మంచి సర్వీస్‌తో కస్టమర్ల మనసు దోచేస్తున్న కారు ఇదే.. అందుకే సేల్స్‌లో నంబర్ 1
హ్యుందాయ్ క్రెటా కారుకి దేశంలో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం త్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఇది ఒకటిగా ఉంది. వివిధ అప్‌డేట్లతో కారు సంస్థ హ్యుందాయ్‌ని సరికొత్తగా కస్టమర్లకు అందుబాటులోకి తెస్తుంది. దీంతో క్రెటాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్స్‌తో విడుదల చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. మంచి రైడింగ్ అనుభవంతో పాటు మంచి లుక్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మార్కెట్ డిమాండ్‌కి తగినట్లుగా కొత్త టెక్నాలజీలను జోడించడం ఈ కారు సేల్స్ టాప్‌లో కొనసాగేందుకు ఉపకరిస్తున్నాయి. ఈ కారు టాప్‌లో నిలువడానికి గల ముఖ్య కారణాలు మీ కోసం..
టాప్ ఫీచర్లు: క్రెటాలో ఎప్పటికప్పుడు పూర్తి అప్‌డేటెడ్ ఫీచర్లతో గమనించవచ్చు. ముఖ్యంగా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ, రియర్ వ్యూ కెమెరా ఉన్నాయి. ఈ ఫీచర్లు మంచి డ్రైవింగ్ కల్పిస్తాయి. వేరియంట్‌లకు తగినట్లుగా ఈ కారులోని ఫీచర్లు కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటాయి. అందుకే ఈ కారు ఫీచర్ల చూసి కూడా జనాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు.

సేఫ్టీ ఫీచర్లు: హ్యుందాయ్ అన్ని ఉత్పత్తులలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో ప్రయాణికుల భద్రత కోసం మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ABS (Anti-Long Braking System), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్లు ప్రయాణీకులందరి హై స్టాండర్డ్ సేఫ్టీని అందిస్తాయి. సేఫ్టీలోనూ ఇది టాప్‌లో కొనసాగడానికి ఆ కారు అందించే సేఫ్టీ ఫీచర్లు కీలకమని చెప్పవచ్చు.
రోడ్ సైడ్ అసిస్టెన్స్: క్రెటా తమ కస్టమర్ల కోసం రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ని అందిస్తుంది. ఈ సేవ 24/7 అందుబాటులో ఉంటుంది. వాహనం బ్రేక్ డౌన్, టైర్ పంక్చర్ లేదా మరేదైనా సమస్య తలెత్తితే వెంటనే సేవలు అందిస్తుంది. వాహన మరమ్మతులకు మాత్రమే కాకుండా ఇంధనం పూర్తయిన సందర్భాల్లోనూ ఈ సేవను కస్టమర్లు వినియోగించుకోవచ్చు.

కాంప్రహెన్సివ్ వారంటీ: హ్యుందాయ్ క్రెటా 3 ఏళ్ల/ అపరిమిత కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. ఈ హామీతో కస్టమర్ సంతృప్తి కోసం ఆ సంస్థకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ వారంటీ ప్లాన్ క్రెటా యజమానులకు మరింత ధైర్యాన్ని అందించనుంది. కస్టమర్ హ్యాపినెస్ ఫస్ట్ ప్రయారిటీగా సంస్థ ఈ వారంటీని అందిస్తుంది. అంతే కాకుండా ఈ సంస్థ దేశవ్యాప్తంగా 1,300 కంటే ఎక్కువ సర్వీస్ టచ్ పాయింట్లను ఏర్పాటు చేసింది.
సర్వీస్ ప్యాకేజీలు: హ్యుందాయ్ క్రెటాను అనేక ప్రత్యేక సర్వీస్ ప్యాకేజీలతో అందిస్తుంది. ఈ ప్యాకేజీలలో కారు నిర్వహణ మరియు ఇంజిన్ ఆయిల్ మార్పులు, ఫిల్టర్ మార్పులు మరియు జనరల్ సర్వీస్ ఆఫర్‌లు ఉన్నాయి. వాహనాన్ని సరైన కండీషన్‌లో ఉంచే ఉద్దేశ్యంతో ఈ సర్వీస్ ప్యాకేజీ రూపొందించబడింది.

సౌకర్యవంతమైన ఇంటీరియర్: హ్యుందాయ్ క్రెటా చక్కగా డిజైన్ చేయబడిన ఇంటీరియర్‌ని కలిగి ఉంది. కుటుంబ అవసరాల కోసం ఈ కారు పెద్ద డిజైన్‌తో వస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు మరియు తగినంత లెగ్ రూమ్‌తో, క్రెటా ప్రయాణీకులకు స్మూత్ ప్రయాణాన్ని ఆస్వాదించడానికి సౌకర్యవంతమైన కారుగా ఉండనుంది. లగేజీ క్యారీ చేయడం కోసం క్రెటా భారీ బూట్ స్పేస్‌ని అందిస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








