భారత్‌లో పోర్స్చే కొత్త ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ - ధర, వివరాలు

ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. వాహన వినియోగదారులు కొత్త కార్లను ఉపయోగించాలనే ఆసక్తి.. వారిని ఆధునిక వాహనాలను కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయ కంపెనీలు, అన్యదేశ్య కంపెనీలు వాహనాలను లాంచ్ చేస్తూ.. తమ ఉనికిని చాటుకోవడమే కాకుండా, కస్టమర్లకు చేరువవుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ పోర్స్చే భారతీయ విఫణిలో మకాన్ ఈవీ యొక్క రెండు కొత్త వేరియంట్స్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ వేరియంట్స్ గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం..

పోర్స్చే కంపెనీ లాంచ్ చేసిన మకాన్ ఈవీ రెండు కొత్త వేరియంట్లలో ఒకటి రియర్ వీల్ డ్రైవ్ మకాన్ ఈవీ (రూ. 1.23 కోట్లు), మరొకటి మకాన్ ఈవీ 4ఎస్ వేరియంట్ (రూ. 1.39 కోట్లు). కాగా కంపెనీ తన మకాన్ ఈవీ టర్బో ధరలను రూ. 1.65 కోట్ల నుంచి రూ. 1.69 కోట్లకు పెంచింది. అంటే పోర్స్చే మకాన్ ఈవీ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది.

Porsche Macan 4S EV

పోర్స్చే మకాన్ ఎంట్రీ లెవెల్ వేరియంట్.. సింగిల్ రియర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఈ మోటారు 360 హార్స్ పవర్ మరియు 563 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 220 కిమీ. కాబట్టి ఇది మంచి రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

ఇక పోర్స్చే మిడ్ లెవెల్ మకాన్ 4ఎస్ ఈవీ విషయానికి వస్తే.. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటార్లను పొందుతుంది. ఇది 516 హార్స్ పవర్ మరియు 280 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు కేవలం 4.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 240 కిమీ.

Porsche Macan 4S EV Front

పోర్స్చే కారు కొత్త స్లేట్ గ్రే నియో అనే కలర్ ఆప్షన్ పొందటమే కాకుండా.. ఆప్షనల్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ కూడా పొందుతుంది. ఇప్పుడు ఈ కారు కోసం కంపెనీ ఆఫ్ రోడ్ డిజైన్ ప్యాకేజీని కూడా అందిస్తుంది. ఇవన్నీ కారును మరింత ఆకర్షణీయంగా చేయడమే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్‌ను 10 మిమీ వరకు పెంచుతుంది. తద్వారా వాహన వినియోగదారుడు మంచి ఆఫ్ రోడింగ్ అనుభూతిని పొందవచ్చు.

పోర్స్చే మకాన్ ఇవే యొక్క అన్ని వేరియంట్లు 100 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతాయి. టాప్ వేరియంట్ మకాన్ టర్బో ఈవీ ఒక ఫుల్ చార్జితో 591 కిమీ, మకాన్ 4ఎస్ ఈవీ 606 కిమీ మరియు ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఒక చార్జితో 641 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇవి 270 కేడబ్ల్యు డీసీ ఛార్జింగ్‌ని ఎనేబుల్ చేసే 800వీ ఛార్జింగ్ ఆర్కిటెక్చర్‌ను పొందుతుంది.

Porsche Macan 4S EV Rear Profile

మకాన్ ఈవీ వేరియంట్ ఫాస్ట్ చార్జర్ ద్వారా బ్యాటరీని 21 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయగలదు. మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ మార్కెట్లో ఆడి క్యూ8, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ మరియు బీఎండబ్ల్యూ ఐఎక్స్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ ఈ ఈవీల కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది, డెలివరీలు ఈ ఏడాది చివరలో ప్రారంభమవుతాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 18, 2024, 12:30 [IST]
English summary
Porsche macan ev new variants launched in india price and range
Read more on: #porsche #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+