ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్లీ రాదు.. కేవలం రూ.4.69 లక్షలకే కారు.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ కావొద్దు!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా ఉన్నటువంటి రెనాల్ట్(Renault) ఇండియా మార్కెట్లో ఉన్న సానుకూలతను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది. ఇతర కంపెనీలకు పోటీగా తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తన మోడళ్లపై రెనాల్ట్ భారీ తగ్గింపులు, డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తుంది. దసరా, దీపావళి పండుగ సమయంలో దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులపై తగ్గింపులు అందించగా, వినియోగదారులు ఈ ఆఫర్ల సమయంలో ఎక్కువగా కార్లను కొనుగోలు చేశారు. అయితే ఈ టైంలో కార్లను కొనుగోలు చేయలేకపోయన వారిని దృష్టిలో పెట్టుకుని రెనాల్ట్ నవంబర్‌లో బిగ్ గుడ్‌న్యూస్‌ను తీసుకొచ్చింది. రెనాల్ట్ తన క్విడ్, కైగర్, ట్రైబర్ కార్లపై తగ్గింపులను ప్రకటించింది. ఈ ఆఫర్లు దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ డీలర్‌షిప్‌లలో లభిస్తాయి. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింది కథనంలో చూద్దాం..

రెనాల్డ్ కైగర్(Renault Kiger): దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఈ మోడల్ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. రెనాల్ట్‌లో కైగర్ చాలా ప్రత్యేమైనది. దీని డిజైన్ ఆకట్టుకుంటుంది కంపెనీ ఆఫర్‌లో భాగంగా ఈ కారుపై దాదాపు రూ.60,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు అందిస్తుంది.

Renault 2024 November Big Discounts On Kiger

వీటిలో రూ.25,000 వరకు క్యాష్ తగ్గింపు, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.20,000 వరకు లాయల్టీ క్యాష్ తగ్గింపులు ఉన్నాయి. ప్రస్తుతం కైగర్ ధర రూ. 6 నుండి రూ. 11.23 లక్షలు (ఎక్స్-షోరూమ్- న్యూఢిల్లీ) మధ్య ఉంది. తక్కువ ధరలో కారు కావాలనే వారికి ఇది మంచి అవకాశం.

కైగర్ 1-లీటర్ పెట్రోల్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ ఆటోమేటిక్ (AMT), CVT గేర్‌బాక్స్‌లను జత చేశారు. మైలేజ్ పరంగా ఇది 18.24 నుండి 20.5 kmpl వరకు ఇస్తుంది. ఈ కారులో 5 మంది ప్రయాణించవచ్చు. ఒక కుటుంబానికి ఇది బాగా సరిపోతుంది. ప్రయాణికుల భద్రత పరంగా కూడా ఇది చాలా బెస్ట్.

దీనిలో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లు. కారు లోపల క్యాబిన్‌లో కూడా అధునాతన ఆప్షన్లు ఉన్నాయి. లోపల 8- ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ వంటి దాదాపు డజనుకుపైగా ఫీచర్లు ఉన్నాయి.

రెనాల్ట్ క్విడ్(Renault kwid): ఈ హ్యాచ్‌బ్యాక్ చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కనిష్ట ధర రూ.4.69 లక్షలు, గరిష్ట ధర రూ.6.45 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. తక్కువ ధరలో లభిస్తున్న కారు ఇదొక్కటే. ధర తక్కువగా ఉన్నప్పటికి దీని పనితీరు అద్బుతంగా ఉంటుంది.

Renault 2024 November Big Discounts On Kwid

ఇక కంపెనీ ప్రకటించిన ఆఫర్ ప్రకారం, ఈ కారుపై దాదాపు రూ.40,000 వరకు తగ్గింపు ఉంది. దీనిలో రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు లాయల్టీ క్యాష్ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ ఆఫర్లను వాడుకుని తక్కువ ధరలో కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.

ఇది 21.46 నుండి 22.3 kmpl మైలేజీని ఇస్తుంది. 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌‌తో 68 PS హార్స్ పవర్, 91 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చింది. 5 మంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉన్న కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, భద్రతకు ఎయిర్‌బ్యాగులు వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెనాల్ట్ ట్రైబర్(Renault triber): ఇది కుటుంబ వినియోగదారులకు బాగా సరిపోయే MPV. ట్రైబర్ ధర రూ.6 లక్షల నుంచి రూ.8.97 లక్షలుగా ఉంది. ఈ కారుపై దాదాపు రూ.50,000 తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.20,000 లాయల్టీ క్యాష్ తగ్గింపులు ఉన్నాయి.

Renault 2024 November Big Discounts On Triber

ఈ కారులో రెండు కుటుంబాలు అంటే దాదాపు 7 మంది ఈజీగా ప్రయాణించవచ్చు. ఇది 18.2 నుండి 20 kmpl మైలేజీని ఇస్తుంది. ఇంజిన్ పరంగా 1-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా రన్ అవుతుంది. ఇది 72 PS హార్స్‌పవర్, 96 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్‌, ఆపిల్ కార్‌ప్లే వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, November 8, 2024, 8:20 [IST]
English summary
Renault 2024 november big discounts on kiger kwid triber models up to 60000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+