది. ఇప్పటి వరకు దీనిపై కారుపై ఒక్క రూపాయి డిస్కౌంట్ కూడా ప్రకటించలేదు. ఈ కారు కొనాలంటే 40 నుంచి 60 వారాలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 25, 2024, 15:23 [IST]
English summary
No discount on these high demanded cars even in festive season
Read more on: #auto news #cars #diwali #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+