కొత్త కార్లు వద్దు బాబోయ్ అంటున్న జనాలు.. పైసలు తర్వాత ముందు షోరూమ్ వరకు రండి అంటున్న కంపెనీలు!
దేశంలో విక్రయించే మొత్తం వాహనాల సంఖ్యను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) పూర్తి డేటాను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ప్రతీ నెలా దేశంలో విక్రయించబడే అన్ని వెహికిల్స్‌కి సంబంధించిన సేల్స్ రిపోర్ట్ ఈ అసోసిషియేన్ వద్ద లభిస్తుంది. తాజాగా సెప్టెంబర్ 2024కి సంబంధించిన డేటా ప్రకారం భారతదేశంలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు భారీగా తగ్గాయి. ఇది పూర్తి ఆటోరంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తం అమ్మకాల్లో ప్యాసింజర్ వెహికిల్స్ చాలా కీలకంగా ఉంటాయి. కావున వీటి సేల్స్ గణనీయంగా తగ్గడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. అయితే ప్రస్తుతం పండుగ సీజన్ ఉండటంతో సేల్స్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
2024 సెప్టెంబర్‌లో ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ 19 శాతం క్షీణించాయి. కార్లు, మినీ వ్యాన్లు మాత్రమే ప్యాసింజర్ వాహనాల కిందకు వస్తాయి. వీటిని ప్రజలు తమ సొంత అవసరాల కోసం కొనుగోలు చేస్తుంటారు. అందువల్ల ఇతర వాహనాలతో పోల్చితే వీటి సేల్స్ ఎక్కువగా ఉంటాయి. బస్సులు, భారీ వ్యాన్లు, ఇతర కమర్షియల్ వెహికిల్స్ ఈ జాబితాలోకి రావు.

ఇక చిన్న వ్యాన్ల విషయానికొస్తే మారుతి సుజుకి ఈకో (Maruti Eeco) మినీ వ్యాన్‌ని ఎక్కువగా విక్రయిస్తుంది. కాకపోతే మరే కంపెనీ కూడా ఇలాంటి వ్యాన్లను పెద్దగా విక్రయించదు. ఈ సేల్స్ రిపోర్ట్‌లో కేవలం రిటైల్‌గా విక్రయించిన కార్ల సంఖ్యను మాత్రమే ఫాడా వెల్లడిస్తుంది. ఇతర కార్పొరేట్ లేదా ప్రభుత్వాలు ఇతర అవసరాల కోసం బల్క్‌గా ఆర్డర్ చేసే సంఖ్యను ఫాడా పరిగణనలోకి తీసుకోదు.
2024 సెప్టెంబర్‌లో భారత్‌లో మొత్తం 2,75,681 ప్యాసింజర్ వెహికిల్స్ సేల్ అయ్యాయి. 2023 ఇదే సెప్టెంబర్‌లో 3,39,543 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే 18.81% సేల్స్ తగ్గాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్ కంటే ఈ ఏడాది 63,862 కార్లు తక్కువగా అమ్ముడయ్యాయి.

అయితే మారుతి సుజుకి ఎప్పటి లాగానే సెప్టెంబర్ 2024 లో భారతదేశంలో నంబర్ వన్ ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకందారుగా నిలిచింది. మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,13,560 కార్లను విక్రయించింది. మారుతి సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్స్ ఇండియా రెండో స్థానంలో ఉంది. గత నెలలో హ్యుందాయ్ మొత్తం 37,973 కార్లను విక్రయించింది.
ఇదే హ్యుందాయ్ సంస్థ 2023 సెప్టెంబర్‌లో నాటికి ఈ సంఖ్య 50,633 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది అమ్మకాలతో పోల్చితే ఈ సంవత్సరం హ్యుందాయ్ సేల్స్ 25 శాతం క్షీణించాయి. ఆ తర్వాత జాబితాలోని మహీంద్రా 34,607 ప్యాసింజర్ వాహనాలతో అదరగొట్టింది. మహీంద్రా 2023 సెప్టెంబర్ కంటే 136 యూనిట్లను ఎక్కువగా విక్రయించింది. ఈ సంస్థ సేల్స్ 0.39 శాతం పెరిగాయి.

ఆ తర్వాత టాటా మోటార్స్ 31,947 ప్యాసింజర్ వాహనాల అమ్మకాలతో నాలుగో స్థానంలో ఉంది. టాటా మోటార్స్ ఈ సారి మూడవ స్థానానికి పడిపోయింది. అయితే ఈసారి టాటాను మహీంద్రా అధిగమించి ఆశ్యర్యానికి గురిచేసింది. ఆ తర్వాత టయోటా, కియా వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయి. సెప్టెంబర్‌లో వీటి అమ్మకాలు వరుసగా 19,660, 15,521గా ఉన్నాయి.
ఇక స్కోడా ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఈ సంస్థ గత నెలలో 5,192 కార్లను విక్రయించింది. ఆ తర్వాత హోండా 3,893 ప్యాసింజర్ వాహనాల అమ్మకాలతో 8వ స్థానంలో ఉంది. ఎంజీ మోటార్ (2,966), రెనాల్ట్ (2,706) వరుసగా 9, 10 స్థానాల్లో నిలిచాయి. వీటి సేల్స్ అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications








