రెనాల్ట్ డస్టర్‌కి 3 స్టార్ రేటింగ్.. సేఫ్టీలో ఇక ఏ ఢోకా ఉండదు!!
ఇండియాలో రెనాల్ట్ కారులలో ఇష్టపడే మోడల్ అని అడిగితే వెంటనే 5-సీటర్ డస్టర్ పేరు చెబుతారు. ప్రస్తుతం రెనాల్ట్ డస్టర్ సెకండ్ జనరేషన్ మార్కెట్‌లో ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది. తాజాగా 3rd జనరేషన్ డస్టర్ యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 3 స్టార్ రేటింగ్‌ని సాధించింది. ఈ 3rd జనరేషన్ డస్టర్ 2025లో భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఈ యూరో-స్పెక్ డస్టర్ కోసం యూరో NCAP సేఫ్టీ రేటింగ్ ఇక్కడ తయారైన ఇండియా-స్పెక్ మోడల్‌కి వర్తించదు. తాజాగా పరీక్షించిన ఈ మోడల్ 1.6-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్ట్రెయిన్‌తో కూడిన లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు ఏడీఏఎస్ ఫీచర్లను కలిగి ఉంది.
ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్‌లో డస్టర్ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ స్థిరంగా ఉంది. డ్రైవర్, ప్రయాణికుడి మోకాళ్ళు తొడ ఎముకలు సేఫ్టీగానే ఉన్నాయి. అయితే ఈ పరీక్షలో డ్రైవర్ ఛాతీ రక్షణ బలహీనంగా ఉందని సూచించింది. ఫుల్ బారియర్ టెస్ట్‌లో, డ్రైవర్ మరియు వెనుక ప్రయాణికుడి ఛాతీకి రక్షణ లభిస్తుంది.ఇక కీలకమైన సైడ్ బారియర్ టెస్ట్‌లోని సైడ్ పోల్ ఇంపాక్ట్‌లో క్లిష్టమైన శరీర ప్రాంతాల రక్షణలో ఈ కారు అద్భుతంగా రాణించింది.

భారతదేశంలో ఎస్‌యూవీలకు ఇది మంచి సమయమని గ్రహించిన రెనాల్ట్ ఈ ఎస్‌యూవీని తిరిగి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ రెనాల్ట్ డస్టర్ 5 సీట్ల కారుగా ఉంది. ఈ ఎస్‌యూవీకి చెందిన 7 సీట్ల కారు కూడా పైప్ లైన్‌లో ఉందని మేము ఇంతకు ముందు నివేదించాము. త్వరలోనే ఇది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుత డస్టర్ పొడవు 4.34 మీటర్లు కాగా, మూడు వరుసల మోడల్ మొత్తం 4.6 మీటర్ల పొడవు ఉంటుంది. అంతేకాకుండా, వెనుక ఓవర్ హాంగ్ మరియు పెద్ద డోర్లకు అనుగుణంగా వీల్ బేస్ కొలతలను కూడా పెంచనున్నారు. స్టాండర్డ్ డస్టర్‌తో పోలిస్తే వెనుక డిజైన్ కాస్త భిన్నంగా ఉంటుంది. బాడీ ప్యానెల్స్, మెకానికల్ పవర్ట్రెయిన్ ఆప్షన్లను పంచకుటుంది.

ఇక రాబోయే 7-సీటర్ ఎస్‌యూవీ న్యూజెన్ డస్టర్ అనేక సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రీమియం కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త ఫీచర్లను కూడా చేర్చనుంది. ఈ కారులో ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ ప్లే, ప్రీమియం సౌండ్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్, ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.
ఈ గ్లోబల్-స్పెక్ డస్టర్ వివిధ మార్కెట్లు మరియు డ్రైవింగ్ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఇంజిన్ ఆప్షన్‌ల శ్రేణిని కలిగి ఉంది. ఇందులో 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 48 వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు హైబ్రిడ్ కాన్ఫిగరేషన్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడిన 1.6-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి.
ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ మరియు సిట్రోయెన్ సీ 3 ఎయిర్‌క్రాస్ 7-సీటర్ వెర్షన్ వంటి వాటితో పోటీపడుతుంది. ఈ కారు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక దాని పనితీరు తెలియరానుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








