Range Rover Evoque లగ్జరీ కారు విడుదల.. ఆకట్టుకొనే డిజైన్‌ సహా కీలక ఫీచర్లు..!

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ భారత్‌ మార్కెట్‌లో రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ SUV 2024 కారును లాంచ్‌ చేసింది. ఈ కారు ధర రూ.67.90 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. Range Rover Evoque 2024 లగ్జరీ కారు డైనమిక్‌ SE వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కారు గత సంవత్సరం జూన్‌లో లాంచ్‌ చేశారు.

భారత్‌ మార్కెట్‌లో అప్‌గ్రేడ్‌ చేయబడిన ఈ రేంజ్‌ రోవర్‌ పెట్రోల్‌ మరియు డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలోనే అందుబాటులో ఉంటుంది. అయితే ఎక్స్టీరియర్‌లో భారీ మార్పులు చేయలేదు. రీడిజైన్‌ చేయబడిన గ్రిల్‌, రీడిజైన్‌ చేయబడిన LED రన్నింగ్‌ ల్యాంప్‌ దీంతోపాటు సూపర్‌ స్లిమ్‌ LED హెడ్‌ల్యాంప్, ట్విన్ 10 స్పోక్‌ డిజైన్‌తో కూడిన అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. కొరింథియన్‌ బ్రాంజ్‌ మరియు ట్రిబెకా బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

Range Rover Evoque SUV price

రేంజ్ రోవర్‌ ఎవోక్‌ ఇంటీరియర్‌ మార్పులు : రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ క్యాబిన్‌లో స్పష్టమైన మార్పులు చేశారు. ల్యాండ్‌ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్‌లో ఉన్న మాదిరిగా రీడిజైన్‌ చేయబడిన సెంటర్‌ కన్సోల్‌లో 11.4 అంగుళాల Pivi Pro టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.

రేంజ్ రోవర్‌ ఎవోక్‌ ఫీచర్లు : ఈ సిస్టమ్‌ ఆపిల్‌ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో ఇంటిగ్రేడ్ అవుతుంది. దీంతోపాటు 3D కెమెరా, ఎయిర్‌ ఫ్యూరిఫికేషన్‌ సిస్టమ్‌ మరియు పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి అదనపు ఫీచర్లతో కూడిన అత్యాధునిక క్యాబిన్‌ను కలిగి ఉంటుంది. ఇది డ్రైవింగ్‌ అనుభూతిని మరింత మెరుగుపరుస్తుంది.

Range Rover new SUV launched in india

డ్యూయల్‌ జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌, OTA సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లు, కొత్త PM2.5 ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌, దీంతోపాటు మెరుగైన భద్రత కోసం క్లియర్‌ సైట్‌ గ్రౌండ్ వ్యూ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. రెండు వైపులా బహుళ ఫంక్షనల్ స్లైడింగ్‌ కంట్రోల్‌ మరియు వర్చువల్‌ బటన్‌లను కలిగి ఉంటుంది.

రేంజ్ రోవర్‌ ఎవోక్‌ ఇంజిన్‌ : రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ లగ్జరీ SUV 2.0 లీటర్‌ 4 సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 247bhp శక్తి, 365Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే 2.0 లీటర్‌ 4 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 201 bhp శక్తి మరియు 430Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్లు 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడతాయి.

Range Rover Evoque launched in india specs and features

ఈ రెండు ఇంజిన్‌లు బెల్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టార్టర్‌ జనరేటర్‌తో 48V మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ను పొందుతాయి. ఈ రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ను కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్‌లో రేంజ్‌ రోవర్‌ ఎవోక్‌ BMW X3, Audi Q5, Mercedes Benz GLC వంటి కార్లతో పోటీపడనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 30, 2024, 16:46 [IST]
English summary
Range rover evoque launched in india with key specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+