రెనాల్ట్ కార్లపై గొప్ప డిస్కౌంట్స్!.. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదండోయ్..
భారతీయ మార్కెట్లో ఆధునిక వాహనాలు లాంచ్ అవుతున్న తరుణంలో.. కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తుల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్ ఇప్పటికే ఈ వరుసలో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి రెనాల్ట్ ఇండియా(Renault India) చేరింది.
రెనాల్ట్ ఇండియా ఇప్పుడు తన కైగర్, క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ సెవెన్ సీటర్ కార్ల కొనుగోలు మీద ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్ వంటి వాటితో పాటు.. అడిషినల్ రెఫరల్, కార్పొరేట్ మరియు లాయల్టీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అంతే కాకుండా బ్రాండ్ యొక్క వెహికల్ స్క్రాపేజ్ స్కీమ్‌ను పొందేందుకు ఎంచుకున్న కస్టమర్‌లకు రెనాల్ట్ అదనపు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాన్ని అందిస్తోంది.

రెనాల్ట్ కైగర్
కైగర్ కొనుగోలుపైన కంపెనీ ఈ నెలలో (2024 మే) రూ.40000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. హ్యుందాయ్ ఎక్స్‌టర్, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న రెనాల్ట్ కైగర్ ధర రూ.6.00 లక్షల నుంచి రూ.11.23 లక్షల మధ్య ఉంటుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉన్న ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.
రెనాల్ట్ క్విడ్
2024 మే నెలలో ఈ కారు కొనుగోలుపైనా గరిష్టంగా రూ. 40000 తగ్గింపు పొందవచ్చు. అత్యంత ప్రజాదరణ పొందిన క్విడ్ ధర దేశీయ విఫణిలో రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.45 లక్షల మధ్య ఉంటుంది. ఇది 68 హార్స్ పవర్ డెలివరీ చేసే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఎంపికలలో లభిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ కంపెనీ యొక్క ట్రైబర్ సెవెన్ సీటర్ మీద రూ. 35000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. మార్కెట్లో ట్రైబర్ ధర రూ. 6.00 లక్షల నుంచి రూ. 8.98 లక్షల మధ్య ఉంది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.
రెనాల్ట్ ఇండియా ఫ్యూచర్ లాంచెస్
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'రెనాల్ట్ ఇండియా' ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే గతంలో నిలిపివేయబడింది డస్టర్ కారును కంపెనీ మళ్ళీ మార్కెట్లో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే గ్లోబర్ మార్కెట్లో పరిచయం చేయబడిన ఈ కారు.. వచ్చే ఏడాదికి దేశీయ మార్కెట్లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

రెనాల్ట్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఎప్పుడు లాంచ్ చేస్తుంది? ఏ కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేస్తుందనే విషయాలు తెలియాల్సి ఉంది. అంతే కాకుండా కైగర్ కాంపాక్ట్ SUV కూడా రాబోయే రోజుల్లో స్పోర్టి వేరియంట్ రూపంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలుస్తాయి.
గమనిక: రెనాల్ట్ కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే లభిస్తాయి. కాబట్టి రెనాల్ట్ కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఖచ్చితమైన తగ్గింపులు గురించి తెలుసుకోవడానికి సమీపంలోని స్థానిక డీలర్‌ను సంప్రదించండి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.


Click it and Unblock the Notifications








