ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో OSM Stream City Qik ఎలక్ట్రిక్ ఆటో లాంచ్.. 126 కి.మీ రేంజ్
ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా ఉన్న ఒమేగా సీకి మొబిలిటీ(Omega Seiki Mobility) సరికొత్త ఆటోను లాంచ్ చేసింది. ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ(Exponent Energy)తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఒమేగా సీకి మొబిలిటీ.. కేవలం 15-నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తయ్యే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను తీసుకువచ్చింది. ధర, బ్యాటరీ, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో OSM స్ట్రీమ్ సిటీ క్విక్(OSM Stream City Qik)ను సంస్థ రూ. 3,24,999 (ఎక్స్-షోరూమ్) ధరతో సంస్థ లాంచ్ చేసింది. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ వాహనం దాని విశేషమైన ఛార్జింగ్ సామర్ధ్యంతో కొత్త స్టాండర్డ్స్‌ను సెట్ చేస్తుందని సంస్థ తెలిపింది. ఎక్స్‌పోనెంట్ యొక్క వేగవంతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ చేస్తుంది.

OSM Stream City Qik ఎలక్ట్రిక్ ఆటోను సంస్థ 2,00,000 కిమీ లేదా 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఇంకా మెరుగైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా అందిస్తుంది. దీని ద్వారా ఈ ఆటోను కొనుగోలు చేసేందుకు కస్టమర్లకు ఇంకా సులభతరం చేస్తుంది.
కాగా ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ 2024లో ఢిల్లీ-NCR మరియు బెంగళూరులో 100 ఛార్జింగ్ స్టేషన్‌లను అమలు చేయనుంది. ఇంకా చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతా మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ తన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అమలు చేయనుంది. OSM Stream City Qik ఎలక్ట్రిక్ ఆటో ద్వారా డ్రైవర్ల సంపాదన మరింత మెరుగవుతుందని సంస్థ చెబుతోంది.

దీని ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ద్వారా రైడింగ్‌లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులకు, డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సంస్థ వెల్లడిస్తోంది. అంతే కాకుండా OSM Stream City Qik ఎలక్ట్రిక్ ఆటోలోని అధునాతన ఫీచర్ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ట్రిప్‌లను పూర్తి చేయవచ్చని పేర్కొంది. దీని ద్వారా డ్రైవర్ల నెలవారీ ఆదాయం కూడా కనీసం 30 శాతం పెరుగుతుంది.
OSM Stream City Qik ఎలక్ట్రిక్ ఆటో లాంచ్‌పై Omega Seiki మొబిలిటీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఉదయ్ నారంగ్ మాట్లాడారు. OSM స్ట్రీమ్ సిటీ క్విక్ కేవలం ఒక వాహనం కాదని.. డ్రైవర్లకు ఆర్థిక పరంగా భరోసానిస్తుందని చెప్పారు. ఎక్స్‌పోనెంట్‌తో నడిచే 15 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యంతో, డ్రైవర్లకు డీజిల్ సమస్యలు ఉండవన్నారు.

డౌన్‌టైమ్‌ను తగ్గించడంతో పాటు మెరుగైన పనీతీరు ద్వారా.. డ్రైవర్లకు ఆర్థిక లాభాలు మరింత మెరుగుపడతాయని ఉదయ్ అన్నారు. ఇక OSM Stream City Qik ఎలక్ట్రిక్ ఆటోలో ఎక్స్‌పోనెంట్ ద్వారా ఆధారితమైన అత్యాధునిక 8.8 kWh యాజమాన్య బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. పూర్తి ఛార్జ్‌పై 126 కిలోమీటర్ల ARAI సర్టిఫైడ్ రేంజ్‌ను ఇస్తుందని చెబుతున్నారు.
15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్, సుదీర్ఘ బ్యాటరీ వారంటీ, మెరుగైన ఫైనాన్సింగ్ సౌకర్యాతో OSM Stream City Qik ఎలక్ట్రిక్ ఆటో అందుబాటులో ఉంటుందని ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు & CEO అరుణ్ వినాయక్ అన్నారు. ఇంకా కస్టమర్లకు నెలవారీ EMIలను తగ్గిస్తుందని చెప్పారు. ఒమేగా సీకి మొబిలిటీతో 3W ప్యాసింజర్ విభాగంలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications








