కార్ల కంపెనీల ట్రాప్‌లో పడకండి.. వాళ్ల మాటలు వింటే అరగుండు ఖాయం, అవసరం లేని ఫీచర్లతో మీకే పైసలు బొక్క!
ఎవరైనా కారు కొనేముందు దాని ధర, ఫీచర్లు, మైలేజీ, సేఫ్టీపై ఆరా తీస్తారు. ఇంకొందరు ఇంజిన్ ఆప్షన్స్, ఫర్ఫామన్స్, డిజైన్‌ని బట్టి కార్లను ఎంచుకుంటారు. కానీ వాస్తవ ధరకు వెళ్లే సరికి జేబులకు చిల్లులు పడతాయి. కార్ల కంపెనీలు ఏదైనా ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకువచ్చేటప్పుడు వివిధ వేరియంట్లలో అదనపు ఫీచర్లు జోడించి వాహనాలను విక్రయిస్తాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను బట్టి వేరియంట్లను ఎంచుకోవచ్చు. నేడు మార్కెట్‌లో విడుదలవుతున్న కార్లలోని అనవసర ఫీచర్ల కోసం మీరు అధిక డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కావున మీ అవసరాలకు తగినట్లుగా వేరియంట్లను ఎంచుకోవడం ఉత్తమం. మీరు కారును కొనుగోలు చేసేటప్పుడు ఈ ఫీచర్లు మీకు అవసరమా లేదా అని క్లారిటీ తెచ్చుకోవాలి. తద్వారా మీ డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ మధ్య చిన్న కార్లలోనూ డ్యాష్‌బోర్డుపై భారీ స్క్రీన్లు అందిస్తున్నారు. బటన్స్ స్థానంలో వచ్చే బిగ్ 'టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్' కారు ఇంటీరియర్‌ని అధునాతనంగా మారుస్తుంది. అయితే ఈ బిగ్ స్క్రీన్లు డ్రైవర్ల దృష్టిని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇది వినియోగదారులకు అనవసర ఆప్షన్‌గా ఉంటుంది. ఇందులోని మ్యూజిక్, వెదర్, నావిగేషన్ నుంచి ఎయిర్‌వెంట్ పొజిషనింగ్ వరకు ప్రతిదీ టచ్-సెన్సిటివ్‌తో వస్తాయి. ఇది మీకు అదనపు ఖర్చు అవుతుంది.

సన్‌రూఫ్ ఇటీవలి కాలంలో భారతదేశంలో కస్టమర్లు అత్యంత ఆసక్తిగా ఇష్టపడుతున్న ఫీచర్లలో ఇదొకటిగా ఉంది. అయితే ఇది కొన్ని సందర్భాల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. భారత్ వంటి ఉపరితల రోడ్లపై సన్‌రూఫ్ తెరచి ప్రయాణం చేయడం ఇబ్బందులకు గురిచేస్తుంది. గతంలో కేవలం హైఎండ్ కార్లలో మాత్రమే ఈ ఫీచర్‌ని అందిచేవారు కానీ ఇప్పుడు బడ్జెట్ కార్లలోని మిడ్-స్పెక్ వేరియంట్లలో దీనిని అందిస్తున్నారు.
ఇది చూడటానికి అందంగా కనిపిస్తుంది. అలాగే పిల్లలు సన్‌రూఫ్ నుంచి తలలు పైకెత్తి ప్రయాణం చేయడం మంచి అనుభూతిని అందిస్తుంది. కారు క్యాబిన్‌లోకి ఇది స్వచ్ఛమైన గాలిని సైతం అందిస్తుంది. కానీ మన దగ్గరం చాలామంది రన్నింగ్ కార్లలో సన్‌రూఫ్ వెలుపల తలలు పట్టుకుని ప్రయాణించడానికి పిల్లలకు అనుమతిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. కొన్నింటిలో సన్‌రూఫ్ నుంచి వాటర్ లీకైన సంఘటనలు కూడా కనిపించాయి. కావున ఇది కూడా అనవసరం.

ఇక చివరిది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టన్స్ సిస్టమ్ (ADAS). ఇది కారు సేఫ్టీని మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న అన్ని కార్లలోనూ ఈ సిస్టమ్‌ని అందిస్తున్నారు. ముఖ్యంగా డ్రైవర్‌కి సపోర్ట్ చేయడానికి ఆటోమేటెడ్ బ్రేకింగ్, కొలిషన్ వంటి ఫీచర్లను అందించడానికి కెమెరాలు, సెన్సార్లను ఇందులో ఉపయోగిస్తారు. ఇవి అత్యవసర సమయాల్లో ప్రమాదం నుంచి కాపాడతాయి. అయితే దీని పనితీరు భారతీయ రోడ్లపై అంతగా లేదనే భావన ప్రజల్లో నాటుకుపోయింది.
ఈ సిస్టమ్ హై సాఫ్ట్‌నెస్, సెకన్లలో ప్రతిస్పందిస్తుండటం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలను కొని తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. ఇది కూడా ఓ విధంగా అనవసర ఫీచర్‌గా కస్టమర్లు పరిగణించాలి. కావున పైన చెప్పిన విధంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్, సన్‌రూఫ్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వల్ల మీ జేబులకు చిల్లుపడే అవకాశం ఉంటుంది. కావున మీ అవసరాలకు తగినట్లుగా వేరియంట్లను ఎంచుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








