రాహుల్ గాంధీకి సొంత కారు కూడా లేదు.. కానీ బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈ సారి ఉత్కంఠ రేపాయి. మరోసారి బీజేపీ ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఇండి కూటమి అధికార బీజేపీకి ఝలక్ ఇచ్చింది. 'అబ్ కీ బార్‌ 400 పార్' నినాదంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ కూటమి 300 సీట్లలోపే పరిమితం అయ్యింది. ఇండి కూటమికి ప్రజలు ఎక్కువ సీట్లు ఇవ్వడంతో కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేత అయిన ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ పొలిటికల్‌ స్టార్‌ కార్లు, బైకులకు సంబంధించి కీలక విషయాలు మీకోసం..

2024 లోక్ సభ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ తన ఆస్తుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫడవిట్‌లో సొంత కారు లేదని ప్రకటించారు. దీంతో అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ వార్త పెద్ద దుమారమే రేపింది. తనకు రూ.20 కోట్ల ఆస్తులున్నాయని, కానీ తనకు సొంత కారు లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్ష నేతలు తమదైన శైలిలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.

Rahul-Gandhi-Cars-Collection

దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీలో అత్యంత కీలక నాయకుడికి కారు కూడా లేదంటే నమ్మశక్యంగా లేదని వారు విమర్శించారు. అయితే దీనిని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సైతం తిప్పికొట్టారు. 2014 ఎన్నికల ప్రచారంలో తనకు కార్లపై మక్కువ లేదని రాహుల్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని వారు విడుదల చేశారు. ఇలా ఆరోపణలు ప్రత్యారోపణలతో కొన్ని రోజులు రాజకీయం రాహుల్‌ గాంధీ అఫడవిట్‌ చుట్టూ తిరిగాయి.

ఇక అసలు విషయానికి వస్తే రాహుల్‌కి కార్లు అంతగా ఇష్టం లేకపోయినా బైక్ నడపడం తన ఫేవరెట్ హాబీ అని రాహుల్ గాంధీ అదే ఇంటర్వ్యూలో చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ ఏక్తా యాత్ర సందర్భంగా ఆయన కేటీఎం 390 అడ్వెంచర్ బైక్‌పై కొందరు బైక్ రైడర్లతో కలిసి లడఖ్ లోని ప్రసిద్ధ పాంగాంగ్ సరస్సుకు వరకు రైడ్‌ చేశారు.

Rahul-Gandhi-Cars-Collection

అప్పట్లో ఆ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. అయితే ఆ తర్వాత భద్రతా కారణాల రీత్యా తాను కేటీఎం బైక్‌ని నడపే అవకాశం రాలేదని.. అది తన గ్యారేజీలోని ఒక మూలన విశ్రాంతి తీసుకుంటోందని రాహుల్ గాంధీ ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గంతంలోనూ ఆయన కారు మెకానిక్ షాప్‌కి వెళ్లకుండా ఢిల్లీలోని ఓ బైక్ మెకానిక్ షాప్‌కి వెళ్లాడు.

అక్కడ పనిచేసే మెకానిక్‌లతో మాట్లాడిన రాహుల్ గాంధీ ఆ తర్వాత వారితో కలిసి రిపేర్ కోసం పార్క్ చేసిన బైకులకు మరమ్మతులు చేశారు. ఇక రాహుల్ గాంధీకి లేటెస్ట్‌ ఫోర్ స్ట్రోక్ బైక్‌ల కంటే పాతకాలపు టూ స్ట్రోక్ బైక్ లంటే చాలా ఇష్టం. యమహా ఆర్డీ 350 తన ఫేవరెట్ బైక్ అని రాహుల్ గాంధీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Rahul-Gandhi-Tata-Safari

రాహుల్ గాంధీ తనకు కార్లు అంటే ఇష్టం లేదని చెప్పినప్పటికీ భద్రతా కారణాల రీత్యా ఆయన తన ప్రధాన రవాణా సాధనంగా కార్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీని వైట్ కలర్ ల్యాండ్ క్రూయిజర్ కారులో చాలా సార్లు దర్శనమిచ్చారు. ఇది కాకుండా లెక్సస్ XL లగ్జరీ ఎస్‌యూవీలో కూడా రాహుల్ గాంధీ కనిపించారు.

రాహుల్‌ గాంధీకి ఇష్టమైన కారు టాటా సఫారీ. రాహుల్ గాంధీ రాజకీయ ఎంట్రీ ఇచ్చిన రోజుల్లో బ్లాక్‌ టాటా సఫారీలో ప్రయాణిస్తున్న వీడియోలు ఉన్నాయి. గాంధీ కుటుంబం టాటా సఫారీ కార్లను బుల్లెట్ ప్రూఫ్ కార్లుగా ఉపయోగించింది. ఇంత ధనిక కుటుంబంలో నివసిస్తున్న రాహుల్ గాంధీకి పదేళ్లు గడిచినా సొంత కారు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 6, 2024, 14:27 [IST]
English summary
Rahul gandhi cars and bikes collection top congress leader like bike riding more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+