ఇక నవంబర్ నెలను టాటా మర్చిపోదు.. ఒకటి అనుకుంటే ఇంకోటైంది..! ఆ ప్లేస్ మాత్రం పోలేదు
భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు గమ్యస్థానంగా మారుతుంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది ఈవీలను ఉపయోగిస్తున్న దేశాల్లో ఇండియా టాప్ 5 జాబితాలో ఉంటుంది. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలను తయారు చేసే కంపెనీలు తమ ఉత్పత్తిని ఈవీల వైపు క్రమంగా మళ్లిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొత్తగా కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నవారు మొదటగా ఎలక్ట్రిక్ కారుపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో డిమాండ్ కూడా సానుకూలంగా ఉండటంతో తయారీ దారులు వరుసగా ఈవీ కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో 12 కంపెనీలు ఈవీ కార్లను సేల్ చేస్తున్నాయి. వీటిలో దాదాపు అన్ని దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచిన టాప్ కంపెనీలు ఉంటాయి. ఇదిలా ఉంటే నవంబర్ నెలలో దేశంలో ఈవీ కార్ల విక్రయాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే అక్టోబర్ నెలతో పోలిస్తే మాత్రం కొంత వరకు సేల్స్ తగ్గిపోయాయి.
అయితే దీనికి ప్రధాన కారణం పండుగల సమయంలో తగ్గింపులు ఉండటం వలన చాలా మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచారు. నవంబర్‌లో మాత్రం ఎలాంటి తగ్గింపులు లేకపోవడం వలన సేల్స్ స్వల్పంగా క్షీణించాయి. 2024 నవంబర్‌లో ఇండియాలో 12 ఈవీ తయారీదారులు కలిసి దాదాపు 7,565 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించారు. ఇది గత ఏడాది (2023) నవంబర్ నెలతో పోలిస్తే 14.58 శాతం ఎక్కువ.

డేటా ప్రకారం, గత నవంబర్‌లో సేల్స్ 8,668 యూనిట్లుగా ఉన్నాయి. అంటే ఏడాది ప్రాతిపదికన తేడా 1,103 యూనిట్లు. అయితే 2024 అక్టోబర్ నెలలో జరిగిన సేల్స్‌ను చూసినట్లయితే 10,609 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. ఈ నెలలో సేల్స్ అధికంగా ఉండటానికి ప్రధాన కారణం, దేశంలో దీపావళి పండుగ ఉండటం బాగా కలిసివచ్చింది. తయారీదారులు తమ ఈవీలపై అధిక తగ్గింపులు, ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇవ్వడం వలన సేల్స్ పుంజుకున్నాయి.
నవంబర్ నెలలో జరిగిన ఈవీ సేల్స్‌లో అధిక వాటా దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్‌దే ఉంది. టాటా ఈవీ కార్లను ఎక్కువ మంది జనాలు ఆదరించడంతో మిగతా కంపెనీల కంటే కూడా ఇది సేల్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్‌లో టాటా 4,224 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. అయితే ఇది గత ఏడాది ఇదే నెలలో 5,133 ఈవీ కార్లను సేల్ చేసింది. ఏడాది ప్రాతిపదికన ఈ సారి ఆదరణ తగ్గింది.

అదే 2024 అక్టోబర్‌లో టాటా ఈవీ కార్లను 6,152 మంది కొనుగోలు చేశారు. దీని తరువాత మరో ఈవీ తయారుదారు ఎంజీ మోటార్స్ నవంబర్ సేల్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీకి చెందిన 3,163 ఈవీ కార్లు అమ్ముడుపోయాయి. అదే గత ఏడాది నవంబర్‌లో 956 యూనిట్ల సేల్స్ జరిగాయి. 2024 అక్టోబర్‌లో చూసినట్లయితే ఎంజీ 2,530 ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేసింది.
వీటి తర్వాత మూడో స్థానంలో మహీంద్రా కంపెనీ ఉంది. నవంబర్‌లో 552 ఈవీ కార్లను విక్రయించింది. అంతకుముందు అక్టోబర్‌లో 907 యూనిట్ల సేల్ జరిగింది. గత ఏడాది నవంబర్‌లో ఇదే రేంజ్ అమ్మకాలు నమోదు అయ్యాయి. తర్వాత నాలుగో స్థానంలో చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ BYD ఉంది. ఐదో స్థానంలో 98 ఈవీ కార్లతో మెర్సిడెస్ బెంజ్, 94 కార్లతో BMW కంపెనీలు ఉన్నాయి.

వీటి తరువాత నవంబర్‌లో ఎక్కువ ఈవీ కార్ల విక్రయాలను సాధించిన జాబితాలో సిట్రోయెన్ (82), తరువాత కియా (68), వోల్వో (32), హ్యుందాయ్ (21) వరుసగా ఉన్నాయి. మొత్తంగా ఈ గణంకాలను చూసినట్లయితే ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో ఈవీ కార్లకు మంచి డిమాండ్ ఉందని అర్థం అవుతుంది.


Click it and Unblock the Notifications








