మార్కెట్‌లోకి 'ఏసీ ఆటో' వచ్చేస్తుంది.. కారుకి తక్కువ ఆటోకి ఎక్కువ.. విడుదలకు సిద్ధం!

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ టూ-వీలర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. బెంగళూరుకు చెందిన ఈ ఓలా ఎలక్ట్రిక్ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలన సంస్థ భారీ ఫీచర్లతో వివిధ రకాల స్కూటర్లను ఉత్పత్తి చేయడంలే పేరుగాంచింది. కొద్ది రోజుల క్రితమే ఈ కంపెనీ ఎలక్ట్రిక్‌ బైక్‌ (Ola Electric Bike)ని విడుదల చేసింది. ఈ కంపెనీ ఓలా 'ఎస్1' సిరీస్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ కంపనీ నుంచి మరో తీపి కబురు రాబోతుంది. ఈ కంపెనీ త్వరలోనే ఎలక్ట్రిక్‌ త్రీవీలర్‌ని తీసుకురానుంది. దీంతో త్రీవీలర్‌ ప్రొడక్షన్‌లోకి ఈ సంస్థ అడుగుపెట్టనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ విడుదలపై ఎటువంటి లీక్స్‌ కానీ, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కానీ వెల్లడించలేదు. అయితే ఓలా నుంచి త్వరలో రాబోయే ఎలక్ట్రిక్ ఆటోని బెంగళూరులో టెస్ట్‌ డ్రైవ్‌ లేదా ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుండంగా కనిపించింది. ఆ ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, ఆకర్షణీయమైన DRLs, సింగిల్ బ్లేడ్ విండ్‌షీల్డ్‌ వైపర్‌లని కలిగి ఉంది.

Ola Electric Three-Wheeler Launch

ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షాకు ఓలా రాహి 'Raahi Electric Auto' అని పేరు పెట్టనున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి దీనిని ఈ పేరుతో పిలుస్తున్నారు. అయితే 2023లోనే ప్యాసింజర్, కార్గో ఎలక్ట్రిక్ ఆటోరిక్షాల డిజైన్‌కి ఓలా ఎలక్ట్రిక్‌ పేటెంట్ పొందింది. తాజాగా దీనికి సంబంధించిన ట్రయల్‌ రన్‌ని కూడా నిర్వహిస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ ఎలక్ట్రిక్‌ ఆటో మార్కెట్‌లోకి వస్తుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటోరిక్షా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్‌తో రానుంది. ఎందుకంటే లగేజీ, ఇతర కమర్షియల్‌ సమయాల్లో ఇది టైమ్‌ని సేవ్‌ చేస్తుందని అంటున్నారు. ఇక దీని ఫర్ఫామెన్స్‌ ఫీచర్ల గురించి ఓలా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం తమిళనాడులోని కంపెనీ ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా ఉత్పత్తి శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఉత్పత్తులు సైతం మార్కెట్‌లో విడుదలకు దాదాపు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Ola Electric Three-Wheeler Launch

ఈ లెక్కన ఇది ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో పూర్తి స్థాయిలో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. అయితే దీని ధరను ఎవరూ ఊహించని విధంగా చాలా తక్కువ ధరలో తీసుకువస్తారని తెలుస్తుంది. అయితే ఇందులో ఎయిర్‌ కండీషనింగ్‌ కూడా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువ సరుకులు క్యారీ చేసేలా.. ప్యాసింజర్లు కంఫర్ట్‌గా కూర్చునేలా భారీ స్పేస్‌ని అందించనున్నారు.

ఈ ఆటోని పరిచయం చేయడంతో ఎలక్ట్రిక్ ఆటోల విభాగంలో ఓలా సరికొత్త విప్లవానికి తెర తీయనుంది. ఇప్పటి వరకు ఆటోల్లో లేని స్మార్ట్‌ ఫీచర్లను సైతం ఇందులో అందించనున్నారు. తమిళనాడుకి చెందిన మహీంద్రా మరియు మోత్ర (Mahindra and Mothra) సంయక్తంగా విక్రయిస్తున్న ఎలక్ట్రిక్‌ ఆటోలు మార్కెట్‌లో టాప్‌లో కొనసాగుతున్నాయి. వీటికి ఓలా ఆటోలు గట్టి పోటీని ఇవ్వనుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, September 8, 2024, 7:20 [IST]
English summary
Ola electric three wheeler launching soon in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+